వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus Lockdown: కొడుకు కోసం 6 రాష్ట్రాలు దాటి 2,700 కిలోమీటర్లు వెళ్లిన తల్లి, సలామ్ !

|
Google Oneindia TeluguNews

కొచ్చి/బెంగళూరు/జైపూర్: కరోనా వైరస్ (COVId 19) మహమ్మారిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. కేరళలో నివాసం ఉంటున్న 50 ఏళ్ల మహిళ 3 రోజుల్లో పాటు 6 రాష్ట్రాలు దాటకుని అనారోగ్యంతో ఉన్న తన కొడుకును చూడటానికి ఏకంగా 2,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఆ మహిళ కొడుకు కోసం కేరళ నుండి ఆరు రాష్ట్రాలు దాటుకుని రాజస్థాన్ వెళ్ళి కొడుకును పరామర్శించారు.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బCoronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ

కొడుకు BSFలో ఉద్యోగి!

కొడుకు BSFలో ఉద్యోగి!

కేరళలో నివాసం ఉంటున్న మహిళ కుమారుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో ఉద్యోగం చేస్తున్నాడు. కేరళ మహిళ కుమారుడి పేరు అరుణ్ కుమార్ అని తెలిసింది. అనారోగ్యంతో భాదపడుతున్న అరుణ్ కుమార్ తన కుటుంబాన్ని చూడాలని కేరళలో నివాసం ఉంటున్న తల్లికి సమాచారం ఇచ్చాడు.

కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్

కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్

బీఎస్ఎఫ్ లో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడు అరుణ్ కుమార్ అనారోగ్యంతో భాదపడుతున్నాడని, అతన్ని చూడటానికి తమకు అవకాశం ఇవ్వాలని ఆ తల్లి కేంద్ర మంత్రి మురళిధరన్ కు మనవి చేశారు. తల్లి ఆవేదన అర్థం చేసుకున్న కేంద్ర మంత్రి మురళీధరన్ ఆమె కొడుకును చూడటానికి అవకాశం కల్పించారు.

6 రాష్ట్రాలు 3 రోజులు

6 రాష్ట్రాలు 3 రోజులు

బీఎస్ఎఫ్ లో ఉద్యోగం చేస్తున్న కొడుకు అరుణ్ కుమార్ ను చూడటానికి కేరళలో నివాసం ఉంటున్న మహిళకు కేంద్ర మంత్రి మురళీధరన్ ప్రత్యేక పాస్ ఇప్పించారు. కేంద్ర మంత్రి పాస్ ఇవ్వడంతో కేళరలో నివాసం ఉంటున్న ఆమె కేరళ నుంచి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా మూడు రోజుల పాటు ప్రయాణించి రాజస్థాన్ చేరుకున్నారు.

కోడలితో కొడుకు దగ్గరకు !

కోడలితో కొడుకు దగ్గరకు !

కేరళ నుంచి రాజస్థాన్ లోని కొడుకు అరుణ్ కుమార్ దగ్గరకు కారులో బయలుదేరిన కేరళ మహిళ వెంట ఆమె మేనకోడలు ఉన్నారు. లాక్ డౌన్ సందర్బంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఆరు రాష్ట్రాలు ప్రయాణించిన మహిళకు అవసరమైన అన్ని సధుపాయాలను కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

(FILE PIC)

 మీ రుణం జీవితంలో మరచిపోలేను !

మీ రుణం జీవితంలో మరచిపోలేను !

తన కుమారుడు అరుణ్ కుమార్ ను చూడటానికి కేరళ నుంచి రాజస్థాన్ చేరుకోవడానికి సహకరించిన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ పోలీసులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా కేంద్ర మంత్రి మురళీధరన్ కు తాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని కేరళ మహిళ మీడియాకు చెప్పారు.

Recommended Video

IPL 2020 : Sri Lanka To Host IPL If BCCI Agree
కొడుకు, కరోనా రోగుల కోసం !

కొడుకు, కరోనా రోగుల కోసం !

అనారోగ్యంతో భాదపడుతున్న తన కుమారుడితో పాటు దేశంలో కరోనా వైరస్ వ్యాధితో భాదపడుతున్న ప్రతి ఒక్కరు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని కేరళ మహిళ అన్నారు. ఇటీవల మొదటి విడత లాక్ డౌన్ అమలు చేసిన సమయంలో తెలంగాణకు చెందిన ఓ మహిళ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో చిక్కుకుపోయిన తన కుమారుడి పిలుచుకుని వెళ్లడానికి స్కూటీలో 1,400 కిలోమీటర్లు ప్రయాణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేరళ మహిళ ఏకంగా ఆరు రాష్ట్రాలు దాటుకుని 2,700 కిటోమీటర్లు ప్రయాణించారు. తల్లి ప్రేమకు హద్దులు లేవని మరోసారి వెలుగు చూసింది.

English summary
Coronavirus Lockdown: Kerala to Rajasthan, a woman travels 2700KM to meet ailing son, a BSF personnel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X