బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కొడుకు పెళ్లితో మాజీ సీఎంకు కరోనా కష్టాలు, పగ, ప్రతీకారం, బెంగళూరు అల్లర్లు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మైసూరు: కరోనా వైరస్ (COVID 19) రాజకీయాలకు కొదవలేకుండా పోయింది. బెంగళూరు నగరంలోని పాదరాయనపురలోని కరోనా వైరస్ రోగులను కరోనా గ్రీన్ జోన్ అయిన రామనగర జైలుకు తరలించి తన మీద పగ పత్రీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. తన మీద ఏదైనా పగ ఉంటే వేరే విదంగా పోరాటం చెయ్యాలని, అంతే కాని కరోనా వైరస్ వ్యాధి రోగులను గ్రీన్ జోన్ కు తరలించి అక్కడి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకూడదని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి ఆరోపించారు. కరోనా గ్రీన్ జోన్ అయిన రామనగర జిల్లాలో ఇటీవల మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి ఆయన కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి వివాహం చేసిన విషయం తెలిసిందే. రామనగరలో కరోనా వైరస్ కేసులు పెరిగితే మాజీ సీఎం కుమారస్వామి కారణం అవుతారని నిఖిల్ పెళ్లి రోజే బీజేపీ నాయకులు ఆరోపించారు.

Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!

బెంగళూరు నిందితులు

బెంగళూరు నిందితులు

బెంగళూరు నగరంలోని పాదరాయనపురలో కరోనా వైరస్ వ్యాధి ఎక్కువగా వ్యాపించడంతో అక్కడ అనుమానిత రోగులను క్వారంటైన్ కు తరలించడానికి వెళ్లిన పోలీసులు, వైద్య, సిబ్బంది, ఆశా వర్కర్లు, బీబీఎంపీ అధికారుల మీద స్థానికులు దాడులు చేశారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై దాడి చేసిన పాదరాయనపురలోని 119 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుల్లో 5 మందికి కరోనా

నిందితుల్లో 5 మందికి కరోనా

పాదరాయనపురలో అరెస్టు అయిన 119 మందిని రామనగర జిల్లా జైలుకు తరలించారు. పాదరాయనపురలో అరెస్టు చేసిన వారిలో గురువారం ముగ్గురికి, శుక్రవారం మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న రామనగర జిల్లా జైలులోని ఖైదీలు పాదరాయనపురకు చెందిన నిందితులు అందర్నీ వేరే జైలుకు తరలించాలని శుక్రవారం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నా మీద పగ, మాజీ సీఎం కుమారస్వామి

నా మీద పగ, మాజీ సీఎం కుమారస్వామి

రామనగర జిల్లా కరోనా గ్రీన్ జోన్ గా ఇప్పటికే గుర్తించారు. అయితే రామనగరలో కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో మాజీ ముఖ్యమంత్రి, అదే జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన హెచ్.డీ. కుమారస్వామి కర్ణాటక జైళ్ల శాఖ ఏడీజీపీ అలోక్ మోహన్ మీద ఆరోపణలు చేస్తున్నారు. తన మీద పగతో నే పాదరాయనపురలో అరెస్టు చేసిన కరోనా వైరస్ వ్యాధి రోగులను రామనగర జిల్లా జైలుకు తరలించారని, తన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఏడీజీపీ అలోక్ మోహన్ ప్రయత్నిస్తున్నారని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు.

నేను సీఎంగా ఉన్నప్పుడు ప్రాధేయపడ్డాడు !

నేను సీఎంగా ఉన్నప్పుడు ప్రాధేయపడ్డాడు !

తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలీసు అధికారి అలోక్ మోహన్ తన దగ్గరకు వచ్చి బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ పోస్టు తనకు ఇవ్వాలని ప్రాధేయపడ్డాడని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి అన్నారు. ఆ సమయంలో అలోక్ కుమార్ బ్యాగ్రౌండ్ తెలుసుకుని ఆయనకు ఆ పదవి ఇవ్వడానికి తాను నిరాకరించానని, ఆ విషయం మనసులో పెట్టుకుని ఈ రోజు తన మీద పగ తీర్చుకుంటున్నాడని మాజీ సీఎం కుమారస్వామి సీనియర్ పోలీసు అధికారి, జైళ్ల శాఖ ఏడీజీపీ అలోక్ మోహన్ మీద ఆరోపణలు చేశారు.

సీఎం చెప్పాలేదు, మరెవరు చెప్పారు ?

సీఎం చెప్పాలేదు, మరెవరు చెప్పారు ?

బెంగళూరులోని పాదరాయనపురలో అరెస్టు చేసిన వారిని రామనగర జిల్లా జైలుకు తరలించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప చెప్పలేదని, హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ చెప్పలేదని అంటున్నారు, మరెవరు వారిని అరెస్టు చేసి అక్కడికి తరలించాలని ఏడీజీపీ అలోక్ మోహన్ కు చెప్పారు ? అని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి ప్రశ్నించారు.

కొడుకు పెళ్లితో కరోనా కష్టాలు ?

కొడుకు పెళ్లితో కరోనా కష్టాలు ?

కరోనా గ్రీన్ జోన్ గా ఉన్న రామనగర జిల్లాలోని సొంత ఫాం హౌస్ లో ఇటీవల మాజీ సీఎం కుమారస్వామి ఆయన కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ వివాహం జరిపించారు. గ్రీన్ జోన్ గా ఉన్న రామనగరలో కరోనా వైరస్ కేసులు నమోదైతే అందుకు మాజీ సీఎం కుమారస్వామి కారణం అని రామనగర జిల్లా బీజేపీ అధ్యక్షుడు రుద్రేష్ అప్పట్లోనే ఆరోపణలు చేశారు.

Recommended Video

Lockdown : PM Narendra Modi Interacted With Village Panchayats Via Video Conference
గేమ్స్ ఆడుతున్నారా ?

గేమ్స్ ఆడుతున్నారా ?

పాదరాయనపురలో అరెస్టు చేసిన వారికి కరోనా వైరస్ ఉందని తెలిసినా వారిని క్వారంటైన్ కు తరలించకుండా కావాలనే రామనగర జిల్లా జైలుకు తరలించారని, ఆ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయని చాటిచెప్పి తన మీద పగ, ప్రతీకారం తీర్చుకుంటున్నారని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి ఆరోపించారు. తన మీద పగ ఉంటే వేరే రకంగా తీర్చుకోవాలని, ఇలా కరోనాను అడ్డం పెట్టుకుని ప్రతీకారం తీర్చుకోరాదని మాజీ సీఎం కుమారస్వామి కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం, పోలీసు అధికారులపై మండిపడుతున్నారు.

English summary
Coronavirus: Karnataka former CM HD Kumaraswamy Alleges On ADGP Alok Mohan For Shifting Padarayanapura Prisoners To Ramanagar Prison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X