చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: 3 వేల కిలోమీటర్లు, 84 గంటలు, అంబులెన్స్ డ్రైవర్లకు సీఎం సెల్యూట్, సన్మానం, వైరల్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మిజోరం: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశ మొత్తం లాక్ డౌన్ అమలు చెయ్యడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనారోగ్యంతో మిజోరం రాష్ట్రానికి చెందిన యువకుడు చెన్నైలో మరణించాడు. చెన్నైలోని ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి మరణించడంతో అతని అంత్యక్రియులు చెయ్యడానికి అక్కడ అతనికి సంబంధించిన ఒక్క మనిషి కూడా లేడు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో మిజోరంకు ఆ యువకుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవ్వరూ ధైర్యం చెయ్యలేకపోయారు. అంబులెన్స్ డ్రైవర్లు ఇద్దరు ఏకదాటిగా 84 గంటల పాటు 3 వేల కిలోమీటర్లు ప్రయాణించి మిజోరంలో యువకుడి మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చెన్నై అంబులెన్స్ డ్రైవర్లుకు మిజోరం ముఖ్యమంత్రితో పాటు ఆ రాష్ట్ర ప్రజలు సెల్యూట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శభాష్ చెన్నై అంబులెన్స్ డ్రైవర్స్ అంటూ నెటిజెన్లు వారిని మెచ్చుకుంటున్నారు.

100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!

చెన్నై కంపెనీలో ఉద్యోగం

చెన్నై కంపెనీలో ఉద్యోగం

మిజోరంకు చెందిన 28 ఏళ్ల యువకుడు తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంత కాలంగా అనారోగ్యానికి గురైన మిజోరం యువకుడు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల (ఏప్రిల్) 23వ తేదీన మరణించాడు.

అంత్యక్రియలకు ఒక్క మనిషి లేడు

అంత్యక్రియలకు ఒక్క మనిషి లేడు

మిజోరం యువకుడు అంత్యక్రియులు చెయ్యడానికి ఆయన కుటుంబ సభ్యులు చెన్నై రాలేకపోయారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో మిజోరం నుంచి చెన్నై రావడానికి అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. చెన్నైలోనే ఆ యువకుడి అంత్యక్రియులు చెయ్యడానికి అతనికి సంబంధించిన ఒక్క మనిషికూడా లేకపోవడంతో అందరూ అయోమయంలో పడిపోయారు.

చేతులు ఎత్తేసిన అంబులెన్స్ డ్రైవర్లు

చేతులు ఎత్తేసిన అంబులెన్స్ డ్రైవర్లు

చెన్నై నుంచి మిజోరంకు మా యువకుడి మృతదేహాన్ని తీసుకు వచ్చి ఇస్తే ఎంత డబ్బులు అయినా ఇస్తామని, మా బిడ్డను చివరిసారి చూసుకోవడానికి అవకాశం ఇవ్వాలని అతని కుటుంబ సభ్యులు మనవి చేశారు. అయితే చెన్నై నుంచి మిజోరం వెళ్లడానికి అంబులైన్స్ డ్రైవర్లు మా వల్ల కాదని చేతులు ఎత్తేశారు.

3 వేల కిలోమీటర్లు, 84 గంటల ప్రయాణం

చెన్నైకి చెందిన ఇద్దరు డ్రైవర్లు లాక్ డౌన్ సమస్యలు ఎన్ని ఉన్నాసరే ఆ యువకుడి కుటుంబ సభ్యుల చివరి కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నారు. ఒక అంబులెన్స్ లో మిజోరం వెళ్లడానికి సిద్దం అయ్యారు. మిజోరంలో ఉన్న యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి చెన్నై నుంచి యువకుడి మృతదేహాన్ని తీసుకుని మిజోరం బయలుదేరారు. సుమారు 3 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. మార్గం మధ్యలో పశ్చిమ బెంగాల్, సిలిగురి, గౌహతి తదితర ప్రాంతాల్లోని హైవే రహదారుల్లో అంబులైన్స్ డ్రైవర్లకు మిజోరం రాష్ట్రానికి చెందిన ప్రజలు ఆహారం, కావాలసిన అవసరాలు తీర్చారు.

చెనై డ్రైవర్లకు సెల్యూట్ చేసిన సీఎం

చెనై డ్రైవర్లకు సెల్యూట్ చేసిన సీఎం

అంబులెన్స్ మిజోరంలో ప్రవేశించగానే ఆ రాష్ట్ర ప్రజలు చప్పట్లు కొట్టి అంబులెన్స్ డ్రైవర్లకు సెల్యూట్ చేసి స్వాగతం పలికారు. లాక్ డౌన్ కష్టాలను లెక్కచెయ్యకుండా మా రాష్ట్రానికి చెందిన యువకుడి మృతదేహాన్ని తీసుకువచ్చిన మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నామని అన్నారు. విషయం తెలుసుకున్న మిజోరం ముఖ్యమంత్రి జోరామ్ థంగా సైతం చెన్నై అంబులెన్స్ డ్రైవర్లు చేసిన సహాయానికి స్వయంగా సెల్యూట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.

డ్రైవర్లకు ప్రభుత్వం సన్మానం

డ్రైవర్లకు ప్రభుత్వం సన్మానం

చెన్నై అంబులెన్స్ డ్రైవర్లను మిజోరం ప్రభుత్వం తరపున సన్మానం చేసి వారికి ఆ రాష్ట్రం సాంప్రధాయ దుస్తులు అందించి ఒక్కొక్కరికి రూ. 2 వేలు నగదు బహుమానం అందించారు. చెన్నై అంబులెన్స్ డ్రైవర్లకు మిజోరం ప్రభుత్వం, అక్కడి ప్రజలు కృతజ్ఞతలు చెప్పిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువకుడి కుటుంబ సభ్యులు సైతం చెన్నై అంబులెన్స్ డ్రైవర్లు చేసిన సహాయానికి వాళ్ల కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నించి చివరికి వారికి కృతజ్ఞతలు చెప్పారు.

English summary
Coronavirus Lockdown: Chennai based ambulance drivers traveled 3000 km with coffin box and reached Mizoram in 84 hours to hand over the dead body. Mizoram based man died in Chennai on April 23, 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X