వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Corona Sweets: జోరుగా వ్యాపారం, ఫ్రీగా ఇస్తే పరుగో పరుగు, వైరల్ పేర్లతో జిమ్మిక్కులు, వైరస్ !

|
Google Oneindia TeluguNews

కోల్ కత్తా: ఏ పేరు ఎక్కువ ప్రచారంలో ఉంటుందో, ఏది వైరల్ అవుతుందో ఆపేర్లతో కొత్తకొత్త వస్తువులు మార్కెట్ లో ప్రత్యక్షం అవుతాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో వైరల్ గా ఉన్న పేరు కరోనా వైరస్. ప్రస్తుతం కరోనా పేరు చెబితే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా హడలిపోతున్నారు. కరోనా అంటే ప్రపంచం మొత్తం ఇచ్చే సమాధానం అది ఓ వైరస్ అని. అయితే ప్రస్తుతం భారతేశంలో కూడా కరోనా బాదితులు ఎక్కువగానే ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో ప్రస్తుతం కరోనా స్వీట్లు తెర మీదకు వచ్చాయి. వివిద రంగుల్లో కరోనా వైరస్ నమూనాలు (లోగో) ఎలా ఉంటాయో అలాంటి స్వీట్లు తయారు చేసి మార్కెట్లో విక్రయాలకు పెట్టారు. చూడటానికి రంగురంగుల్లో కరోనా వైరస్ లోగోలను పోలి ఉండే ఈ స్వీట్లకు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా పేరు పెట్టడంతో అది ఎంత వరకు సక్సస్ అవుతోందో వేచి చూడాలి అంటున్నారు వ్యాపారులు.

Coronavirus: చైనా నుంచి కంటైనర్ లో కరోనా తెచ్చారు, 900 మంది క్వారంటైన్, బీజేపీ ఎమ్మెల్యే !Coronavirus: చైనా నుంచి కంటైనర్ లో కరోనా తెచ్చారు, 900 మంది క్వారంటైన్, బీజేపీ ఎమ్మెల్యే !

 కరోనా పేరు వింటే !

కరోనా పేరు వింటే !

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు విస్తరించింది. కరోనా వైరస్ పేరు చెబితే ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు, ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కంటికి కనపడని కరోనా వైరస్ వ్యాధి ఎప్పుడు ఏలా వ్యాపిస్తుందో చెప్పడానికి ప్రముఖ శాస్త్రవేత్తలు సైతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 కరోనా పేరు వైరల్

కరోనా పేరు వైరల్

ప్రపంచంలోని అన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు కరోనా వైరస్. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి నుంచి మనం తప్పించుకోవాలని భారత్ దేశంలో లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ ఇబ్బందులు ఎన్ని ఉన్నా కరోనా వైరస్ వ్యాధి నుంచి తప్పించుకోవడానికి ప్రజలు అన్ని కష్టాలు ఓపికగా భరిస్తున్నారు.

 మార్కెట్ లోకి కరోనా స్వీట్లు

మార్కెట్ లోకి కరోనా స్వీట్లు

పశ్చిమ బెంగాల్ స్వీట్స్ కు దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ప్రపంచ దేశాల్లో కోల్ కతా స్వీట్లు తినే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కోల్ కతా స్వీట్లు డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలని కొందరు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కరోనా స్వీట్లు తయారు చేసి మార్కెట్ లో విడుదల చేశారు. లాక్ డౌన్ అమలులో ఉన్నా పశ్చిమ బెంగాల్ లో స్వీట్ స్టాల్స్, బేకరీలు తీసి వ్యాపారం చేసుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చిది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపించి ముగ్గురు మరణించారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.

 ఫ్రీగా ఇచ్చినా తినాలంటే !

ఫ్రీగా ఇచ్చినా తినాలంటే !

కరోనా వైరస్ ఎలాగుటుందో అని శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చి ఆ వైరస్ లోగోలను విడుదల చేశారు. కరోనా వైరస్ ఎలాగుటుందో ఆ ఆకారాలు పోలినట్లు కరోనా స్వీట్లు తయారు చేశారు. కోల్ కతాలో కరోనా స్వీట్లు తయారు చేసిన స్వీట్ స్టాల్స్ యజమాని వాటిని ఆ షాపు కస్టమర్లకు, స్థానిక ప్రజలకు ఉచితం ( Free)గా పంపిణి చేస్తున్నారు. కరోనా వైరస్ ను మనం అందరూ కలసికట్టుగా ఎదుర్కోవాలని, అందరూ ప్రభుత్వ నియమాలు పాటించాలని స్వీట్ స్టాల్ యజమాని ప్రజలకు మనవి చేస్తూ కరోనా స్వీట్లు ఫ్రీగా పంచిపెడుతున్నారు. ఫ్రీగా ఇచ్చినా కరోనా పేరుతో ఆ ఆకారంలో ఉన్న స్వీట్లు తినాలంటే ప్రజలు కొంచెం వెనకడుగు వేస్తున్నారు.

 కలర్ ఫుల్ కరోనా స్వీట్లు

కలర్ ఫుల్ కరోనా స్వీట్లు

కోల్ కతాలో కలర్ ఫుల్ కరోనా స్వీట్లు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజలకు ఫ్రీగా పంపిణి చేస్తున్న కరోనా స్వీట్లు బాగా ప్రచారం పొందితే తరువాత క్యాష్ చేసుకోవచ్చని ఆ స్వీట్లు తయారు చేయించిన స్వీట్ స్టాల్ వ్యాపారి అంటున్నారు. వివిద రంగుల్లో కరోనా వైరస్ ఆకారంలో ఉన్న ఈ కరోనా స్వీట్లు తయారు చేసి మార్కెట్ లో పెట్టారు. మొత్తం మీద ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా స్వీట్లు ఎంత వరకు సక్సస్ అవుతాయో వేచి చూడాలి అంటున్నారు వ్యాపారులు.

English summary
Coronavirus: In a West Bengal Kolkata sweet shop is giving Corona sweets to its customers as gift. We will fight and digest corona is a message behind it said owner of the shop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X