వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: నిన్న కోతులు, ఇప్పుడు కుక్కలు, కరోనా కాదు దాని జేజమ్మ వచ్చినా మేము మారం !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ చెన్నై/ కోయంబత్తూర్: కరోనా వైరస్ (COVID 19) వ్యాధిని అరికట్టడానికి మనం కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు మనవి చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ సమదూరం పాటించాలని, అప్పుడే కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి చాన్స్ వస్తోందని అధికారులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. అయినా మనుషులు మాత్రం మారడం లేదు, మా తీరు ఇంతే, కరోనా కాదు కదా, దాని జేజమ్మ వచ్చినా మేము మాత్రం మారం అంటున్నారు. ఇటీవల ఆహారం కోసం కడుపు నింపుకోవడానికి కోతులు భౌతిక దూరం పాటిస్తున్న సమయంలో తీసిన ఫోటోను కేంద్ర మంత్రి స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మనం కోతులను చూసి భౌతిక దూరం ఎలా పాటించాలో నేర్చుకుందాం అని కేంద్ర మంత్రి చెప్పినా చాలా మంది పట్టించుకోవడం లేదు. ఇప్పుడు విశ్వాసానికి పెట్టింది పేరు అయిన కుక్కలు (శునకాలు) భౌతిక దూరం ఎలా పాటిస్తున్నాయో, యజమాని చెప్పిన మాటలను అవి ఎలా వింటున్నాయో చూస్తే మనం తలదించుకోవాల్సి వస్తోంది.

Lockdown: ఆంధ్రా- కర్ణాటక బార్డర్ లో 66 చెక్ పోస్టులు, నో ఎంట్రీ, తెలంగాణ కూడా, ప్రాణాలతో గేమ్స్ !Lockdown: ఆంధ్రా- కర్ణాటక బార్డర్ లో 66 చెక్ పోస్టులు, నో ఎంట్రీ, తెలంగాణ కూడా, ప్రాణాలతో గేమ్స్ !

ఒక్క మాట వినకపోతే ఎలా ?

ఒక్క మాట వినకపోతే ఎలా ?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలతో ఫుల్ బాల్ ఆడుకుంటోంది. ఎప్పుడు ? ఎలా ? ఎవరి వలన ఆ కరోనా వైరస్ వ్యాపిస్తోందో తెలీక ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి. కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి భారతదేశంలో నేటి నుంచి (మార్చి 4వ తేదీ సోమవారం) 17వ తేదీ వరకు మూడో విడత లాక్ డౌన్ అమలు చేశారు. మేము చెప్పిన ఒక్క మాట వినండి, కరోనా వైరస్ తో మనం పోరాడి విజయం సాధిస్తాం అని కేంద్ర ప్రభుత్వం, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మనవి చేస్తూనే ఉన్నాయి. అయితే ఆ ఒక్కమాట మాత్రం మనం వినడం లేదు.

మాస్క్ పెట్టుకుంటే గ్లామర్ తగ్గిపోతుందా ?

మాస్క్ పెట్టుకుంటే గ్లామర్ తగ్గిపోతుందా ?

బయటకు వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కులు పెట్టుకోవాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మనతో పాటు ఎదుటి వారు తుమ్మినా, దగ్గినా మనం జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతినిత్యం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ఇలా చిన్నచిన్న పనులు చెయ్యాలని, అప్పుడే కరోనా మన దగ్గరకు రాదని ప్రభుత్వాలు, అధికారులు పదేపదే చెబుతున్నారు. అయితే ముఖానికి మాస్కులు పెట్టుకుంటే ఎక్కడ మా గ్లామర్ తగ్గిపోతుందో ? అనే బిల్డప్ తో చాలా మంది మాస్క్ లు వేసుకోకుండా రోడ్ల మీదకు పోలో అంటూ వచ్చేస్తున్నారు.

కడుపు నింపుకోవడానికి కోతులు ఏం చేశాయి !

కడుపు నింపుకోవడానికి కోతులు ఏం చేశాయి !

