బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Corona Lockdown: సీల్ డౌన్ లో రెచ్చిపోయి, సీసీ కెమెరాల్లో చిక్కిపోయారు. కరోనాతో చస్తారని వెళితే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ సందర్బంగా పోలీసులపై అల్లరిమూకలు ఏదో ఒక విధంగా దాడులు చేస్తూనే ఉన్నారు. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించిన సిలికాన్ సిటీ బెంగళూరులోని పాదరాయనపుర వార్డును సీల్ డౌన్ చేశారు. అదే పాదరాయనపురలో కరోనా వైరస్ వ్యాధి అనుమానితులను క్వారంటైన్ లకు తరలించడానికి ప్రయత్నించిన పోలీసులు, వైద్య సిబ్బందిపై దాడులు చేశారు. క్వారంటైన్ లో ఉన్న 38 మందిని మెరగైన చికిత్స కొసం సురక్షింత ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నించిన పోలీసులు, వైద్య సిబ్బందిపై దాడులు చెయ్యడంతో కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సీసీ టీవీ కెమెరాలు, మొబైల్ లో చిత్రీకరించిన వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించి NDMA సెక్షన్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త !Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త !

 బెంగళూరులో ఏం జరిగిందంటే ?

బెంగళూరులో ఏం జరిగిందంటే ?

ఐటీ, బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన, దేశ ఐటీ రాజధాని సిలికాన్ సిటి బెంగళూరు నగరంలో కరోనా వైరస్ కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో బెంగళూరు నగరంలోని పాదరాయనపుర, బాపూజీనగర వార్డుల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా వ్యాపించడంతో బీబీఎంపీ అధికారులు ఆ రెండు వార్డులను సీల్ డౌన్ చేశారు.

ఒక్క వార్డులో 58 మంది క్వారంటైన్

బీబీఎంపీ వార్డు పాదరాయనపురలో కరోనా వైరస్ వ్యాపించిందనే అనుమానంతో 58 మందిని ఆ ప్రాంతంలోని క్వారంటైన్ కు తరలించారు. కరోనా వైరస్ అనుమానితులు ఒక్క పాదరాయనపుర వార్డులో సుమారు 60 మంది ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో సీల్ డౌన్ ప్రకటించి అక్కడ నివాసం ఉంటున్న వారిని బయటకు రానివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

200 మంది ఎదురుతిరిగితే ?

200 మంది ఎదురుతిరిగితే ?

పాదరాయనపురలోని హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న 38 మందిని వేరే ప్రాంతాలకు తరలించడానికి వెళ్లిన పోలీసులు, వైద్య సిబ్బందిని అడ్డుకున్న స్థానికులు ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు, ట్రాఫిక్ డివైడర్లను ద్వంసం చేశారు. సుమారు 200 మందికిపైగా స్థానికులు రెచ్చిపోయారని అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని పోలీసు అధికారుల విచారణలో ఆ వివరాలు వెలుగు చూశాయి.

 NDMA చట్టం ప్రయోగం !

NDMA చట్టం ప్రయోగం !

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్న పాదరాయనపురలో సీల్ డౌన్ అమలులో ఉందని, ఇప్పటికే ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న 58 మంది క్వారంటైన్ లో ఉన్నారని బెంగళూరు పశ్చిమ విభాగం డీసీపీ రమేష్ అన్నారు. కరోనా పాజిటివ్ కేసులు అరికట్టడానికి క్వారంటైన్ లో ఉంటున్న వారిని వేరే సురక్షిత ప్రాంతానికి తరలించడానికి వెళ్లిన పోలీసులు, బీబీఎంపీ అధికారులు, వైద్య సిబ్బంది మీద దౌర్జన్యం చెయ్యడమే కాకుండా ప్రభుత్వ అధికారుల విధులు అడ్డగించిన వారి మీద NDMA చట్టం కింద కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు పశ్చిమ విభాగం డీసీపీ రమేష్ పాదరాయనపురలోని అల్లరిమూకలను హెచ్చరించారు.

Recommended Video

Coronavirus : Swiggy Delivery Boy In Hyderabad Tests Positive For Covid-19
 ఎమ్మెల్యే, కార్పోరేటర్ రావాలని !

ఎమ్మెల్యే, కార్పోరేటర్ రావాలని !

పాదరాయనపురలో క్వారంటైన్ లో ఉన్న 15 మందిని మొదట సమీపంలోని హజ్ భవనంలోకి తరలించారు. మిగిలిన వారిని పాదరాయనపుర నుంచి వేరే ప్రాంతాలకు తరలించడానికి ఆదివారం రాత్రి ప్రయత్నించగా అడ్డుకున్నారని డీసీపీ రమేష్ చెప్పారు. కార్పోరేటర్ ఇమ్రాన్ పాష, ఎమ్మెల్యే, మాజీ మంత్రి జమీర్ అహమ్మద్ ఇక్కడికి రావాలి, వారు వచ్చి చెప్పిన తరువాత ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెలుతామని స్థానికులు, క్వారంటైన్ లో ఉన్న వారు రెచ్చిపోయారని, పోలీసులు, వైద్య సిబ్బంది, బీబీఎంపీ అధికారుల మీద దౌర్జన్యం చేసి బ్యారికేడ్లు ద్వంసం చేసిన వారిని సీసీ టీవీ కెమెరాల ఆధారంగా గుర్తించి వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు పశ్చిమ విభాగం డీసీపీ రమేష్ హెచ్చరించారు.

English summary
Coronavirus Lockdown: Bengaluru Esst DCP B Ramesh assures stringent action against vandals, says CCTV footage will be analysed to identify them. He adds vandals would be booked under NDMA Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X