వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: కరోనా కామాంధుడు, మహిళా పోలీసులను ఎస్పీ ఏం చేశాడో తెలుసా ? పాపం పండింది !

|
Google Oneindia TeluguNews

పుదుచ్చేరి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి వ్యాపించకుండా దేశం మొత్తం అమలు చేసిన లాక్ డౌన్ విధుల్లో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రజలను కరోనా వైరస్ నుంచి కాపాడుతున్న పోలీసులను దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు అభినందిస్తున్నారు. అయితే కరోనా కట్టడి కోసం డ్యూటీ చెయ్యాలని పై అధికారులు ఓ ఎస్పీకి ప్రత్యేక విధులు అప్పగించారు అయితే సదరు ఎప్పీ విధులు పక్కన పెట్టి ఒక మహిళా పోలీసు అధికారిపై, మహిళా పోలీసులతో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో పుదుచ్చేరీలో ఆ ఎస్పీ మీద నాలుగు సెక్షన్ల కింద పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. చెప్పింది చెయ్యకుండా రెచ్చిపోయిన కరోనా కామాంధుడు ఎస్పీని జైలుకు పంపించారు. లైంగిక వేధింపులకు గురి చేసిన ఎస్పీ పాపం పండిపోవడంతో సాటి మహిళా పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

పుదుచ్చేరీ ప్రభుత్వం

పుదుచ్చేరీ ప్రభుత్వం

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి మే 3 వరకు లాక్ డౌన్ జారీ చేశారు. పుదుచ్చేరిలో లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలను ఇళ్ల నుంచి బయటకురాకుండా చూడాలని స్థానిక పోలీసులకు పుదుచ్చేరీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

లాక్ డౌన్ గీత దాటితే !

లాక్ డౌన్ గీత దాటితే !

లాక్ డౌన్ గీతదాటిన వారిపై చర్యలు తీసుకోవాలని సుమారు 1,000 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని పుదుచ్చేరీలోని వివిధ ప్రాంతాలల్లోని రోడ్లు, కూడళ్లు, సిగ్నల్స్ తో పాటు మార్కెట్లు వంటి ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని నియమించారు. పోలీసులతో పాటు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు కూడా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.

ఎస్పీ ఆడిందే ఆట పాడిందే పాట

ఎస్పీ ఆడిందే ఆట పాడిందే పాట

పుదుచ్చేరీ ఐఆర్ బీఎన్ డివిజన్ ఎస్పీగా పని చేస్తున్న సుభాష్ కు తిరుబువానై, మడిగట్టితో పాటు పరిసర ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో లాక్ డౌన్ సందర్బంగా శాంతి భద్రతలు కాపాడాలని ప్రభుత్వం, పోలీసు శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ సుభాష్ లాక్ డౌన్ విధులు పక్కన పెట్టి అతను ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైయ్యింది.

కరోనా కామాంధుడు

కరోనా కామాంధుడు

లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తే ఎస్పీ సుభాష్ మాత్రం సాటి మహిళా పోలీసులపై కన్ను వేశాడు. కరోనా డ్యూటీని పక్కన పెట్టిన ఎస్పీ సుభాష్ సాటి మహిళా పోలీసు అధికారితో పాటు మహిళా కానిస్టేబుల్స్ ను లైంగిక వేధింపులకు గురి చేశాడు. పై అధికారి అని కొన్ని రోజుల పాటు ఏమీ చెయ్యలేక మహిళా పోలీసు అధికారితో పాటు మహిళా పోలీసులు ఇంతకాలం ఓపిక పట్టారు.

ఎస్పీ ఏం చేశాడంటే ?

ఎస్పీ ఏం చేశాడంటే ?

ఇన్ని రోజులు ఎస్పీ సుభాష్ ఆగడాలు చూసి ఓపిక నశించిపోయిన మహిళా పోలీసు అధికారితో పాటు కొందరు మహిళా పోలీసులు డీజీపీతో పాటు స్థానిక సబర్బన్ పోలీస్ స్టేషన్ లో అతని మీద ఫిర్యాదు చేశారు. ఎస్పీ సుభాష్ మీద పదేపదే ఆరోపణలు రావడంతో పై అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో ఎస్పీ సుభాష్ సాటి మహిళా పోలీసు అధికారినితో పాటు మహిళా పోలీసులను లైంగిక వేధింపులకు గురి చేశాడని వెలుగు చూసింది.

Recommended Video

RBI Governor Press Meet Highlights, RBI Cuts Reverse Repo Rate By 25 Bps to 3.75%
నిన్న చేతిలో లాఠీ, రివాల్వర్, నేడు అదే చేతులకు సంకెళ్లు

నిన్న చేతిలో లాఠీ, రివాల్వర్, నేడు అదే చేతులకు సంకెళ్లు

ఎస్పీ సుభాష్ మీద నాలుగు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిన్న చేతిలో లాఠీ, రివాల్వర్ పట్టుకుని హంగామా చేసిన ఎస్పీ సుభాష్ చేతులకు ఇప్పుడు పోలీసులు సంకెళ్లు వేశారు. కరోనా, లాక్ డౌన్ విధుల్లో ఉన్న మహిళా పోలీసులను లైంగిక వేధింపులకు గురి చేసిన ఎస్పీ సుభాష్ అరెస్టు కావడంతో పుదుచ్చేరీ పోలీసు శాఖలో కలకలంరేపింది.

English summary
Coronavirus Lockdown: Police SP Subash has been arrested in Puducherry after he teased some of the women constables.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X