వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: హెలిప్యాడ్ లో ఆర్మీ VS పోలీస్, మాకు రూల్స్ తెలుసు, పెద్దలు ఎంట్రీ, నిన్న సచిన్, నేడు ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ఉడిపి: కర్ణాటకలో మరోసారి లాక్ డౌన్ విషయంలో పోలీసులు VS ఆర్మీ సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. ఉడిపి హెలిప్యాడ్ లో పోలీసులు, ఆర్మీ సిబ్బంది గొడవ పడటంతో వార్తల్లోకి ఎక్కారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తారా ? మీకు ప్రత్యేకంగా చెప్పాలా అంటూ పోలీసులు అంటుంటే, మాకు అన్ని నియమాలు, రూల్స్ తెలుసు, మా ప్రాంతంలో మేము ఉంటున్నాం, మీకేమిటి అభ్యంతరం అంటూ ఆర్మీ జవాన్లు వాదనకు దిగారని వెలుగు చూసింది. ఆర్మీ జవాన్ లు, పోలీసుల మద్య శీతల సమరం మొదలు కావడంతో పెద్దలు జోక్యం చేసుకున్నారని తెలిసింది. ఇటీవల కర్ణాటకలోని బెళగావిలో సీఆర్ పీఎఫ్ కోబ్రా కమాండో సచిన్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనకు సంకెళ్లు వెయ్యడంతో వివాదానికి దారితీసింది. ఇప్పుడు అదే కర్ణాటక పోలీసులు ఆర్మీ జవాన్లతో వాదనకు దిగుతున్నారని వెలుగు చూసింది.

100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!

హెలిప్యాడ్ లో ఆర్మీ జవాన్లు

హెలిప్యాడ్ లో ఆర్మీ జవాన్లు

కర్ణాటకలోని ఉడిపి హెలిప్యాడ్ లో ఆర్మీ సిబ్బంది వ్యాయామం చేస్తూ ఆటలు ఆడుతున్నారని తెలిసింది. విషయం తెలుసుకున్న ఉడిపి పోలీసులు అక్కడికి వెళ్లారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ? లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో మీరు ఇళ్లల్లోనే ఉండాలని, ఇలా బహిరంగ ప్రదేశాలకు రాకూడదని ఆర్మీ సిబ్బందికి పోలీసులు సూచించారని తెలిసింది.

మాకు రూల్స్ తెలుసు వెళ్లండి !

మాకు రూల్స్ తెలుసు వెళ్లండి !

కరోనా వైరస్ ను అరికట్టడానికి దేశం మొత్లం లాక్ డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నియమాలు మాకు తెలుసని, తాము బహిరంగ ప్రదేశాలకు వెళ్లడంలేదని, మేము మా ఆర్మీ క్యాంపస్ లోనే ఉన్నామని, మాకు అన్ని నియమాలు తెలుసని ఆర్మీ జవాన్లు ఉడిపి పోలీసులకు సమాధానం ఇచ్చారు.

మాటామాటా పెరిగిపోయి !

మాటామాటా పెరిగిపోయి !

హెలిప్యాడ్ ప్రాంతం నుంచి మీ ఇళ్లకు వెళ్లిపోవాలని పోలీసులు, లేదు మేము ఇక్కడే వ్యాయామం చేసుకుంటామని ఆర్మీ జవాన్లు పట్టుబట్టడంతో ఇరు వర్గాల మద్య మాటల యుద్దం జరిగిందని తెలిసింది. ఫిజికల్ ఫిట్ నెస్ కోసం మేము ఇక్కడ వ్యాయామం చేసుకుంటుంటే వద్దని మీరు ఎలా చెబుతారు ? అంటూ ఆర్మీ సిబ్బంది పోలీసులను ప్రశ్నించారని తెలిసింది. ఆ సమయంలో ఇరు వర్గా మద్య మాటామాటా పెరిగిపోవడంతో పోలీసు, ఆర్మీ పెద్దలు జోక్యం చేసుకున్నారని తెలిసింది.

Recommended Video

AP Lockdown Relaxations Guidelines || కరోనా లక్షణాలు లేకపోతేనే ఈ మినహాయింపులు...!!
కోబ్రా కమాండో విషయంలో ?

కోబ్రా కమాండో విషయంలో ?

ఇటీవల కర్ణాటకలోని బెళగావి జిల్లా చిక్కోడి తాలుకా ఎక్సాంబ ప్రాంతంలో ఇంటి ముందు బైక్ శుభ్రం చేసుకుంటున్న సీఆర్ పీఎఫ్ కోబ్రా కమాండో సచిన్ సావంత్ మాస్క్ పెట్టుకోలేదని అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో సంకెళ్లు వేసిన విషయం తెలిసిందే. సచిన్ విషయంలో సీఆర్ పీఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. సచిన్ వ్యవహారం జరిగి మూడు రోజులు కాకముందే మరోసారి కర్ణాటక పోలీసులు ఆర్మీ జవాన్లతో పెట్టుకున్నారని వెలుగు చూసింది.

English summary
Coronavirus Lockdown: Army personnel were playing a game at the Adi Udupi helipad, and the police had objected to the play Game.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X