బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: భార్య కోసం సినిమా స్టైల్లో వచ్చాడు, క్రిమినల్ కేసు, ఏం జరిగిందంటే ?, సీన్ రివర్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ముంబై: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ విధించడంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. బెంగళూరులో ఉన్న భార్యను చూడాలని, ఆమెతో కలిసి ఉండాలని రెండు నెలలకుపైగా ఎంతో అత్రుతగా వేచి చూసిన భర్త ఎలాగైనా ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించాడు. బెంగళూరు వెలుతున్న లారీల డ్రైవర్లను వేడుకున్న భర్త బెంగళూరు చేరుకున్నాడు. భార్య దగ్గరకు వెళ్లిన భర్త కొన్ని గంటలు ఆమెతో సంతోషంగా ఉన్నాడో లేదో కాని పోలీసులు అతని ఇంటికి వెళ్లి అరెస్టు చేసి క్రిమినల్ కేసు నమోదు చేసి ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించారు. అయితే భర్త మీద ఇంత వరకు ఎలాంటి నేరచరిత్ర లేదు. కేవలం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగానే భర్త మీద క్రిమినల్ కేసు నమోదైయ్యిందని తెలుసుకున్న భార్య, వారి కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు.

Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?

బెంగళూరులో దంపతులు

బెంగళూరులో దంపతులు

బెంగళూరు- ముంబై జాతీయ రహదారిలోని తుమకూరు మెయిన్ రోడ్డు సమీపంలో మహమ్మద్ అయూబ్ అనే వ్యక్తి భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. మహమ్మద్ అయూబ్ ముంబైల్ లో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత మార్చి నెలలో మహమ్మద్ అయూబ్ ముంబై వెళ్లాడు.

లాక్ డౌన్ దెబ్బకు అక్కడే !

లాక్ డౌన్ దెబ్బకు అక్కడే !

మహమ్మద్ అయూబ్ ముంబైలో ఉన్న సమయంలోనే లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి నాలుగు సార్లు లాక్ డౌన్ పొడగించడంతో మహమ్మద్ అయూబ్ బెంగళూరులోని ఇంటికి రాలేక ముంబైలోనే కాలం గడిపాడు. మహమ్మద్ అయూబ్ భార్య మాత్రం బెంగళూరులోని తుమకూరు రోడ్డులోని ఇంటిలోనే ఉంటున్నది.

ఫోన్ చేసి ప్రశ్నిస్తున్న భార్య

ఫోన్ చేసి ప్రశ్నిస్తున్న భార్య

మహారాష్ట్ర కరోనా వైరస్ కు హాట్ స్పాట్ అయ్యింది. ఇక ముంబైలో కరోనా వైరస్ వ్యాధి కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో మహమ్మద్ అయూబ్ హడలిపోయాడు. ముంబైలో ఉన్న మహమ్మద్ అయూబ్ బెంగళూరులోని ఇంటికి రాలేకపోయాడు. ప్రతిరోజు భార్య ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు బెంగళూరు వస్తున్నావు అని మహమ్మాద్ అయూబ్ ను ప్రశ్నించేది. అయితే అన్ని మార్గాలు మూసుకోవడంతో మహమ్మద్ అయూబ్ బెంగళూరు రాలేకపోయాడు.

సినిమా స్టైల్లో ఇంటికి వచ్చేశాడు

సినిమా స్టైల్లో ఇంటికి వచ్చేశాడు

కొన్ని లారీలు పట్టుకున్న మహమ్మద్ అయూబ్ మహారాష్ట్ర సరిహద్దులు దాటి కర్ణాటకలో అడుగుపెట్టాడు. కొయ్యల లోడ్ తీసుకుని బెంగళూరుకు లారీ బయలుదేరుతున్నదని మహమ్మద్ అయూబ్ కు తెలిసింది. తాను డ్రైవర్ గా పని చేస్తున్నానని, తనను బెంగళూరు తీసుకెళ్లాలని మహమ్మద్ అయూబ్ లారీ డ్రైవర్ కు చెప్పాడు. మహమ్మద్ అయూబ్ సాటి డ్రైవర్ అనే జాలితో అతన్ని లారీలో బెంగళూరు పిలుచుకుని వచ్చారు. అర్దరాత్రి బెంగళూరు- తుమకూరు జాతీయ రహదారిలో లారీ దిగిన మహమ్మద్ అయూబ్ ఎవ్వరి కంటపడకుండా జాగ్రత్తగా ఇంటికి చేరుకున్నాడు.

అసలు విషయం తెలిసి సీన్ రివర్స్

అసలు విషయం తెలిసి సీన్ రివర్స్

ముంబై నుంచి మహమ్మద్ అయూబ్ బెంగళూరులోని ఇంటికి వచ్చి అక్రమంగా తలదాచుకున్నాడని ఓ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే మహమ్మద్ అయూబ్ ఇంటిని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేశారు. కరోనా హాట్ స్పాట్ అయిన ముంబై నుంచి అక్రమంగా బెంగళూరు వచ్చాడని అధికారులు నిర్దారించుకున్నారు.

క్రిమినల్ కేసుతో దిమ్మ తిరిగింది

క్రిమినల్ కేసుతో దిమ్మ తిరిగింది

ముంబై నుంచి వచ్చిన విషయం అధికారులకు సమాచారం ఇవ్వకుండా, క్వారంటైన్ లో ఉండకుండా సాటి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడని ఆరోపిస్తూ మహమ్మద్ అయూబ్ మీద క్రిమినల్ కేసు నమోదు చేశామని పోలీసులు అన్నారు. ముంబై నుంచి ఎన్నో కష్టాలు పడి బెంగళూరు వచ్చి భార్యతో జాలీగా ఉందామని అనుకున్న మహమ్మద్ అయూబ్ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి అతన్ని కరోనా క్వారంటైన్ కు పంపించడంతో అతని కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు.

English summary
Coronavirus lockdown: Bengaluru police booked criminal case against Mohammed Ayub the driver who come to house in Bengaluru-Tumakuru road without informing to officials in the fear of quarantine. Mohammed Ayub come to Bengaluru in a truck to see wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X