వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: రేయ్ నరికేస్తా, తలకాయలు లేచిపోతాయ్, విక్రమార్కుడు: వీడియో వైరల్, ఏం జరిగిదంటే ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ఉడిపి: కుటుంబ గొడవలు, ఆస్తి తగాదాలు, వ్యాపారాల్లో పొరపాట్లు, అమ్మాయిల కోసం పోటీ పడి కొట్లాడుకోవడం ఇలా అనేక విషయాల్లో గొడవలు పడిన వారి గురించి మనం విన్నాం. కరోనా వైరస్ (COVID 19) దెబ్బతో ప్రాణాలు కాపాడుకోవాలంటే ప్రతిఒక్కరు కనీసం భౌతిక దూరం పాటించాలని స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే ప్రజలకు మనవి చేస్తున్నారు. అయితే ఒక్క రూపాయి కోసం టోల్ గేట్ లో గ్యాంగ్ ను వెంటవేసుకుని ఓ యువకుడు నానా రచ్చ చేసి హంగామా చేశాడు. కరోనా వైరస్ లేదు, తొక్కలో లాక్ డౌన్ లేదు అంటూ రెచ్చిపోయాడు. రేయ్ రారా, నా ప్రతాపం చూపిస్తా, నిన్ను లేపేస్తా, నరికేస్తా, తలకాయలు తెగిపోతాయ్ అని ఆ యువకుడి, అతని బ్యాచ్ నిత్యం రద్దీగా ఉండే టోల్ గేట్ లో ముఖాలకు మాస్క్ లు కూడా వేసుకోకుండా నానా రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ యువకుల గొడవ రామాయణం రచ్చ వీడియోను సోషల్ మీడియాలో చూస్తున్న నెటిజన్లు వీళ్లకేం పోయేకాలం అంటూ శాపనార్తాలు పెడుతున్నారు.

Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !

టోల్ గేట్ లో బిజిబిజీగా వాహనాలు

టోల్ గేట్ లో బిజిబిజీగా వాహనాలు

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా చాలా కాలం తరువాత ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అనేక మంది వారివారి సొంత పనులు పూర్తి చేసుకోవడానికి వాహనాల్లో సంచరిస్తున్నారు. కర్ణాటకలోని ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం ఉడిపి జిల్లాలోని బ్రహ్మావర సంస్థాన టోల్ గేట్ లో నిత్యం వందలాది వాహనాలు సంచరిస్తుంటాయి. పగలు, రాత్రి అని తేడా లేకుండా ప్రతినిత్యం ఈ టోల్ గేట్ మీదుగా వందలాది వాహనాలు తిరుగుతుంటాయి.

ఖర్మకాలి రూ. 1 తక్కువ ఇచ్చాడు !

ఖర్మకాలి రూ. 1 తక్కువ ఇచ్చాడు !

ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఉడిపి జిల్లాలోని బహ్మావర టోల్ గేట్ మీదుగా ఓ యువకుడు, అతని స్నేహితులు కారులో వెళ్లారు. ఆ సమయంలో టోల్ గేట్ సిబ్బంది చెప్పిన డబ్బులు ఆ యువకులు ఇచ్చారు. ఆ సమయంలో రూ. 5 చిల్లర టోల్ గేట్ సిబ్బంది కారులో వెళ్లిన యువకులు తిరిగి ఇవ్వాలి. అయితే టోల్ గేట్ సిబ్బంది టైం బాగలేక వారు ఐదు రూపాయలకు బదులుగా నాలుగు రూపాయల చిల్లర ఇచ్చారు.

రేయ్ ఏమనుకున్నావురా ? రూపాయికి విలువలేదా

రేయ్ ఏమనుకున్నావురా ? రూపాయికి విలువలేదా

ఐదు రూపాయలు చిల్లర లెక్కపెట్టిన ఓ యువకుడికి ఎక్కడో కాలిపోయింది. కారు దిగిన యువకుడు రేయ్ ఐదు రూపాయలు ఇవ్వకుండా ఎందుకు నాలుగు రూపాయలు మాత్రమే ఇచ్చావ్ ? నువ్వు ఏమనుకుంటున్నావ్ ? అని రెచ్చిపోయాడు, సార్ రూపాయి చిల్లర లేదు, అందుకే నాలుగు రూపాయలు ఇచ్చాము అని టోల్ గేట్ సిబ్బంది సర్దిచెప్పారు. ప్రతిరోజు ఒక్కొక్కరి దగ్గర రుపాయి చోప్పున మిగిలించుకుంటే నీకు ఎన్ని వేలు లాభం రా? అని కారులో వెళ్లిన యువకులు మరింత రెచ్చిపోయారు.

తలకాయలు లేచిపోతాయ్

తలకాయలు లేచిపోతాయ్

టోల్ గేట్ సిబ్బందితో యువకులు గొడవపడటంతో టోల్ గేట్ మీదుగా వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ సమయంలో వెనుక ప్రయాణిస్తున్న వారు, చుట్టుపక్కల దుకాణాల వాళ్లు వచ్చి యువకులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో మరింత రెచ్చిపోయిన యువకులు రేయ్ నీ అంతు చూస్తా, నన్ను ఏమనుకుంటున్నావ్ రా, తలకాయలు లేచిపోతాయ్ అంటూ బూతులు తిడుతూ నానా రచ్చ చెశారు.

వీడియో వైరల్, శాపనార్తాలు


ముఖానికి మాస్క్ లు కూడా వేసుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా యువకులు నానా రచ్చ చేస్తున్న సమయంలో కొందరు వీడియోలు తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. ఇంత గొడవ జరగడానికి కారణం ఏమిటి ? అంటూ అనేక మంది ఆరా తీశారు. ఒక్క రూపాయి కోసం గంట సేపు గొడవ జరిగింది అని తెలుసుకున్న ప్రజలు వీళ్లకేం పోయేకాలం వచ్చింది అంటూ శాపనార్తాలు పెడుతున్నారు. టోల్ గేట్ లో ఇంత రచ్చ జరిగిన సమయంలో అక్కడ బందోబస్తులో పోలీసులు ఎవ్వరూ లేరని వెలుగు చూసింది. వీడియో ఆధారంగా లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి అంటు వ్యాధులు వ్యాపించడానికి కారణం అయిన యువకుల కోసం ఉడిపి పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Coronavirus Lockdown: A Youths Uproar At The Toll Gate For 1 Rupee at Sasthana Toll Gate near Brahmavara in Udupi district is now Video Viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X