వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ఎవరి ప్రాణాలకు గ్యారెంటీ లేదు, క్వారంటైన్ లో డాక్టర్లకే దిక్కులేదు, మంత్రి సంచలనం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ తుమకూరు: కరోనా వైరస్ (COVID 19) వ్యాధి ఎప్పుడు ఎవరి నుంచి వస్తుందో ? ఏ సమయంలో ఏం జరుగుతుందో?, తెలీదు, ఇది ఒక మహమ్మారి, ఎవరి ప్రాణాలు గ్యారెంటీ లేదు, క్వారంటైన్ లో కరోనా వైరస్ పాజిటివ్ తో చికిత్స పొందుతున్న డాక్టర్లకే దిక్కులేదని కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నేను ఇన్ చార్జ్ గా ఉన్న జిల్లాలో 8 మంది వైద్యులకు కరోనా వైరస్ వచ్చి క్వారంటైన్ లో మృత్యువుతో పోరాటం చేస్తున్నారని, డాక్టర్ అయిన ఎమ్మెల్యేకి కూడా కరోనా వచ్చిందని మంత్రి అన్నారు, నేను కూడా ప్రస్తుతం కరోనా వైరస్ భయంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని మంత్రి సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురైనారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు విరుద్దంగా సదరు మంత్రి మాట్లాడటంతో ప్రభుత్వ పెద్దలు షాక్ కు గురైనారు.

ఆంధ్రా సీఎం జగన్ కు జై, చూసి నేర్చుకోండి,నిన్న పవర్ స్టార్,సోనియా కే షాక్, కరోనా టైంలో,సిద్దూ ఝలక్ !ఆంధ్రా సీఎం జగన్ కు జై, చూసి నేర్చుకోండి,నిన్న పవర్ స్టార్,సోనియా కే షాక్, కరోనా టైంలో,సిద్దూ ఝలక్ !

 కరోనా కాటుకు హడలిపోతున్న కర్ణాటక

కరోనా కాటుకు హడలిపోతున్న కర్ణాటక

కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో కన్నడిగులు హడలిపోతున్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, తమిళనాడు నుంచి దొంగదార్లలో కర్ణాటకలోకి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి వెలుతున్నారని, వారి వలనే కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 కరోనా పేరు చెబితే ?

కరోనా పేరు చెబితే ?

కర్ణాటకలో ఇప్పటి వరకు 25, 317 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కరోనా వైరస్ చికిత్స విఫలమై ఇప్పటి వరకు 402 మంది మరణించారని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. ఇక తుమకూరు జిల్లాలో కరోనా వైరస్ తాండవం చేస్తోంది. ఇప్పటికే తుమకూరు జిల్లాలో 43 మేకలు, గొర్రెలను క్వారంటైన్ కు తరించి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

 ఎమ్మెల్యే, మహిళా తహసిల్దార్ కు కరోనా

ఎమ్మెల్యే, మహిళా తహసిల్దార్ కు కరోనా

తుమకూరు జిల్లా కుణిగల్ ఎమ్మెల్యే డాక్టర్ రంగనాథ్ కు కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూసింది. తుమకూరు జిల్లాకు చెందిన మహిళా తహసిల్దార్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో క్వారంటైన్ కు తరలించారు. మంగళూరు ఎమ్మెల్యే భరత్ శెట్టికి ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆయన్ను క్వారంటైన్ కు తరలించారు.

 క్వారంటైన్ లో ఫైర్ బ్రాండ్ మంత్రి

క్వారంటైన్ లో ఫైర్ బ్రాండ్ మంత్రి

కరోనా వైరస్ మహమ్మారికి తనామనా అనే తేడా లేదని, ఆ వ్యాధి ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా వ్యాపిస్తోందని కర్ణాటక ఫైర్ బ్రాండ్ మంత్రి, సీఎం బీఎస్. యడియూరప్పకు అత్యంత సన్నిహితుడు, తుమకూరు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి జేసి. మధుస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాధితో అందరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి జేసీ. మధుస్వామి ప్రజలకు మనవి చేశారు.

Recommended Video

షాకింగ్.. MP Sumalatha Ambareesh కు COVID-19 పాజిటివ్! || Oneindia Telugu
 ఎవరి ప్రాణాలకు గ్యారెంటీ లేదు

ఎవరి ప్రాణాలకు గ్యారెంటీ లేదు

కరోనా వైరస్ వ్యాధి సోకి ప్రస్తుతం తుమకూరు జిల్లాలో 8 మంది డాక్టర్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వైద్యులతో పాటు ఎవ్వరి ప్రాణాలకు గ్యారెంటీ లేదని మంత్రి జేసీ. మధుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తుమకూరు లోని COVID-19 ఆసుపత్రిలో చేరిన 8 మంది డాక్టర్ల పరిస్థితి విషమంగా ఉందని మంత్రి జేసీ. మధుస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాధి గురించి ఎక్కువ ఆందోళన చెందుతున్న మంత్రి జేసీ. మధుస్వామి ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ కు పరిమితం అయ్యారు.

English summary
COVID-19: Coronavirus is spreading at the community level in Karnataka, says district-in-charge minister JC Madhuswamy. Medical condition of eight infected with coronavirus admitted in Tumkur Covid-19 Hospital is critical.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X