బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: బెంగళూరు వాష్ ఔట్, ఖాళీ చేస్తుంటే ఏం చేస్తున్నారు ? సినిమా చూస్తున్నారా ?, సిద్దూ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు బీడుపడుతోందని, ప్రజలు ఖాళీ చేసే పరిస్థితి ఎదురైయ్యిందని, కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు సిలికాన్ సిటీలోని ప్రజలు వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని, సిలికాన్ సిటి వాష్ ఔట్ అవుతోందని, వారికి నచ్చచెప్పి ఇక్కడే ఉండటానికి ఈ బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని, సినిమా చూసినట్లు చూస్తున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడుతున్నారు. ఒకప్పుడు బెంగళూరులో బతకాలి, బెంగళూరులో జీవించాలి, ఆ అవకాశం మాకు రావాలని ఎదురు చూసిన ప్రజలు నేడు బెంగళూరు వెంటనే ఖాళీ చేసేయాలి అని అంటున్నారని మాజీ సీఎం సిద్దరామయ్య కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.

Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్

ప్రభుత్వం ఆపని చెయ్యాలి !

ప్రభుత్వం ఆపని చెయ్యాలి !


బెంగళూరులో నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాల ప్రజలు, కర్ణాటకలోని వివిద ప్రాంతాల ప్రజలు వారి సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్ సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఇతర ప్రాంతాల ప్రజలు (నాన్ లోకల్) వారి సొంత ప్రాంతాలకు వెళ్లకుండా బెంగళూరులోనే నివాసం ఉండే విధంగా వారికి ధైర్యం చెప్పాలని, అలాంటి చర్యలు తీసుకోవడంలో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.

అన్నం పెట్టి డబ్బులు ఇవ్వండి

అన్నం పెట్టి డబ్బులు ఇవ్వండి

బెంగళూరులో నివాసం ఉంటున్న ప్రజలు ప్రస్తుతం కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఎలాంటి పనులు చెయ్యలేక ఖాళీ కడుపులతో పస్తులు ఉంటున్నారని, వారికి కనీసం అన్నం పెట్టడం ప్రభుత్వ ధర్మమని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఇతర ప్రాంతాల ప్రజలు వారు చెయ్యడానికి పనులు కల్పించాలని, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి డబ్బులు ఇవ్వాలని, వారు బెంగళూరు ఖాళీ చెయ్యకుండా సర్దిచెప్పడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నించాలని మాజీ సీఎం సిద్దరామయ్య సూచించారు.

లాక్ డౌన్ అవసరం, కానీ సమయం మించిపోయింది

లాక్ డౌన్ అవసరం, కానీ సమయం మించిపోయింది

బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడానికి లాక్ డౌన్ పొడగించడం ఎంతో అవసరం అని మాజీ సీఎం సిద్దరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే కరోనా వైరస్ ఎక్కువ శాతం వ్యాపించిపోయిందని, లాక్ డౌన్ పొడగించడానికి సమయం మించిపోయిందని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు.

కరోనా కట్టడికి ఏం చేశారో లెక్కలు చెప్పండి !

కరోనా కట్టడికి ఏం చేశారో లెక్కలు చెప్పండి !

కరోనా కట్టడి కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, కరోనా వ్యాధి నిర్మూలణ కోసం ఎన్ని రూ. వేల కోట్లు ఖర్చు చేశారు ? ప్రజలకు, మాకు వాటి లెక్కలు చెప్పండి అంటూ మాజీ సీఎం సిద్దరామయ్య కర్ణాటకలోని బీఎస్. యడియూరప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాధిని అడ్డం పెట్టుకున్న ఈ బీజేపీ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసిందని మాజీ సీఎం సిద్దరామయ్య కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఆ రోజు నేను చెబితే విన్నారా ?

ఆ రోజు నేను చెబితే విన్నారా ?

కర్ణాటకలో రాబోయో ఎన్నికల్లో జేడీఎస్ పార్టీతో పొత్తుపెట్టుకోమని, భవిష్యత్తులో ఆ పార్టీతో అంటిముట్టనట్లు ఉంటామని కేపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి దినేష్ గుండూరావ్ అన్న మాటలపై మాజీ సీఎం సిద్దరామయ్య స్పందించారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో జేడీఎస్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తుపెట్టుకోకూడదని తాను ఒక్కడే ఎక్కువగా డిమాండ్ చేశానని, ఆరోజు తనది సింగిల్ వాయిస్ అని, ఆ రోజు చేసిన తప్పు గురించి ఇప్పుడు అందరూ బాధపడుతూ చర్చించుకుంటున్నాని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాజీ సీఎం సిద్దరామయ్య ఝలక్ ఇచ్చారు.

క్వారంటైన్ కాదు విశ్రాంతి అంతే !

క్వారంటైన్ కాదు విశ్రాంతి అంతే !

సిద్దరామయ్య ప్రస్తుతం ఆయన సొంత జిల్లాలోని మైసూరుకు చేరుకున్నారు. తాను విశ్రాంతి తీసుకోవడానికి బెంగళూరు నుంచి మైసూరు వచ్చానని, అంతే కానీ తాను హోమ్ క్వారంటైన్ లో ఉండటానికి కాదని మాజీ సీఎం సిద్దరాయ్య స్పష్టం చేశారు. తాను బెంగళూరులోని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చూసి భయపడి మైసూరు రాలేదని, ఇక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తరువాత మళ్లీ బెంగళూరు వెలుతానని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు.

English summary
Coronavirus: lockdown is now required most in the state. but time is over. Coronavirus cases are increasing drastically in bengaluru. So people are leaving" said siddaramaiah in mysuru,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X