వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: సీఎం సంచలన నిర్ణయం, వీళ్లకు కరోనా హాలిడేస్, ప్రజలకు మాత్రమే రూల్స్, అబ్బా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు విదేశాల నుంచి వస్తున్న వారిని, దేశంలోని ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వెలుతున్న వారిని ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తోంది. విమానాల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించే వారు కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి డీవీ. సదానందగౌడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉండటానికి అనిరాకరించారు. ఇదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం క్వారంటైన్ నియమాలను సడలిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు సీనియర్ అధికారులు ఎవరైనా విమాన ప్రయాణం చేస్తే వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.

Lockdown: ఒరేయ్.... నువ్వు ముస్లీం కదా ?, గడ్డం లాయర్ కు వాతలు, లేపేస్తాం అని ఇంట్లో వార్నింగ్ !Lockdown: ఒరేయ్.... నువ్వు ముస్లీం కదా ?, గడ్డం లాయర్ కు వాతలు, లేపేస్తాం అని ఇంట్లో వార్నింగ్ !

 విమాన ప్రయాణికులకు విజ్ఞప్తి

విమాన ప్రయాణికులకు విజ్ఞప్తి

దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. విమానంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెలుతున్న వారు ఆ రాష్ట్ర ప్రభుత్వ నియమాల ప్రకారం క్వారంటైన్ లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అయిన తరువాత విమాన ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.

 కేంద్ర మంత్రి దెబ్బతో రివర్స్ !

కేంద్ర మంత్రి దెబ్బతో రివర్స్ !

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం కేంద్ర మంత్రి డీవీ. సందానందగౌడ సోమవారం బెంగళూరుకు విమానంలో వెళ్లారు. ఆ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి వెళ్లడానికి కేంద్ర మంత్రి సదానందగౌడ నిరాకరించారు. తాను కేంద్ర మంత్రిని, తాను ఎందుకు క్వారంటైన్ కేంద్రానికి వెళ్లాలి ? అని డీవీ. సదానందగౌడ అధికారులను ప్రశ్నించడంతో అందరూ షాక్ కు గురైనారు.

 ఎదురు తిరిగిన ప్రయాణికులు

ఎదురు తిరిగిన ప్రయాణికులు

ఇతర రాష్ట్రాల నుంచి విమానాల్లో బెంగళూరు చేరుకున్న ప్రయాణికులు చాలా మంది ప్రభుత్వం సూచించిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉండటానికి నిరాకరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే మీరు విమానాల్లో ప్రయాణించడానికి అవకాశం ఇచ్చామని, మీరు కచ్చితంగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలని అధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది విమాన ప్రయాణికులతో వాగ్వివాదానికి దిగుతున్నారు.

 మంత్రులు, అధికారులకు కరోనా రాదా ?

మంత్రులు, అధికారులకు కరోనా రాదా ?

విమాన ప్రయాణికులు, అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడంతో క్వారంటైన్ కేంద్రాల నియమాలను సడలించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర మంత్రులు, కర్ణాటక మంత్రులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు విమానాల్లో ప్రయాణిస్తే వారు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండనవసరం లేదని కర్ణాటక ప్రభుత్వం కొత్తగా ఓ రూల్ పాస్ చేసింది. అధికారులు సైతం కోవిడ్ -19 విధుల్లో ఉంటున్నారని, వారు క్వారంటైన్ కేంద్రాలకు వెళితే ప్రజల సమస్యలు పరిష్కరించడం సాధ్యం కాదని కర్ణాటక ప్రభుత్వం అంటోంది.

 ఆ ల్యాబ్ పరీక్షల రిపోర్టులు ఓకే

ఆ ల్యాబ్ పరీక్షల రిపోర్టులు ఓకే

దేశీయ విమానాల్లో సంచరించే వారు ఐసీఎంఆర్ అనుమతి పొందిన ల్యాబ్స్ లో రెండు రోజుల ముందు పరీక్షలు చేయించుకుని కర్ణాటకకు వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. ఐసీఎంఆర్ అనుమతి పొందిన ల్యాబ్స్ లో కరోనా పరీక్షలు చేయించుకుంటే వారికి వైరస్ ఉందా ? లేదా ? అనే విషయంపై క్లారిటీ వస్తుందని, అలాంటి వారు విమానాల్లో సంచరించినా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, వారు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండనవసరం లేదని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. విమానాల్లో సంచరించే ప్రయాణికులు 14 రోజులు కరోనా క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే విమాన ప్రయాణికుల్లో కొందరికి మాత్రం క్వారంటైన్ వెసులుబాటు కల్పించారు.

English summary
Coronavirus: Karnataka government issued new SOP for inter state passengers. If any person who get a negative COVID - 19 test certificate not more than 2 days old from the date of journey will be exempted from institutional quarantine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X