వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: సమ్మర్ సేల్స్ కు ఊహించని దెబ్బ, లక్షల బీర్ బాటిల్స్ చెత్తకుప్పల్లో, వందల రూ, కోట్లు నష్టం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ విధిస్తున్నామని మార్చి 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 24వ తేదీ నుంచి నేటి వరకు లాక్ డౌన్ అమలులోనే ఉంది. లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యాపారలావాదేవీలు దాదాపుగా నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం తెచ్చి పెడుతున్న ఎక్సైజ్ శాఖ ఇప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది. వేసవిలో జోరుగా బీర్ల వ్యాపారం చెయ్యాలని లక్షల బీర్ బాటిల్స్ స్టాక్ పెట్టుకున్న లిక్కర్ వ్యాపారులు ఇప్పుడు సమ్మర్ సేల్స్ లేకపోవడంతో బీర్ల ఎక్స్ పైరీ డేట్లు దగ్గర పడిపోవడంతో దిక్కుతోచక అయోమయంలో పడిపోయారు. అన్ని ప్రాంతాల్లో లిక్కర్ వ్యాపారాలకు అనుమతి ఇవ్వపోతే ఎక్స్ పైరీ డేట్ దగ్గర పడిన కొన్ని లక్షల బీర్ బాటిల్స్ చెత్తకుప్పలో వేసి వాటిని నాశనం చెయ్యాల్సి వస్తోందని లిక్కర్ వ్యాపారులు లబోదిబో అంటున్నారు.

Corona Lockdown: కోతులను చూసి నేర్చుకుందాం, కోతులకు మనకు అదే తేడా, కేంద్ర మంత్రి, వైరల్!Corona Lockdown: కోతులను చూసి నేర్చుకుందాం, కోతులకు మనకు అదే తేడా, కేంద్ర మంత్రి, వైరల్!

లాక్ డౌన్ తో ఊహించని మలుపు

లాక్ డౌన్ తో ఊహించని మలుపు

కరోనా వైరస్ ను అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చేస్తారని ముందుగా ఊహించలేని లిక్కర్ షాప్ యజమానులు వేసవి కాలంలో జోరుగా వ్యాపారం చెయ్యాలని ముందు కొన్ని లక్షల బీరు బాటిల్స్ స్టాక్ పెట్టుకున్నారు. వేసవి దెబ్బకు దుకాణాలు, గౌడన్లలో ముగ్గుతున్న బీర్లు తయారు చేసి చాలా నెలల అయిపోవడం, మే 3వ తేదీ నుంచి మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడగించడంతో తయారు చేసిన బీర్లు గడువు (best before date) లోపు విక్రయించడానికి అవకాశం లేకపోవడం, ఎక్స్ పైరీ డేట్ దగ్గర పడిపోవడంతో లిక్కర్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. లిక్కర్ విక్రయాలకు అవకాశం లేకపోతే కొన్ని లక్షల బీరు బాటిల్స్ నాశనం చెయ్యాల్సి వస్తోందని లిక్కర్ వ్యాపారులు లబోదిబో అంటు వాపోతున్నారు.

రాష్ట్రాలకు భారీ ఆధాయం

రాష్ట్రాలకు భారీ ఆధాయం

రాష్ట్ర ప్రభుత్వాలకు లిక్కర్ విక్రయాల వలన భారీగా ఆదాయం వస్తోంది. కర్ణాటకలో అయితే ఆ రాష్ట్ర ఖజానాకు ఎక్కువ ఆదాయం తెచ్చి పెడుతున్న రెండో శాఖగా ఎక్సైజ్ శాఖ రికార్డుల్లో ఉంది. కర్ణాటకలోని వైన్స్ షాప్ లు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్ ల్లో కొన్ని లక్షల బీరు బాటిల్స్ స్టాక్ పెట్టుకున్నారు.