లాక్ డౌన్ కారణంగా పనులు లేక, చేతిలో ఉన్న డబ్బులు ఖాళీ అయిపోవడంతో పేదలు, కార్మికులు, వలస కూలీలు, మధ్య తరగతికి చెందిన కొందరు ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే ఇటీవల అరుణాచల్ ప్రదేశ్- అసోం జాతీయ రహదారిలో కరబూజ కాయలు, అరటి పండ్లు కావాలంటే నేను చెప్పినట్లు వినాలని, దూరం దూరం (భౌతిక దూరం) ఉండాలని ఆ పండ్లు ఇస్తున్న వ్యక్తి అక్కడ గుంపులుగా ఉన్న కోతులకు చెప్పాడు. చెప్పిన మాట వినకపోతే తినడానికి పండ్లు ఇవ్వరని, తరువాత మన ఆకలి ఎలా తీరుతుందనే భయంతో ఆ కోతులు పండ్లు ఇస్తున్న వ్యక్తి చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించాయి.

మేము మారం అంతే

మేము మారం అంతే

కోతులు భౌతిక దూరం పాటించి కడుపు నింపుకుంటున్న సమయంలో తీసిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. మనం కోతులను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అంటూ స్వయంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అవి వైరల్ అయ్యాయి. ఇలాంటి వీడియోలు, ఫోటోలు ఎంత చూసినా, కరోనా వైరస్ ఎంత భయంకరమైనదో తెలిసినా మేము మాత్రం మారం అంటున్నారు కొందరు ప్రజలు

ఫాం హౌస్ లో కుక్కలు

ఫాం హౌస్ లో కుక్కలు

తమిళనాడులో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా వైరస్ వ్యాధి విస్తరించకుండా కట్టడి చెయ్యడానికి తమిళనాడు ప్రభుత్వం శక్తి వంచనలేకుండా పని చేస్తోంది. ఇదే సమయంలో తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని కవాయి ప్రియాలయం ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలోని ఓ ఫాం హౌస్ లోని మూడు కుక్కలు వాటి యజమాని చెప్పిన మాటలను ఎలా వింటున్నాయో అనే విషయం ఈ ఫోటో చూస్తే అర్థం అవుతోంది.

ఈ రోజు వాటి విలువ తెలిసింది

ఈ రోజు వాటి విలువ తెలిసింది

ఫాం హౌస్ యజమాని సెల్వ ప్రస్తుతం గోవాలో ఉంటున్నారు. గోవాలో ఉంటున్న సెల్వ ఒన్ ఇండియా న్యూస్ రీడర్. ప్రస్తుతం కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం చెబుతోందని సెల్వ గుర్తు చేశారు. ఒక రోజు ఫాం హౌస్ లో మూడు కుక్కలు ఎక్కువ అల్లరి చేస్తున్నాయని, అక్కడికి వెళ్లిన సమయంలో ఇలాగే అల్లరి చేస్తే తాను ఇక్కడికి రామని, వెళ్లిపోతామని ఆ మూడు కక్కలకు చెప్పామని, ఆ సమయంలో అవి సైలెంట్ గా దూరం దూరంగా కుర్చుని మేము చెప్పినట్లు విన్నాయని వివరిస్తూ ఆ ఫోటోను ఒన్ ఇండియాకు పంపించారు.

Recommended Video

Lockdown 3.0 : It's Pollution Time, Massive Traffic Jams On Roads In Amid Relaxations
ఈ ఫోటో ఇప్పుడు ఉపయోగపడింది

ఈ ఫోటో ఇప్పుడు ఉపయోగపడింది

కుక్కలు భౌతిక దూరం పాటిస్తున్న సమయంలో ఈ ఫోటో తీసి చాలా కాలం అయ్యిందని, ఇప్పుడు ఆ ఫోటో ప్రజలకు చాలా అవసరం అని భావించి దానిని పంపించానని సెల్వ వివరించారు. మనుషులు చెప్పిన మాటలను కోతులు, కుక్కలు వింటున్నాయి, అయితే మనుషులు మాత్రం మనుషులు చెప్పిన మాటలు వినడం లేదని ఈ ఫోటోలు చూసిన చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Coronavirus Lockdown: Our reader has sent a photograph in which her farm dogs are there and they obey the social distancing in a unique way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X