బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Amit Shah: దేవుడికి ఉండే కరోనా బీజేపీకి లేదా, అమిత్ షా ర్యాలీకి 3 లక్ష్లల మందా ?, హైకోర్టులో పోతా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బెళగావి/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ తాండవం చెయ్యడంతో ప్రజలు హడలిపోతున్నారు. కరోనా వైరస్ (COVID-9) మహమ్మారి దెబ్బతో దేశంలోని ప్రముఖ ఆలయాలు, మసీదు, చర్చిలు మూసి వేశారు. ఆలయాలు, చర్చిలు, మసీదు ఇప్పుడిప్పుడు తీస్తున్నారు. వివాహాలు, శుభకార్యాలు, అంత్యక్రియలు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఆంక్షలు విధించారు. ఇలాంటి సమయంలో కరోనా దెబ్బతో దేవుడు ఉండే గుడిని మూసేసి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభ, ర్యాలీకి బీజేపీ నాయకులు మూడు లక్షల మందిని రప్పించడానికి ఎలా సిద్దం అయ్యారు. వెంటనే అమిత్ షా బహిరం సభను రద్దు చెయ్యాలని ఆర్ టీఐ కార్యకర్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. మీరు బహిరంగ సభ, ర్యాలీని రద్దు చెయ్యకుంటే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని ఆర్ టీఐ కార్యకర్త తేల్చి చెప్పడంతో బీజేపీ నాయకులు షాక్ అయ్యారు.

Beautiful lady: భర్తకు విడాకులు, ఇంట్లో తెలీకుండా ప్రియుడితో కాపురం, ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం!Beautiful lady: భర్తకు విడాకులు, ఇంట్లో తెలీకుండా ప్రియుడితో కాపురం, ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం!

బెళగావిలో అమిత్ షా మీటింగ్, ర్యాలీ

బెళగావిలో అమిత్ షా మీటింగ్, ర్యాలీ

కర్ణాటకలోని బెళగావి జిల్లా క్రీడామైదానంలో జనవరి 17వ తేదీ ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించడానికి బీజేపీ నాయకులు సిద్దం అయ్యారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభకు బీజేపీ నాయకులు మూడు లక్షల మందికి రంపించడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది. అమిత్ షా బహిరంగ సభను పెద్ద ఎత్తున సక్సస్ చెయ్యడానికి కర్ణాటక బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

దేవుడికి ఉండే కరోనా ప్రజలకు లేదా ?

దేవుడికి ఉండే కరోనా ప్రజలకు లేదా ?

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో దేశంలోని ప్రముఖ ఆలయాలు, మసీదు, చర్చిలు మూసి వేశారు. ఆలయాలు, చర్చిలు, మసీదు ఇప్పుడిప్పుడు తీస్తున్నారు. వివాహాలు, శుభకార్యాలు, అంత్యక్రియలు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఆంక్షలు విధించారు. కరోనా దెబ్బతో దేవుడికి పూజలు చెయ్యడం మానేశారు. శుభకార్యాలకు, అంత్యక్రియలు నిర్వహించడానికి అడ్డు వచ్చే కరోనా వైరస్ అమిత్ షా బహిరంగ సభను మాత్రం వదిలేస్తుందా అంటూ కర్ణాటకకు చెందిన ఆర్ టీఐ కార్యకర్త బీమప్ప గడాద్ ప్రశ్నిస్తున్నారు.

బహిరంగ సభ రద్దు చెయ్యండి

బహిరంగ సభ రద్దు చెయ్యండి

కేంద్ర మంత్రి అమిత్ షా నిర్వహిస్తున్న బెళగావిలోని బహిరం సభ, ర్యాలీకి అనుమతి ఇవ్వకూడదని, ఆ కార్యక్రమాలు రద్దు చెయ్యాలని ఆర్ టీఐ కార్యకర్త బీమప్ప కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రవికుమార్ కు లేఖ రాశారు. కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమమయంలో అమిత్ షా బహిరంగ సభకు మూడు లక్షల మందిని రప్పించడానికి బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆర్ టీఐ కార్యకర్త బీమప్ప ఆరోపించారు.

హైకోర్టులో పిల్ వేస్తా

హైకోర్టులో పిల్ వేస్తా


బెళగావి జిల్లాలో జనవరి 14వ తేదీన 8 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. బెళగావి జిల్లాలో ఇప్పటి వరకు 26, 458 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆ వైరస్ కు 342 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గత 10 నెలల నుంచి బెళగావి జిల్లాలోని సవదత్తి యల్లమ్మ దేవి ఆలయం మూతపడింది. ఇలాంటి సమయంలో అమిత్ షా బహిరంగ సభకు మీరు అనుమతి ఇస్తే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని, కోర్టులో బహిరంగ సభను రద్దు చెయ్యాలని పిల్ దాఖలు చేస్తానని ఆర్ టీఐ కార్యకర్త బీమప్ప తేల్చి చెప్పడంతో బీజేపీ నాయకులు షాక్ అయ్యారు.

English summary
Amit Shah: In a letter to Karnataka chief secretary RTI activist Bhimappa Gadad urged to cancel BJP's Jana Sevak Samavesha in Belagavi on January 17, 2021. Three lakh people are expected to gather and rally addressed by home minister Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X