వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown:ఎమ్మెల్యేకు వర్తించని నిబంధన,పిల్లలు,పెద్దలతో కలిసి బర్త్ డే వేడుక, కేక్ కట్ చేసి,బిర్యానీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కరాళ న‌ృత్యం చేస్తుంటే..బాధ్యత కలిగిన నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొన్న మహారాష్ట్రలో దాదారావు కెచే అనే బీజేపీ ఎమ్మెల్యే సరుకులు పంపిణీ చేయడంలో సామాజిక దూరం పాటించలేదు. నిన్న జార్ఖండ్‌లో మరో బీజేపీ ఎమ్మెల్యే జార్ఖండ్ మైదానంలో ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు. కానీ ఇక్కడ కూడా సేమ్ సిచుయేషన్.. వీరిద్దరి వ్యవహారశైలితో తలపట్టుకుంటోన్న బీజేపీకి.. మరో ఎమ్మెల్యే తోడయ్యాడు. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే బర్త్ డేను అంగరంగ వైభవంగా చేసుకున్నాడు. అతని జన్మదిన వేడుకులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పిల్లలు కూడా

పిల్లలు కూడా

తుముకూరు జిల్లా తురువెకరె నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే జయరాం జన్మదినం శుక్రవారం. ప్రతీ ఏడాది హంగు ఆర్భాటంతో చేసుకునేవారు. కానీ ఈ సారి సామాజిక దూరం పాటిస్తే సరిపోయేది. లేదంటే దూరంగా ఉన్న ఓకే.. కానీ ఎమ్మెల్యే కదా.. బర్త్ డే చేసుకోకుంటే కొంపలు మునుగుతాయని అనుకున్నాడో ఏమో.. శుక్రవారం ఎప్పటిలాగానే బర్త్ డే జరుపుకున్నారు.

గ్లౌజ్ వేసుకొని మరీ..

గ్లౌజ్ వేసుకొని మరీ..

తుముకూరులో గుబ్బిలో హితులు, సన్నిహితుల సమక్షంలో బర్త్ డే జరుపుకున్నారు. తన చుట్టు పిల్లలు, సన్నిహితులు ఉండగా.. చేతికి గ్లౌజ్ వేసుకొని మరీ.. చాక్ లొట్ కేక్ కత్తిరించారు. తర్వాత చిన్నారుల సహా పెద్దలందరికీ బర్త్ డే కేకు పంచిపెట్టారు. తర్వాత అందరికీ బిర్యానీ పెట్టాడు. వందలాది మంది గుమికూడటంతో.. వైరస్ ఎక్కడ ప్రబలుతుందోననే టెన్షన్ నెలకొంది. కానీ ఎమ్మెల్యే మాత్రం తనకేమి పట్టనట్టు వ్యవహరించారు.

 యడియూరప్ప, శివకుమార్

యడియూరప్ప, శివకుమార్

బీజేపీ ఎమ్మెల్యే జయరాం తీరుపు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదివరకు కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా నిబంధనలను ఉల్లంఘించారు. మార్చి 15వ తేదీన బెలగవికి చెందిన బీజేపీ నేత కూతురి పెళ్లికి హాజరయ్యారు. వివాహానికి వెయ్యి మందికి పైగా హాజరవడం విశేషం. ఆ తర్వాత కర్ణాటక పీసీసీ చీఫ్‌గా పదవీ చేపట్టే సమయంలో డీకే శివకుమార్ కూడా సోషల్ డిస్టన్స్ మరచిపోయారు. కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయం వద్ద పదుల సంఖ్యలో జనం గుమిగూడటం ఆందోళన నెలకొంది.

కరోనా కలవరం..

కరోనా కలవరం..

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 6761కి చేరుకున్నది. ఇందులో 6039 మంది చికిత్స తీసుకుంటుండగా.. 516 మంది డిశ్చార్జ్ అయ్యారు. చనిపోయిన వారి సంఖ్య 206కి చేరుకున్నది. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 200కు చేరుకున్నది. శుక్రవారం ఒక్కరోజు 10 కేసులు బయటపడ్డాయి. ఇందులో మైసూరుకు చెందిన 8 ఏళ్ల బాలుడు, బెంగళూరు రూరల్‌కి చెందిన 11 ఏళ్ల బాలిక ఉన్నారు. వైరస్ తగ్గడంతో 34 మందిని డిశ్చార్జ్ చేశామని.. ఆరుగురు చనిపోయారని కర్ణాటక వైద్యారోగ్యశాఖ తెలిపింది. మరోవైపు లాక్‌డౌన్ పొడిగింపు ప్రధాని మోడీని సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని సీఎం యడియూరప్ప స్పష్టంచేశారు. మరోవైపు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 4500 మందిని ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Recommended Video

Coronavirus Lockdown: Trolls On AP Political Leaders Campaign by The Name Of Help To Poor

English summary
Karnataka BJP MLA M Jayaram was seen celebrating his birthday on Friday with hundreds of supporters in Tumkur Gubbi taluk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X