వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. వీడు మాములోడు కాదుగా, బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకొని, అంబులెన్స్‌లో ఇంటికి వెళ్తూ..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. బయటకి వెళ్లే పరిస్థితి లేదు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు చేస్తున్న పనులు వెలుగుచూస్తున్నాయి. కశ్మీర్‌లో కూడా ఓ యువకుడు..తాను బతికుండగానే చనిపోయినట్టు సర్టిఫికేట్ సృష్టించాడు. వినడానికి విడ్డూరంగా ఉన్న మీరు చదివే అక్షర సత్యమే.

కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు చెందిన హకామ్ దిన్ ఇటీవల గాయపడ్డాడు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతనికి అయిన గాయం తగ్గి.. వైద్యులు డిశ్చార్జ్ చేశారు. బయటకు వెళ్లలేని పరిస్థితి.. లాక్ డౌన్ నేపథ్యంలో ఎలా వెళ్లాలి అని ఆలోచించాడు. ఇందుకోసం తన ముగ్గురు స్నేహితులను పిలిచాడు. అప్పటికే తన మనసులో మెదిలిన ఐడియాను వారితో పంచుకొని.. దానిని కార్యరూపం దాల్చాడు.

coronavirus: Kashmir man fakes death to reach home in ambulance..

బతికున్న దిన్.. చనిపోయినట్టు నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించాడు. ఇందుకు అతని స్నేహితులు సాయపడ్డారు. దానిని చూపి.. ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ మాట్లాడారు. మెల్లగా ఇంటికి బయల్దేరారు. కానీ పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చింది. అంబులెన్స్ ఆపివేశారు. లోపల ఉన్న దిన్‌ను చెక్ చేశారు. అతని బతికి ఉండటం తెలిసి ఆశ్చర్యపోయారు.

ఎందుకిలా చేశారని అడిగితే జరిగిన తతంగం అంతా చెప్పారు. వెంటనే దిన్, సహా అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా నిర్బందించారు. బతికున్న.. చనిపోయినట్టు సర్టిఫికెట్ చూపి వెళ్లడం సరికాదన్నారు. వారితోపాటు.. డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరతామని చెప్పారు.

English summary
man faked his death to reach home in an ambulance in Jammu and Kashmir’s Poonch district during the nationwide lockdown, according to officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X