బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: ఆటో డ్రైవర్ ను చితకబాది సీజ్ చేసిన పోలీసు, అదే ఆటోలో వెళ్లి పైలోకాలకు, మధ్యలో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని కట్టడి చెయ్యడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలులో ఉంది. రెండో విడత లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు విస్తరించామని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. లాక్ డౌన్ సందర్బంగా రోడ్ల మీద అనవసరంగా సంచరిస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. రోడ్ల మీద అనవసరంగా తిరుగుతున్న డ్రైవర్ ను చితకబాదిన ఓ పోలీసు అతని ఆటోను సీజ్ చేసి అదే వాహనంలో వెలుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆటోను సీజ్ చేసిన పోలీసులు అదే వాహంలో వేగంగా వెలుతున్న సమయంలో అదుపుతప్పి రోడ్డు డివైర్ ను ఢీకొని దుర్మరణం చెందడంతో సాటి పోలీసులు షాక్ కు గురైనారు.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

సిలికాన్ సిటీలో లాక్ డౌన్

సిలికాన్ సిటీలో లాక్ డౌన్

ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరం సిలికాన్ సిటీలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉండటంతో కర్ణాటక ప్రభుత్వం, బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బెంగళూరు నగరంలో లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తున్న వారిపై చట్టపరంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.

 వాహనాలు సీజ్

వాహనాలు సీజ్

బెంగళూరు నగరంలో అనవసరంగా సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్న బెంగళూరు పోలీసులు వారు సంచరిస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. లాక్ డౌన్ నియమాలు అందరూ పాటించాలని, అవసరం అయితే తప్పా రోడ్ల మీదకు ఎవ్వరూ రాకూడదని బెంగళూరు పోలీసులు పదేపదే మనవి చేస్తున్నారు. అయినా చాలా మంది యువకులు అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్నారు.

 డ్రైవర్ ను చితకబాది ఆటో సీజ్ చేసి !

డ్రైవర్ ను చితకబాది ఆటో సీజ్ చేసి !

బెంగళూరు నగరంలో సంచరిస్తున్న ఆటోను పోలీసులు సీజ్ చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని పిణ్యా పోలీస్ స్టేషన్ పరిధిలో సంచరిస్తున్న ఆటోను కానిస్టేబుల్ శంకర్ నిలిపాడు. తరువాత ఆటో డ్రైవర్ తో వాగ్వివాదానికి దిగిన కానిస్టేబుల్ శంకర్ అతన్ని చితకబాది అతని ఆటోను సీజ్ చేశాడు.

 ఆటో అదుపుతప్పి రోడ్డు డివైడర్ !

ఆటో అదుపుతప్పి రోడ్డు డివైడర్ !

సీజ్ చేసిన ఆటోను పోలీస్ స్టేషన్ కు తీసుకుని శంకర్ స్వయంగా నడుపుకుంటూ వెలుతున్నాడు. ఆ సందర్బంలో మార్గం మధ్యలో వేగంగా వెలుతున్న ఆటో రోడ్డు డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ శంకర్ తలకు తీవ్రగాయాలైనాయి. వెంటనే కానిస్టేబుల్ శంకర్ ను జాలహళ్ళిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై శంకర్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన శంకర్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
A police constable, who suffered critical injuries while driving an auto that he had impounded for violating the lockdown, died early morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X