సమ్మర్ సేల్స్ పై భారీ దెబ్బ

సమ్మర్ సేల్స్ పై భారీ దెబ్బ

సహజంగా వేసవి కాలంలో మద్యం ప్రియులు ఎక్కువగా బీర్లు సేవిస్తుంటారు. వేసవి కాలంలో బీర్లు ఎక్కువ సేల్స్ అవుతాయని ఊహించిన లిక్కర్ వ్యాపారులు ఆర్డర్లు ఇచ్చి మరీ లక్షల లక్షల బీర్ బాటిల్స్ స్టాక్ పెట్టుకున్నారు. మే 20వ తేదీ వరకు లిక్కర్ వ్యాపారులు జోరుగానే బీర్లు విక్రయించారు. అయితే తరువాత లాక్ డౌన్ అమలు కావడంతో సమ్మర్ సేల్స్ (బీర్లు) మీద భారీ దెబ్బ పడిందని లిక్కర్ వ్యాపారులు అంటున్నారు.

చెత్త కుప్పల్లోకి ఖరీదైన బీర్లు

చెత్త కుప్పల్లోకి ఖరీదైన బీర్లు

ప్రస్తుతం లిక్కర్ యాజమానుల దగ్గర ఉన్న బీర్లు జనవరి, ఫిబ్రవరి నెలలో తయారు చేసినవే. బీర్లు మీద ఎమ్ఆర్ పీ రేట్లతో పాటు ఎక్స్ పైరీ డేట్లు (best before date) ప్రింట్ చేశారు. ఎక్స్ పైరీ డేట్ల గడువు పూర్తి అయితే ఆ బీర్లను ఎవ్వరూ తీసుకోరని, విక్రయించడానికి తమకు అవకాశం ఉండదని లిక్కర్ వ్యాపారులు అంటున్నారు. అన్ని ప్రాంతాల్లో మద్యం విక్రయించడానికి అవకాశం ఇవ్వకపోతే ఎక్స్ పైరీ అయిన బీర్లు చెత్తకుప్పలో వేయాల్సి వస్తోందని లిక్కర్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పీఎం మోదీ మీద ఒత్తిడి, అయితే ?

పీఎం మోదీ మీద ఒత్తిడి, అయితే ?

లిక్కర్ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని గత 40 రోజుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మీద అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఒత్తిడి చేశాయి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం లిక్కర్ వ్యాపారానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే మే 4వ తేదీ నుంచి షరతులతో మద్యం వ్యాపారం చేసుకోవడానికి అవకాశం వచ్చిందని, అయినా ఇలాంటి షరతులతో తమ దగ్గర ఉన్న మొత్తం స్టాక్ బీర్లు విక్రయించడానికి సాధ్యంకాదని లిక్కర్ వ్యాపారులు అంటున్నారు.

లక్షల బీర్ బాటిల్స్ నేలపాలు

లక్షల బీర్ బాటిల్స్ నేలపాలు

మార్చి 4వ తేదీ నుంచి లిక్కర్ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం లేకపోతే ఎక్స్ పైరీ డేట్ ఉన్న కొన్ని లక్షల బీర్ బాటిల్స్ నేలపాలు కానున్నాయని కర్ణాటక లిక్కర్ వ్యాపారుల సంఘం అంటోంది. ఎక్స్ పైరీ అయిన బీర్లను విక్రయిస్తే లేనిపోని సమస్యలు వచ్చి మొదటికే మోసం వస్తోందని, లిక్కర్ వ్యాపారాలకు అవకాశంలేకపోతే కొన్ని లక్షల బీర్ బాటిల్స్ మేమే నాశనం చెయ్యాల్సి వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. మొత్తం మీద వేసవిలో బీర్లు జోరుగా విక్రయించాలని కోట్ల రూపాయల విలువైన లక్షల బీర్ బాటిల్స్ స్టాక్ పెట్టుకున్న లిక్కర్ వ్యాపారులకు మొదటికే మోసం వస్తోంది.

English summary
Coronavirus Lockdown: If Government Not Allowed To Open Liquor Shop, Lakhs Of Litres Of Beer Going To Be Waisted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X