వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus దెబ్బ: కర్ణాటకలో ప్రజలకు ప్రతిరోజూ 7. 5 లక్షల లీటర్ల పాలు ఫ్రీ, సూపర్ సీఎం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) వ్యాధిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో సహ అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు పేదలను అదుకుంటున్నాయి. కర్ణాటక ప్రభుత్వ అనుభంద సంస్థ అయిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF)నుంచి పేదలకు ఉచితంగా పాలు సరఫరా చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రోజూ 69 లక్షల లీటర్ల పాలు

రోజూ 69 లక్షల లీటర్ల పాలు

కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) సంస్థ కర్ణాటకలోని రైతుల దగ్గర ప్రతిరోజు 69 లక్షల పాలు కొనుగోలు చేస్తోంది. రైతుల దగ్గర కొనుగోలు చేసిన పాలును నందిని మిల్క్ పేరుతో KMF కర్ణాటకతో పాటు ఆ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాల్లోని జిల్లాలో విక్రయిస్తున్నారు.

KMF పాలకు లాక్ డౌన్ దెబ్బ

KMF పాలకు లాక్ డౌన్ దెబ్బ

కరోనా వైరస్ ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాల ప్రజలు వారి సొంత ఊర్లకు వెళ్లిపోయారు. ఈ సందర్బంలొ KMF సంస్థకు చెందిన నందిని పాలు విక్రయాలు భారీగా తగ్గిపోయాయి.

KMF, అధికారులతో సీఎం !

KMF, అధికారులతో సీఎం !

KMFకు చెందిన నందిని పాల విక్రయాలు భారీగా పడిపోవడంతో ఆ సంస్థ అధికారులు ఆందోళనకు గురైనారు. మిగిలిపోయిన పాలతో వెన్న, నెయ్యి తయారు చేస్తున్నారు. అయినా పాలు మిగిలిపోవడంతో అధికారులు సీఎం బీఎస్. యడియూరప్పతో పాటు కేఎంపీ సంస్థ ప్రతినిధులకు అసలు విషయం చెప్పారు.

ప్రజలకు పాలు ఫ్రీగా ఇచ్చేయండి

ప్రజలకు పాలు ఫ్రీగా ఇచ్చేయండి

KMF సంస్థ కొనుగోలు చేస్తున్న పాలు విక్రయించగా ప్రతిరోజు అందులో 7. 5 లక్షల లీటర్ల పాలు మిగిలిపోతున్నాయి. ప్రజలు పాలు కొనుగోలు చెయ్యడం లేదని రైతుల దగ్గర పాలు కొనుగోలు చెయ్యకపోతే వారు నష్టపోతారని సీఎం బీఎస్. యడియూరప్ప అధికారులకు చెప్పారు. రైతులు నష్టపోకుండా ఉండాలంటే ప్రతి రోజు మిగిలిపోతున్న 7. 5 లక్షల నందిని పాలు మురికివాడలు, కార్మికులు నివాసం ఉంటున్న లేబర్ కాలనీలలో ఉచితంగా పంపిణి చెయ్యాలని సీఎం బీఎస్. యడియూరప్ప అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సూపర్ సీఎం

సూపర్ సీఎం

లాక్ డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు, మురికవాడలలో నివాసం ఉంటున్న పేదలకు ఉచితంగా పాలు పంపిణి చెయ్యాలని, ఆ పాలుకు ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తుందని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మీడియాకు చెప్పారు. లాక్ డౌన్ అమలు అయ్యే అన్ని రోజులు పేదలకు ఉచితంగా 7.5 లక్షల లీటర్ల పాలు ఉచితంగా పాలు పంపిణి చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప నిర్ణయం తీసుకోవడంతో ఆయన్ను పలువురు అభినందిస్తున్నారు.

English summary
Conavirus In Karnataka: CM Yediyurappa Orders To KMF For Free Milk Supply. KMF daily residue Milk will supply to some poor people area, he siad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X