బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: తెలుగింటి ఆడపడుచు, ఎంపీకి కరోనా పాజిటివ్, రిస్క్ లో సీఎం ? టాప్ లీడర్స్, సినీస్టార్స్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మండ్య: తెలుగింటి ఆడపడుచు, ప్రముఖ బహుబాష నటి, పార్లమెంట్ సభ్యురాలు (MP)కి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ముఖ్యమంత్రికి కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది ? అని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిన మహిళా ఎంపీతో 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి సమావేశం అయ్యి అనేక విషయంపై చర్చించారు. ఇప్పుడు మహిళా ఎంపీకి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ముఖ్యమంత్రితో పాటు కొందరు మంత్రులు, సినీ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఆమె సొంత నియోజక వర్గంలోని రాజకీయ పార్టీ ప్రముఖులు, ప్రజలు కరోనా వైరస్ భయంతో హడలిపోతున్నారని తెలిసింది.

ఆంధ్రా సీఎం జగన్ కు జై, చూసి నేర్చుకోండి,నిన్న పవర్ స్టార్,సోనియా కే షాక్, కరోనా టైంలో,సిద్దూ ఝలక్ !ఆంధ్రా సీఎం జగన్ కు జై, చూసి నేర్చుకోండి,నిన్న పవర్ స్టార్,సోనియా కే షాక్, కరోనా టైంలో,సిద్దూ ఝలక్ !

తెలుగింటి ఆడపడుచు

తెలుగింటి ఆడపడుచు

ప్రముఖ బహుబాష నటి, తెలుగింటి ఆడపడుచు స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ ను వివాహం చేసుకుని బెంగళూరులో సెటిల్ అయ్యారు. కేంద్ర మంత్రిగా, కర్ణాటక రాష్ట్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన రెబల్ స్టార్ అంబరీష్ అనారోగ్యంతో మరణించారు. తరువాత అంబరీష్ రాజకీయ వారసురాలిగా రాజకీయాల్లో రావాలని సుమలత, ఆమె కుమారుడు అభిషేక్ మీద వారి అభిమానులు ఒత్తిడి చేశారు.

సత్తాచాటిన సుమలత

సత్తాచాటిన సుమలత

మండ్య లోక్ సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం సుమలత చివరి వరకు చాలా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల పొత్తులో భాగంగా లోక్ సభ ఎన్నికల సీటు అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామికి కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతకు బీజేపీ నాయకులు పరోక్షంగా మద్దతు ఇవ్వడంతో మండ్య ఎంపీగా విజయం సాధించి అప్పటి కర్ణాటక సీఎం హెచ్.డీ. కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామిని చిత్తుగా ఓడించి తన సత్తా చాటుకున్నారు.

సుమలతకు కరోనా పాజిటివ్

సుమలతకు కరోనా పాజిటివ్

జులై 4వ తేదీ శనివారం ఎక్కువ తలనొప్పి కావడంతో స్వల్పఅనారోగ్యానికి గురైన సుమలత వైద్యపరీక్షలు చేయించుకున్నారు. మండ్య ఎంపీ సుమలతకు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు సోమవారం ఆమె కరోనా పాజిటివ్ అని నిర్దారించారు. తనకు కరోనా వైరస్ పాజిటివ్ అని తెలిసిన వెంటనే తాను హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నానని, తాను త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు అని మండ్య లోక్ సభ ఎంపీ సుమలత సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

10 రోజుల క్రితం సీఎంతో మీటింగ్

10 రోజుల క్రితం సీఎంతో మీటింగ్

కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ స్మారక మందిరం నిర్మాణం విషయంలో ఆయన భార్య, మండ్య ఎంపీ సుమలత అంబరీష్ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో బెంగళూరులో భేటీ అయ్యారు. ఆ సమయంలో సీఎం బీఎస్. యడియూరప్పతో పాటు కొందరు ఐఏఎస్ అధికారులతో సుమలత చర్చించారు. సీఎం బీఎస్. యడియూరప్పతో భేటీ అయిన సమయంలో ఎంపీ సుమలత చాలా ఆరోగ్యంగానే ఉన్నారు.

బీజేపీ లీడర్స్, సినీ ప్రముఖులు

బీజేపీ లీడర్స్, సినీ ప్రముఖులు

కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ స్మారక మందిరం నిర్మాణం కోసం కర్ణాటక ప్రభుత్వం రూ. 5 కోట్లు నిధులు మంజూరు చేసింది. అంబరీష్ స్మారక మందిరం నిర్మాణం పనుల బాధ్యతలను అంబరీష్ పౌండేషన్ కమిటీ భుజాలకు ఎత్తుకుంది. కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పను సుమలత కలిసిన సమయంలో ఆమె వెంట ప్రముఖ నటుడు దొడ్డన్న, ప్రముఖ నిర్మాత, నటుడు రాక్ లైన్ వెంకటేశ్, సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్, ఐఏఎస్ అధికారులు, పోలీసు అధికారులు ఉన్నారు.

సీఎంతో సహ అందరికి హడల్

సీఎంతో సహ అందరికి హడల్

ఇప్పుడు సుమలతకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పతో పాటు బీజేపీ నాయకులు, సినీ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఇన్ని రోజులు సుమలతతో పాటు మండ్య లోక్ సభ నియోజక వర్గంలో సంచరించిన రాజకీయ ప్రముఖులు హడలిపోతున్నారు. మండ్య లోక్ సభ నియోజక వర్గంలోని కరోనా వైరస్ వ్యాపించిన ప్రాంతాల్లో సంచరించడం వలనే సుమలతకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసింది.

English summary
Coronavirus: Karnataka MP Sumalatha Ambareesh tested positive for Coronavirus, this report has caused concern in BJP circles as she had recently met Karnataka Chief Minister BS Yediyurappa on June 29th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X