• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Corona Lockdown: 7 నెలల గర్భిణి, నడిరోడ్డులో ధైర్యంగా డ్యూటీలో లేడీ ఎస్పీ, కరోనా వారియర్ !

|

రాయ్ పూర్: కరోనా వైరస్ (COVID 19) కట్టడికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద కార్మికులు, సంబంధిత అధికారులు ప్రతిరోజూ 24 గంటలు డ్యూటీ చెయ్యవలసిన పరిస్థితి ఎదురైయ్యింది. చత్తిస్ ఘడ్ లో 7 నెలల గర్భిణి అయిన లేడీ ఎస్పీ సెలవులో ఉండకుండా రోడ్డు మీదకు వచ్చి కరోనా లాక్ డౌన్ డ్యూటీ చేస్తూ సాటి పోలీసుల్లో ధైర్యం నింపుతున్నారు. కరోనా వైరస్ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా తన కంటే తక్కువ స్థాయి ఉద్యోగులు అని ఏ మాత్రం చిన్నచూపు చూడకుండా అందరితో కలిసి ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న లేడీ ఎస్పీని అందరూ కరోనా వారియర్ అంటూ అభినందిస్తున్నారు.

Coronavirus దెబ్బ: కర్ణాటకలో ప్రజలకు ప్రతిరోజూ 7. 5 లక్షల లీటర్ల పాలు ఫ్రీ, సూపర్ సీఎం !Coronavirus దెబ్బ: కర్ణాటకలో ప్రజలకు ప్రతిరోజూ 7. 5 లక్షల లీటర్ల పాలు ఫ్రీ, సూపర్ సీఎం !

రాయ్ పూర్ లో డ్యూటీ

రాయ్ పూర్ లో డ్యూటీ

2007 బ్యాచ్ స్టేట్ సర్వీస్ ఆఫీసర్ అయిన అమృత సోరి చత్తిస్ ఘడ్ రాష్ట్రంలో సిన్సియర్ పోలీసు అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాయపూర్ అడిషనల్ పోలీసు ఎస్పీగా అమృత సోరిగా ఉద్యోగం చేస్తున్నారు. అమృత సోరి ప్రస్తుతం 7 నెలల గర్భవతి.

కరోనా మహమ్మారి

కరోనా మహమ్మారి

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని అరికట్టడానికి రెండో విడత లాక్ డౌన్ అమలు చేశారు. చత్తిస్ ఘడ్ లో కరోనాను అరికట్టడానికి అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ప్రజలు రోడ్ల మీదకు రాకుండా పోలీసులు ప్రతిరోజు 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు.

గర్భిణి అని లెక్కచెయ్యకుండా !

గర్భిణి అని లెక్కచెయ్యకుండా !

పోలీసు అధికారిని అమృత సోరి రాయపూర్ లోని రోడ్డ మీద ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్టు దగ్గర ప్రత్యక్షం అయ్యారు. ఎస్పీ అమృత సోరిని చూసిన సాటి పోలీసులు మేడమ్ మీరు గర్బవతి, కరోనా వ్యాపిస్తున్న సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు. మేము డ్యూటీలు చేస్తున్నాం, మీరు ఇంటికి వెళ్లి క్షేమంగా ఉండండి, అంతా మేము చూసుకుంటాం అంటూ సాటి పోలీసులు అమృత సోరికి నచ్చచెప్పారు.

చిరునవ్వుతో డ్యూటీ చేసిన మేడమ్

చిరునవ్వుతో డ్యూటీ చేసిన మేడమ్

సాటి పోలీసులు ఎంత చెప్పినా అమృత సోరి వినకుండా డ్యూటీ చేశారు. మీతో పాటు నేను ఇక్కడే విధుల్లో ఉంటానని, తనకు ఏమీ కాదని ఆమె కంటే తక్కువ స్థాయి ఉద్యోగులకు చెప్పారు. తక్కువ స్థాయి, ఎక్కువ స్థాయి ఉద్యోగులు అని ఎప్పుడూ అమృత సోరి తేడా చూపించరని సాటి పోలీసులకు తెలుసు. నడి రోడ్డులో చెక్ పోస్టు దగ్గర నిలబడిన ఎస్పీ అమృత సోరి అటూ ఇటూ సంచరిస్తున్న స్థానిక ప్రజలకు కరోనా వైరస్ గురించి అవగాహన పెంచుతూ మీరు ఇళ్లలోనే ఉండాలని వారికి సూచించారు.

అధికారులు ఒత్తిడి చెయ్యలేదు

అధికారులు ఒత్తిడి చెయ్యలేదు

7 నెలల గర్భిణిని అయిన అమృత సోరి కరోనా వైరస్ ను లెక్కచెయ్యకుండా నడి రోడ్డులో డ్యూటీ చేస్తున్నారని తెలుసుకున్న మీడియా అక్కడికి వెళ్లింది. ఈ సందర్బంగా ఏఎన్ఐతో మాట్లాడిన అమృత సోరి తనను డ్యూటీ చెయ్యాలని పై అధికారులు ఎవ్వరూ ఒత్తిడి చెయ్యలేదని, స్వచ్చందంగా తాను విధులకు హాజరైనానని, సాటి సిబ్బందికి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చానని ఆమె వివరించారు.

తేడా వస్తే మొదటికే మోసం !

తేడా వస్తే మొదటికే మోసం !

7 నెలల గర్భిణి అయిన అమృత సోరి చిన్న తేడా వచ్చినా తనతో పాటు కడుపులో ఉన్న బిడ్డకు కరోనా వ్యాధి సోకే అవకాశం ఉందని తెలిసినా ధైర్యంగా విధులకు హాజరుకావడంతో సాటి సిబ్బంది ఆమెకు సలామ్ చేశారు. ఎస్పీ అమృత సోరిని ఆదర్శంగా తీసుకుని తాము కష్టపడి పని చేస్తామని రాయపూర్ పోలీసు సిబ్బంది మీడియాకు చెప్పారు. లేడీ ఎస్పీ అమృత సోరి విషయం తెలుసుకున్న నెటిజన్లు మేడమ్ మీరు కరోనా వారియర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

  Fake News Buster EP 10 : సోడియం హైపోక్లోరైట్ మనుషులు వాడచ్చా ?
  English summary
  Coronavirus Lockdown: 7 month pregnant Raipur SP Amrita Sori continues on duty at road side during lockdown time in Chhattisgarh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X