వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown: నిర్మాలా సీతారామన్ ప్రెస్ మీట్ తో డైలీ సీరియల్ చూస్తున్నామా ? సీఎం, రూ. 20 లక్షల కోట్లు !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ రాయ్ పూర్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేదుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ లో ఎవరెవరికి ఎంతెంత కేటాయించాము అనే విషయంపై దేశ ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గత మూడు రోజుల నుంచి వివరాలు వెల్లడిస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ రూ. 20 లక్ష్లల కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ పై సరైన వివరాలు వెల్లడించకుండా ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో రోజుకొక మాట చెప్పిస్తున్నారని, ఇది దేశ ప్రజలకు డైలీ సీరియల్ చూసినట్లు ఉందని ఓ ముఖ్యమంత్రి ఎద్దేవ చేస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్ బాషలో ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గత మూడు రోజుల నుంచి చెబుతున్న మాటలు దేశ ప్రజలకు అర్థం కావడం లేదని ఆ ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తున్నారు.

Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !

సీఎం భూపేష్ ఫైర్

సీఎం భూపేష్ ఫైర్

ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేదుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ లో ఎవరెవరికి ఎంతెంత కేటాయించాము అనే విషయంపై దేశ ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గత మూడు రోజుల నుంచి వివరాలు వెల్లడిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వరుస ప్రెస్ మీట్ లపై చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ మండిపడ్డారు.

ప్రజలు డైలీ సీరియల్ చూస్తున్నారు

ప్రజలు డైలీ సీరియల్ చూస్తున్నారు

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గత మూడు రోజుల నుంచి వివరాలు వెల్లడిస్తున్నారని, ఒక్కసారిగా పూర్తి వివరాలు వెల్లడించడం లేదని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వరుస ప్రెస్ మీట్స్ చూస్తుంటే ప్రతిరోజు టీవీల్లో చూసే డైలీ సీరియల్స్ గుర్తుకు వస్తున్నాయని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ ఎద్దేవ చేశారు.

అయిపోలేదు ఇంకా ఉంది !

అయిపోలేదు ఇంకా ఉంది !

గత మూడు రోజుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారం, ఆయన ఆదేశాలతో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తున్న అనేక ప్యాకేజీల విషయంలో ప్రజలకు ఇంకా క్లారిటీ రాలేదని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ ఆరోపించారు. డైలీ సీరియల్ లో చివరిలో రేపు ఏం జరగబోతుందో వేచి చూడండి అన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ ఆరోపించారు.

Recommended Video

Rahul Gandhi Request To PM Modi
తరువాత భాగం నేడు పూర్తి అవుతుందా ? లేదా

తరువాత భాగం నేడు పూర్తి అవుతుందా ? లేదా

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేదుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించారని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ గుర్తు చేశారు. అయితే ఆ ప్యాకేజీతో ఎవరెవరికి లాభం అనే విషయంపై ఒక్కరోజులో క్లారిటీ ఇవ్వకుండా గత మూడు రోజుల నుంచి ప్రతిరోజూ కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తున్నారని, ఇలా ప్రజలను మాయ చెయ్యడానికి వీరు ప్రయత్నిస్తున్నారని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ ఆరోపించారు. ఈ రోజు శనివారంతో అయినా ఈ డైలీ సీరియల్ తరువాత భాగం పూర్తి అవుతుందో ? లేక ఆదివారం కూడా ఉంటుందో ? మనమే వేచి చూడాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ సింగ్ వ్యంగంగా అన్నారు.

English summary
Coronavirus lockdown: Its like a daily soap says Chhattisgarh CM on Nirmala Sitharaman press meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X