బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Corona Sealdown: నున్నటి లాఠీలకు పని చెప్పిన పోలీసులు, దేశాన్ని ఉద్దరిస్తారా ? రండి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ ను (COVID 19) కట్టడి చెయ్యడానికి భారతదేశం మొత్తం లాక్ డౌన్ అయ్యింది. కరోనా వైరస్ ను పూర్తిగా అరికట్టడానికి భారతదేశంలో మే 3వ తేదీ వరకు రెండో విడత లాక్ డౌన్ అమలు చేస్తున్నామని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న రెండు వార్డులు పూర్తిగా సీల్ డౌన్ చేశారు. అయితే ఏదో దేశాన్ని ఉద్దరించడానికి ఉదయాన్నే వీదుల్లోకి రావడం, రాత్రి వరకూ అటూఇటూ తిరగడం చేస్తున్న స్థానిక ప్రజలకు చెప్పిచెప్పి పోలీసులు విసిగిపోయారు. ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ప్రజలను ఇళ్లకే కట్టడి చెయ్యాలని పోలీసులు నున్నగా నిగనిగలాడుతున్న లాఠీలకు పని చెప్పారు.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

కారాలు, మిరియాలు నూరుతున్న కరోనా

కారాలు, మిరియాలు నూరుతున్న కరోనా

కర్ణాటకలో ఇప్పటి వరకు 247 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకింది. కర్ణాటకలో ఆరు మంది కరోనా వైరస్ వ్యాధితో మరణించారు. బెంగళూరులో కరోనా వైరస్ దెబ్బకు ఒకరు మరణించారు. కరోనా హాట్ స్పాట్ కేంద్రాల్లో బెంగళూరు నగరం పేరు ఉ:ది. ఇప్పటి వరకు బెంగళూరు నగరానికి చెందిన 76 మందికి కరోనా వైరస్ వ్యాధి ఉందని అధికారులు నిర్దారించారు. కర్ణాటకలో కరోనా వైరస్ కారాలు, మిరియాలు నూరుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సిలికాన్ సిటీలో సీల్ డౌన్

సిలికాన్ సిటీలో సీల్ డౌన్

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ హాట్ స్పాట్ లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. కరోనా హాట్ స్పాట్ కేంద్రాల జాబితాలో సిలికాన్ సిటీ బెంగళూరు పేరు ఉంది. బెంగళూరు నగరంలోని బీబీఎంపీ వార్డు నెంబర్ 134 బాపూజీనగర్, వార్డు నెంబర్ 135 పాదరాయణపుర ప్రాంతాలు మూడు రోజుల క్రితం పూర్తిగా సీల్ డౌన్ అయ్యాయి.

అయ్యా, బాబు, చెప్పింది వినండి !

అయ్యా, బాబు, చెప్పింది వినండి !

బెంగళూరు నగరంలోని బాపూజీనగర్, పాదరాయణపు వార్డులు పూర్తిగా సీల్ డౌన్ అయినా అక్కడి ప్రజలు మాత్రం ఎప్పటిలాగే రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అనవసరంగా రోడ్ల మీద ప్రజలు సంచరించడంతో పోలీసులు వారికి అయ్యా, బాబు ఇంటి నుంచి బయటకు రాకూడదయ్యా, కరోనా వైరస్ ఎక్కువ వ్యాపిస్తుంది స్వామి, దేవుడా అంటూ మర్యాదగా చెప్పారు. అయితే స్థానిక ప్రజలు మాత్రం అధికారులు, పోలీసుల మాటలు పెడచెవిన పెట్టారు.

నున్నటి లాఠీలకు పని చెప్పారు !

నున్నటి లాఠీలకు పని చెప్పారు !

మొదటి విడత లాక్ డౌన్ గడువు పూర్తి అవుతున్న సమయంలో రెండో విడత లాక్ డౌన్ ప్రకటించారు. ఇలాంటి సమయంలో సీల్ డౌన్ అమలులో ఉన్న బాపూజీనగర్ లోని ప్రజలు పోలో అంటూ రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. ఎంత చెప్పినా ప్రజలు వినకపోవడంతో పోలీసులకు ఎక్కడో మండిపోయింది. అంతే నున్నటి లాఠీలు బయటకు తీసిన పోలీసులు వాటితో ప్రజలకు బుద్ది చెబుతున్నారు.

నోటితో చెబితే వినరా ? ఇప్పుడు వింటారా !

నోటితో చెబితే వినరా ? ఇప్పుడు వింటారా !

మీకు మర్యాదగా నోటితో చెబితే వినరని, ఇలా లాఠీలకు పని చెబితే వింటారని పోలీసులు అంటున్నారు. రోడ్ల మీదకు వస్తున్న ప్రజలకు ఒక్కమాట కూడా మాట్లాడని పోలీసులు కేవలం లాఠీలకు పని చెబుతున్నారు. రోడ్ల మీదకు వస్తున్న ప్రజలను పట్టుకుని చితకబాదేస్తున్నారు. ఒక్కసారిగా పోలీసులు వారి ప్రతాపం చూపించడంతో బాపూజీనగర్ ప్రజలు ఇప్పుడు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. బాపూజీనగర్, పాదరాయణపుర వార్డుల్లో సుమారు 45 వేల మందికిపైగా ప్రజలు ఉండటంతో వారిని కట్టడి చెయ్యడానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.

English summary
Coronavirus Lockdown: Bengaluru Bapuji Nagar residents dont care about seal down. police trying to control the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X