వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus Lockdown: హనుమజయంతికి కరోనా కష్టాలు, సమదూరం, వైరల్, నేర్చుకోండి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హుబ్బళి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి భారతదేశంలో లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా వైరస్ భయం నడుమ దేశ ప్రజలు ఉగాది, శ్రీరామనవమి పండుగలు సర్వసాదారణంగా చేసుకున్నారు. ఇప్పుడు హనుమజయంతి పండుగను హిందువులు ప్రభుత్వ నియమాలను పాటిస్తూ సమదూరం పాటిస్తూ జరుపుకున్నారు. కరోనా వైరస్ వ్యాధిని ధైర్యంగా ఎదుర్కోవాలంటే మనం చెయ్యాల్సింది సమదూరం పాటించడమే అంటూ ప్రభుత్వాలు పిలుపు నివ్వడంతో ప్రతి సంవత్సరం హిందువులు ఎంతో వైభవంగా నిర్వహించే హనుమజయంతిని అతి కొంత మంది మాత్రమే ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా శ్రీ ఆంజనేయస్వామికి సమదూరం పాటిస్తూ పూజలు చేసి పండుగ జరుపుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిని చూసి మనం అందరూ నేర్చుకోవాల్సింది చాలా ఉందని నెనిజన్లు పోస్టు చేస్తున్నారు.

Coronavirus: బెంగళూరులో 59 కరోనా పాజిటివ్ కేసులు, క్వారంటైన్ లో 14 వేల మంది, లింక్ !Coronavirus: బెంగళూరులో 59 కరోనా పాజిటివ్ కేసులు, క్వారంటైన్ లో 14 వేల మంది, లింక్ !

దేవాలయాలకు తాళం !

దేవాలయాలకు తాళం !

బుధవారం హనుమజయంతి. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా హనుమజయంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ప్రతి ఆంజనేయస్వామి ఆలయంలో హనుమజయంతి సందర్బంగా హోమాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే భారతదేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలకు తాళం వేశారు.

హనుమంతుడికి పూజలు చెయ్యాలని !

హనుమంతుడికి పూజలు చెయ్యాలని !

హనుమజయంతి సందర్బంగా చాలా మంది శ్రీ ఆంజనేయస్వామికి పూజలు చెయ్యాలని ప్రయత్నించారు. అయితే ఎక్కడా శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు ఏ హిందూ దేవాలయాల తలుపులు తియ్యలేదు. కొందరు ఇళ్లలోనే హనుమంతుడి జపం చేస్తూ స్వామి వారికి పూజలు చేసి హనుమజయంతిని జరుపుకున్నారు.

హనుమజయంతి రోజు ఇలా పూజలు !

హనుమజయంతి రోజు ఇలా పూజలు !

కర్ణాటకలోని హుబ్బళి- దారవాడ జంట నగరాల్లో బుధవారం హనుమజయంతి సందర్బంగా స్థానికులు శ్రీ ఆంజనేయస్వామికి పూజలు చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నించారు. అయితే హుబ్బళి- దారవాడ జంట నగరాల్లో ఎక్కడా ఒక్క ఆంజనేయస్వామి ఆలయం తలుపులు తియ్యకపోవడంతో భక్తులు నిరాశ చెందారు. చివరి ఓ ప్రాంతంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసిన స్థానికులు సమదూరం పాటిస్తూ పూజలు చేసి హనుమజయంతిని జరుపుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

హుబ్బళిలో స్థానికులు కరోనా వైరస్ లాక్ డౌన్ నియమాలు పాటిస్తూ సమదూరం పాటిస్తూ హనుమజయంతిని జరుపుకుంటున్న సమయంలో తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేవుడిని ఎలా పూజించినా స్వామివారు ఆశీర్వదిస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడికి పూజాలు ఎలా చేసినా ఎలాంటి అపచారం జరగదని హుబ్బళిలోని స్థానికులు నిరూపించారని, వీరిని చూసి దేశంలో చాలా మంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశంలోని ప్రసిద్ది చెందిన దేవాలయాలతో పాటు అన్ని ఊర్లలోని ఆలయాలు మూసివేసిన విషయం తెలిసిందే.

English summary
Lockdown: In Hubballi, Karnataka devotees maintain social distancing while offering prayers to lord Hanuman at a temple on the occasion of Hanuman Jayanti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X