బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Corona Lockdown: బెంగళూరులో మానవత్వం ఉందా, 7 కిలోమీటర్లు నడిచిన గర్భిణి, చివరికి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా దేశవ్యాప్తంగా ప్రజలు అనేక రకాలుగా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెంగళూరు నగరంలోని ఓ కార్మికుడి భార్య నిండు గర్భిణి. పురుటి నొప్పులతో భాదపడుతున్న భార్యకు కాన్ఫు చేయించడానికి ఎవ్వరూ సహాయం చెయ్యకపోవడం, కనీసం అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించడానికి ఐటీ బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటీ బెంగళూరు ఏకంగా 7 కిలోమీటర్లు తిరిగాడు. దేవుడు కనికరించడంతో చివరికి ఓ డెంటల్ ఆసుపత్రిలో ఆ నిండు గర్భిణికి దేవతలా ఓ వైద్యురాలు కాన్ఫు చెయ్యడంతో తల్లి, బిడ్డ క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు.

Recommended Video

COVID-19 Lockdown: Watch Pregnant Woman Walks For 7km, Delivers At Dental Clinic

Corna Lockdown: డ్రోన్లకు క్రికెట్ కామెంట్రీ, తుపాకి కాల్పులు, దెబ్బకు దౌడ్, వైరల్ వీడియో!Corna Lockdown: డ్రోన్లకు క్రికెట్ కామెంట్రీ, తుపాకి కాల్పులు, దెబ్బకు దౌడ్, వైరల్ వీడియో!

కార్మికులకు చాలిచాలని అన్నం

బెంగళూరు నగరంలో ఓ వ్యక్తి కార్మికుడిగా పని చేస్తున్నాడు. కార్మికుడి భార్య నిండు గర్భిణి. లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా ఆ కార్మికుడి కుటుంబం నెల రోజుల నుంచి వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే చిక్కుకుపోయారు. చాలిచాలని అన్నం తింటూ ఇన్ని రోజులు కార్మికుడు, ఆయన నిండు గర్భిణి అయిన భార్య ఇన్ని రోజులు కాలం గడిపారు.

 కార్మికుడిని కనికరించలేదు

కార్మికుడిని కనికరించలేదు

కార్మికుడి భార్య పురిటి నొప్పులతో భాదపడటంతో ఆమె భర్త చెలించిపోయాడు. నిరుపేద అయిన కార్మికుడు భార్యను ఆసుపత్రిలో చేర్పించాలని అనుకున్నాడు. అయితే కార్మికుడు కావడంతో లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా పని చెయ్యకపోవడంతో అతని దగ్గర ఇన్ని రోజులు దాచుకున్న సొమ్ము ఖాళీ అయ్యింది. కార్మికుడి కుటుంబాన్ని ఎవ్వరూకనికరించలేదు.

 7 కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణి

7 కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణి

పురిటి నొప్పులతో ఉన్న భార్యను ఆసుపత్రిలో చేర్పించడానికి ఆమె భర్తా అన్ని ప్రయత్నాలు చేశారు. నివాసం ఉంటున్న ప్రాంతం నుంచి భార్యను ఆసుపత్రిలో చేర్పించాలని నిండుగర్భిణి అయిన భార్యతో కలిసి అతను 7 కిలోమీటర్లు తిరిగాడు. ఎక్కడా ఒక్క ఆసుపత్రి తలుపులు తియ్యకపోవడంతో నిండుగర్భిణి తల్లిడిల్లిపోయింది. లాక్ డౌన్ సందర్బంగా రోడ్ల మీద బ్యారికేడ్లు వేసుకుని పోలీసు వాహనాల్లో సంచరిస్తున్న పోలీసులు సైతం దంపతులను పట్టించుకోలేదు.

దేవత ఎదురు పడింది

దేవత ఎదురు పడింది

చివరికి డెంటల్ ఆసుపత్రి ఒకటి తీసి ఉన్న విషయం గుర్తించిన భర్త వెళ్లి అక్కడ ఉన్న డెంటల్ డాక్టర్ రమ్యకు విషయం చెప్పాడు. నిండుగర్భిణి 7 కిలోమీటర్ల నడిచి వచ్చిందని తెలుసుకున్న డెంటల్ డాక్టర్ రమ్య కళ్లలో నీళ్లు కారిపోయాయి. వెంటనే డెంటల్ ఆసుపత్రిలో నిండు గర్భిణికి కాన్పు చెయ్యాలని డాక్టర్ రమ్యా నిర్ణయించుకున్నారు.

 బిడ్డ కదలకపోవడంతో !

బిడ్డ కదలకపోవడంతో !

నిండు గర్భిణి బిడ్డకు జన్మనిశ్చింది. అయితే పుట్టిన బిడ్డలో చలనం లేకపోవడం, గర్భిణికి రక్తస్తావం కావడంతో డాక్టర్ రమ్య ఆందోళన చెందారు. అయితే కొంత సేపటికి పుట్టిన బిడ్డలో చలనం రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే డాక్టర్ రమ్యా తెలిసిన వారి సహాయంతో తల్లి, బిడ్డను వేరే ఆసుపత్రికి పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా నిండుగర్భిణి పురిటి నొప్పులు చూసి ఓ ఆడదానిలా చూసి తట్టుకోలేక తప్పని పరిస్థితుల్లో కాన్ఫు చెయ్యవలసి వచ్చిందని, దేవుడ దయవలన తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని అన్నారు. మొత్తం మీద డెంటల్ డాక్టర్ రమ్యా ఓ తల్లి, బిడ్డ ప్రాణాలు కాపాడటంతో అందరూ ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు.

English summary
Coronavirus Lockdown: A pregnant woman delivered a baby at a dentist's clinic in Bengaluru where she had reached, along with her husband, after walking for around 7 km in hopes of reaching a hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X