బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: దెబ్బకు దెయ్యం వదిలింది, హోమ్ క్వారంటైన్ కు ఈ -ట్యాగ్స్ లింక్, బయట తిరిగితే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్, లాక్ డౌన్ నియమాలు మరింతకఠినం చెయ్యాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటకలో హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వారు బయటకు వచ్చి నానా రచ్చ చెయ్యకుండా చూడటానికి మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి, COVID -19 నిర్మూలణ ఇన్ చార్జ్ మంత్రి ఆర్. అశోక్ అన్నారు. ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు, వైద్య విద్యాశాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ తరువాత కర్ణాటకలో కోవిడ్ 19 నివారణకు ముచ్చటగా మూడో మంత్రి ఎంట్రీ ఇచ్చారు. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వారి మీద ప్రతిరోజు 24 గంటలు నిఘా వెయ్యడానికి ప్రత్యేక ఈ- ట్యాగ్స్ తయారు చేయించారు. హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వారు బయట సంచరించకుండా చూడటానికి ఆ ఈ- ట్యాగ్స్ ను కోవిడ్ -19 కంట్రోల్ రూంకు అనుసంధానం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి. ఆర్ అశోక్ మీడియాకు చెప్పారు. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలోకి క్వారంటైన్ లో ఉంటున్న వారికి స్టార్ హోటల్ నుంచి భోజనాలు సరఫరా చేస్తున్నామని మంత్రి ఆర్. అశోక్ మీడియాకు చెప్పారు.

Coronavirus: మంత్రి ఫ్యామిలీలో ముగ్గురికి కరోనా, ఇల్లు సీల్ డౌన్, పక్కనే పవర్ స్టార్ ఫ్యామిలీ !Coronavirus: మంత్రి ఫ్యామిలీలో ముగ్గురికి కరోనా, ఇల్లు సీల్ డౌన్, పక్కనే పవర్ స్టార్ ఫ్యామిలీ !

క్వారంటైన్ లో ఉంటో ఈ- ట్యాగ్ లింక్

క్వారంటైన్ లో ఉంటో ఈ- ట్యాగ్ లింక్

ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వారు ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి బయట విచ్చలవిడిగా సంచరిస్తున్నారని తెలిసిందని, అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక రెవెన్యూ శాఖా మంత్రి, COVID-19 వ్యాధి నిర్మూలణ కమిటి ఇన్ చార్జ్ మంత్రి ఆర్. అశోక్ సోమవారం మీడియాకు చెప్పారు. హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వారికి ఇక ముందు ప్రత్యేకంగా ఈ- ట్యాగ్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఆర్. అశోక్ చెప్పారు.

క్వారంటైన్ కు స్టార్ హోటల్ ఫుడ్

క్వారంటైన్ కు స్టార్ హోటల్ ఫుడ్

బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆసుపత్రిలోకి కరోనా క్వారంటైన్ లో ఉంటున్న వారికి తాజ్, ఎట్రియా తదితర స్టార్ హోటల్స్ నుంచి ఆహారం సరఫరా చేస్తున్నామని మంత్రి ఆర్. అశోక్ అన్నారు. బీపీ, కిడ్ని తదితర సంబంధిత వ్యాధులతో భాదపడుతూ క్వారంటైన్ లో ఉంటున్న వారికి ఆహారం అందించడానికి వైద్యుల సలహాలు, సూచనల మేరకు ప్రత్యేకంగా వంటలు చేయిస్తున్నామని, ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తున్నామని మంత్రి ఆర్. అశోక్ మీడియాకు చెప్పారు.

550 బెడ్ లు, 20 ఐసీయులు

550 బెడ్ లు, 20 ఐసీయులు


బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆసుపత్రిలోని క్వారంటైన్ లో ఉంటున్న వారి బెడ్ నెంబర్, పేషేంట్ నెంబర్ రెండు లింక్ చేశామని మంత్రి ఆర్. అశోక్ వివరించారు. విక్టోరియా ఆసుపత్రిలో 550 బెడ్ లు (పడకలు ) ఉన్నాయని మంత్రి ఆర్. అశోక్ వివరించారు. ప్రస్తుతం కరోనా రోగుల కోసం 282 పడకలు, 20 ఐసీయూ వార్డులు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఆర్. అశోక్ వివరించారు.

క్వారంటైన్ ట్యాగ్ కంట్రోల్ రూంకు లింక్

క్వారంటైన్ ట్యాగ్ కంట్రోల్ రూంకు లింక్

వివిద రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వస్తున్న వారు కచ్చితంగా క్వారంటైన్ లో ఉండాలని మంత్రి ఆర్. అశోక్ స్పష్టం చేశారు. హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వారికి కచ్చితంగా ఈ ట్యాగ్ తగిలిస్తున్నామని, వారు క్వారంటైన్ నియమాలు ఉల్లంఘించకుండా ఆ ఈ ట్యాగ్ ను కోవిడ్ 19 కంట్రోల్ రూంకు లింక్ చేశామని, ఎవరైనా క్వారంటైన్ లో నుంచి బయటకు వచ్చి రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు తిరిగితే కంట్రోల్ రూంలో తమకు సమాచారం అందుతుందని, తరువాత వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆర్. అశోక్ హెచ్చరించారు.

 రూ. 742 కోట్లు విడుదల

రూ. 742 కోట్లు విడుదల


ఎస్ డీఆర్ ఎఫ్ లో భాగంగా కరోనా కట్టడికి ప్రత్యేకంగా రూ. 742 కోట్లు విడుదల చేశామని మంత్రి ఆర్. అశోక్ అన్నారు. జిల్లాధికారులకు రూ. 232 కోట్ల విడుదల చేస్తున్నామని, ఆరోగ్య శాఖకు రూ. 70 కోట్లు, బీబీఎంపీ (Bengaluru) రూ. 50 కోట్లు విడుదల చేస్తామని మంత్రి ఆర్. అశోక్ వివరించారు. బెంగళూరు నగరంలోని అన్ని పార్టీల కార్పోరేటర్లు అందరికి మూడు బ్యాచ్ ల్లో మీటింగ్ ఏర్పాటు చేశామని, ప్రతి వార్డుకు రూ. 25 లక్షలు కేటాయించి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆర్. అశోక్ వివరించారు.

కరోనా కట్టడికి టాస్క్ ఫోర్స్

కరోనా కట్టడికి టాస్క్ ఫోర్స్

బెంగళూరు సిటీలో కరోనా వైరస్ కట్టడికి క్యాప్టెన్ మణివన్నన్ (ఐఏఎస్ అధికారి) ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. టాస్కోఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో ప్రతిరోజు 24 గంటలు కరోనా వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న అన్ని జాగ్రత్తల వివరాలు అధికారులుతెలుసుకుంటున్నారు. అదే విధంగా కరోనా టాస్క్ ఫోర్స్ కంట్రోల్ రూం నుంచి క్వారంటైన్ లో ఉంటున్న వారికి ఏర్పాటు చేసిన ఈ ట్యాగ్ ల లింక్ వివరాలు తెలుసుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి ఆర్. అశోక్ మీడియాకు చెప్పారు.

English summary
Coronavirus: Karnataka Revenue minister R Ashoka is the third covid-19 in-charge fo Karnataka after B Sreeramulu and K. Sudhakar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X