Coronavirus: కరోనా వార్డులో వేరే తల్లి బిడ్డకు చనుపాలు ఇచ్చిన నర్సు, సలామ్ తల్లి, గ్రేట్ !
కోల్ కతా: తల్లి పాల కోసం కరోనా వార్డులో ఓ తల్లి బిడ్డ ఆర్తనాదాలు చేస్తోంది. కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు క్వారంటైన్ లో ఉన్న ఆ తల్లి ఆ బిడ్డకు పాలు ఇవ్వలేకపోయింది. అయితే తల్లి ప్రేమకు విలువ కట్టలేమని సాటి తల్లి నిరూపించింది. కరోనా వైరస్ రోగులకు చికిత్సకు సహాయం చేస్తున్న ఓ నర్సు చంటిబిడ్డ పాల కోసం ఏడుస్తున్న విషయం గుర్తించి చలించిపోయింది. తాను కూడా ఓ బిడ్డకు తల్లినే, బిడ్డ ఆకలి ఎలాగుంటుందో తెలిసిన ఆ నర్సు వేరే విషయం ఆలోచించకుండా కరోనా వార్డులో ఉన్న చంటి బిడ్డకు పాలు ఇచ్చింది. కరోనా వార్డులో వేరే మహిళకు పుట్టిన బిడ్డకు చనుపాలు ఇచ్చిన నర్సును ప్రతి ఒక్కరు మెచ్చుకుని చేతులు జోడించి నమస్కరిస్తున్నారు.
Coronavirus: విదేశీ తబ్లీగిలకు ఆశ్రయం, కార్పోరేటర్ కు కరోనా, ఎమ్మెల్యేకి టెన్షన్, తిక్కచేష్టలు !
కరోనా వార్డులో నర్సు
పశ్చిమ బెంగాల్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వలస కూలీలు, కార్మికులు వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్ చేరుకుంటున్నారు.. కోల్ కతా నగరంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా వార్డులో ఉమా అనే మహిళ నర్సుగా ఉద్యోగం చేస్తున్నది.
కరోనా వార్డులో చంటిబిడ్డ
కోల్ కతాలోని ఆసుపత్రిలోని కరోనా వార్డులో ఉంటున్న మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కరోనా వైరస్ దెబ్బకు తల్లి, బిడ్డకు వేర్వేరుగా చికిత్స అందిస్తున్నారని తెలిసింది. అదే కరోనా వార్డులో ఉద్యోగం చేస్తున్న ఉమాకు ఇటీవలే ఓ బిడ్డ పుట్టింది. కరోనా వార్డులో ఉన్న చంటిబిడ్డ ఆకలితో ఆర్తనాదాలు చెయ్యడం మొదలుపెట్టింది.
వేరే విషయం ఆలోచించలేదు!
కరోనా వార్డులో డ్యూటీలో ఉన్న ఉమాకు చంటిబిడ్డ ఏడుపు వినిపించింది. ఆకలితోనే ఆ బిడ్డ ఎడుస్తోందని ఉమా గుర్తించింది. బిడ్డ ఆకలి తీర్చడానికి తల్లి దగ్గర్లో లేదు. ఎంత సేపటికి ఆ బిడ్డ ఏడుపు ఆపకపోవడంతో నర్సు ఉమా చలించిపోయింది. తాను ఓ బిడ్డకు తల్లినే, కరోనా వార్డులో బిడ్డకు పాలిస్తే తనకు, తన బిడ్డకు ఏదైనా జరగరానిది జరిగితే ఎలా ? అని మాత్రం నర్సు ఉమా ఆలోచించలేదు. వెంటనే నర్సు ఉమా బిడ్డను ఓడిలో పెట్టుకుని ఆకలి తీరే వరకు చనుపాలు ఇచ్చింది.
అమ్మా నువ్వు గ్రేట్
నర్సు ఉమా కరోనా వార్డులో వేరే మహిళకు పుట్టిన బిడ్డకు పాలు ఇస్తున్న సమయంలో ఓ సెల్ఫీ తీసుకుంది. కరోనా వార్డులో వేరే మహిళకు పుట్టిన బిడ్డకు నర్సు ఉమా చనుపాలు ఇస్తున్న సమయంలో తీసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కరోనా దెబ్బకు అయిన వారే వారి కుటుంబ సభ్యులకు దూరం అవుతున్న సమయంలో కరోనా వార్డులోని బిడ్డకు ధైర్యంగా చనుపాలు ఇచ్చిన నర్సు ఉమాకు అందరూ చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మా నువ్వు చేలా గ్రేట్ అంటూ సలామ్ చేస్తున్నారు.