వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Corona Lockdown: లాక్ డౌన్ డిమాండ్, కనపడితే కరోనాను అమ్మేస్తారు, రెఢీనా ? నాసామిరంగ !

|
Google Oneindia TeluguNews

పుదుచ్చేరి/ చెన్నై: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి ప్రపంచ దేశాలతో ఫుల్ బాల్ ఆడుకుంటుంది. కరోనా కట్టడి కోసం భారతదేశంతో సహ ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు లాక్ డౌన్ అమలు చేశారు. భారతదేశంలో లాక్ డౌన్ సందర్బంగా నిత్యవసర వస్తువులకు భలే డిమాండ్ ఏర్పడింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో నిత్యవసర వస్తువుల కంటే లిక్కర్ కు భలే డిమాండ్ ఉంది. పుద్దు చ్చేరిలో రూ. 71 లక్షల లిక్కర్ సీజ్ చేశారు. పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు తహసిల్దార్ తోపాటు అనేక మంది అధికారులను సస్పెండ్ చేశారు. తమిళనాడులో ఏకంగా ప్రజాప్రతినిధులు నాటు సారా విక్రయిస్తూ పట్టుబడుతున్నారు. కొనేవాడు ఉండాలే కాని కనపడితే కరోనాను కూడా అమ్మేస్తాం, మీరు రెఢీనా ?, మేము మాత్రం వెనక్కిపోం అంటున్నారు బ్లాక్ మార్కెట్ దందా లీడర్లు.

Coronavirus: నిత్యానందస్వామి మహత్యం, ఆదేశంలో కరోనా లేదు, రొమాంటిక్ సాంగ్స్, డ్యాన్స్ లు !Coronavirus: నిత్యానందస్వామి మహత్యం, ఆదేశంలో కరోనా లేదు, రొమాంటిక్ సాంగ్స్, డ్యాన్స్ లు !

రూ. 70 లక్షల లిక్కర్ సీజ్

రూ. 70 లక్షల లిక్కర్ సీజ్

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లాక్ డౌన్ సందర్బంగా అన్ని లిక్కర్ షాప్ లు, బార్ అండ్ రెస్టారెంట్స్ కు తాళం వేశారు. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే పుదుచ్చేరిలో ప్రస్తుతం నిర్మానుషంగా మారింది. అయినా పుదుచ్చేరిలో లిక్కర్ కు భలే డిమాండ్ ఏర్పడింది. లిక్కర్ కు ఉన్న డిమాండ్ ఎంతగా ఉందంటే అది మాటలతో చెప్పలేనంతగా ఉంది. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న రూ. 70 లక్షల విలువైన మద్యం ఒకే రోజు స్వాధీనం చేసుకున్నారు. ఇక నాటుసారా, కల్లు కథ సరేసరి.

రూ. 300 క్వాటర్ రూ. 1, 500

రూ. 300 క్వాటర్ రూ. 1, 500

పుదుచ్చేరిలో జోరుగా బ్లాక్ మార్కెట్ లో లిక్కర్ వ్యాపారం జరుగుతోంది. మామూలుగా రూ. 300 విక్రయించే క్వాటర్ లిక్కర్ బాటిల్ ఇప్పుడు రూ. 1, 500 నుంచి డిమాండ్ ను బట్టి మరింత ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని స్వయంగా పోలీసు అధికారులు అంటున్నారు.

డిప్యూటి గవర్నర్ జోక్యంతో !

డిప్యూటి గవర్నర్ జోక్యంతో !

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జోరుగా బ్లాక్ మార్కెట్ లో లిక్కర్ వ్యాపారం జరుగుతోందని వెలుగు చూడటంతో కర్ణాపేడి డిప్యూటి గవర్నర్ జోక్యం చేసుకున్నారు. వెంటనే బ్లాక్ మార్కెట్ లో లిక్కర్ వ్యాపారం చేస్తున్న వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

డిప్యూటీ పోలీసు కమిషనర్, తహసిల్దార్ ఇంటికి

డిప్యూటీ పోలీసు కమిషనర్, తహసిల్దార్ ఇంటికి

పుదుచ్చేరిలో అక్రమ మద్యం జోరుగా సాగడంతో అక్కడి నారాయణస్వామి ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పుదుచ్చేరి ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దయాన్ మీద బదిలి వేటు పడింది. తహసిల్దార్ కార్తికేయన్ తో పాటు పలువురు పోలీసు అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులను సస్పెండ్ చేశారు.

36 బార్ల లైసెన్స్ లు రద్దు, తోలు తీస్తాం

36 బార్ల లైసెన్స్ లు రద్దు, తోలు తీస్తాం

పుదుచ్చేరిలో లిక్కర్ దందాను అరికట్టడానికి స్పెషల్ ఆఫీసర్ గా రాహుల్ అల్వార్ భాద్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా స్పెషల్ ఆఫీసర్ రాహుల్ అల్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే అన్ని లిక్కర్ షాప్ లు, బార్ అండ్ రెస్టారెంట్ లు, పబ్ లకు సీల్ వేశామని, అయినా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని అన్నారు. అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేస్తున్న 36 మద్యం షాప్ ల లైసెన్స్ లు రద్దు చేశామని, 216 కేసులు నమోదు చేశామని, ఇక ముందు ఎవరైనా బ్లాక్ మార్కెట్ లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుని వారి తోలు తీస్తామని రాహుల్ అల్వాల్ హెచ్చరించారు.

పంచాయితీ అధ్యక్షురాలి మొగుడి చేతివాటం

పంచాయితీ అధ్యక్షురాలి మొగుడి చేతివాటం

తమిళనాడులోని ఉప్పిలియాపురం సమీపంలోని పచ్చమలై ప్రాంతంలోని కోంబై గ్రామ పంచాయితీ అధ్యక్షురాలి భర్త రాజేంద్రన్ జోరుగా నాటు సారా తయారు చేసి విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారి కలైసెల్వమ్ ఆయన సిబ్బందితో కలిసి పంచాయితీ అధ్యక్షురాలి తోటలో దాడులు చేసి 150 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. పరారైన పంచాయితీ అధ్యక్షురాలి భర్త రాజేంద్రన్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి కలైసెల్వమ్ మీడియాకు చెప్పారు.
ఇక లెక్కలేనంత నాటుసారా, కల్లు స్వాధీనం చేసుకుంటున్న పోలీసు అధికారులు వాటిని ధ్వంసం చేస్తున్నారు.

English summary
Coronavirus Lockdown: Illegal liquor sales is seeing no end in Puducherry and Tamil Nadu and police have intensified the hunt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X