వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: లాక్ డౌన్ హుష్ కాకి: గుడిలో ప్రసాదం పంపిణికి గ్రీన్ సిగ్నల్, ప్రధాని మోదీతో సీఎం ఢీ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ పంజాబ్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని కట్టడి చెయ్యడానికి దేశంలో లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఆలయాలు, మసీదులు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం అనేక నియమాలతో సోమవారం నుంచి అనుమతి ఇచ్చింది. అయితే ఏ ఆలయంలో, మసీదులో, చర్చిలో తీర్థాలు, ప్రసాదం పంపిణి చెయ్యకూడదని కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అమలులో ఉన్నా ఓ రాష్ట్ర ప్రభుత్వం ధార్మిక కేంద్రాల్లో ప్రసాదం పంపిణి చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రసాదం పంపిణి చేస్తే కరోనా వస్తుందా ? అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని పరోక్షంగా ప్రశ్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలను ఓ ప్రభుత్వం పెడచెవిన పెటుడుతోందని, ఇలా కరోనా వైరస్ వ్యాపించడానికి వీరు ఎందుకు సిద్దం అవుతున్నారో అర్థం కావడం లేదని కొందరు సీనియర్ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.

Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్తLockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త

 ప్రార్థనా మందిరాలకు నియమాలు

ప్రార్థనా మందిరాలకు నియమాలు

కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి ప్రతిఒక్కరు సహకరించాలని, ఆలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్లే భక్తులు భౌతిక దూరం పాటించాలని, గుడిలోని విగ్రహాలు, ఫోటోలు, పుస్తకాలు, గోడలు ముట్టుకోకూడదని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అంతేకాకుండా ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో తీర్థం, ప్రసాదం పంపిణి చెయ్యకూడదని, భజనలు చెయ్యడం, పాటలు పాడటం నిషేధం అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంమైన ఆదేశాలు జారీ చేసింది.

 ప్రసాదం పంపిణికి గ్రీన్ సిగ్నల్

ప్రసాదం పంపిణికి గ్రీన్ సిగ్నల్

ఆలయాల్లో ప్రసాదం పంపిణి చెయ్యడానికి పంజాబ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో ప్రసాదం తయారు చేసి భక్తులకు పంచిపెట్టుకోవచ్చని పంజాబ్ ప్రభుత్వం చెప్పింది. కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం సూచించిన ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వం పక్కనపెట్టింది.

 ప్రసాదం ఇలా చేస్తే సరిపోతుంది

ప్రసాదం ఇలా చేస్తే సరిపోతుంది

ఆలయాలు, ప్రార్థనా మందిరాల ప్రాంగణంలోనే ప్రసాదం చేసి భక్తులకు పంపిణి చెయ్యాలని పంజాబ్ ప్రభుత్వం సూచించింది. ప్రార్థనా మందిరాల్లో ప్రసాదం చేసే సమయంలో కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని, ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది.

 దేశానికి ఒక న్యాయం, మీకో న్యాయమా ?

దేశానికి ఒక న్యాయం, మీకో న్యాయమా ?

కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం దేశంలో తాండవం చేస్తోందని, దేశంలో ఐదుసార్లు ( Lockdown 5.0) లాక్ డౌన్ అమలు చేసినా ఆ వ్యాధి కట్టడి కాలేదని కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రద్దీగా ఉండే ప్రార్థనా మందిరాల్లో ప్రసాదం, తీర్థం పంపిణి చేస్తే పరిస్థితి చెయ్యిదాటి పోయే అవకాశం ఉందని, దేశం మొత్తం ఒక న్యాయం, మీకు మాత్రమే ఒక న్యాయమా అంటూ పంజాబ్ ప్రభుత్వాన్ని కొందరు బీజేపీ పెద్దలు ప్రశ్నిస్తున్నారు.

ఎవరి లెక్కలు వారివే !

ఎవరి లెక్కలు వారివే !

ప్రార్థనా మందిరాల్లో ప్రసాదం, తీర్థం తీసుకోవడానికి ప్రజలు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా చేరే అవకాశం ఉంటుందని, అలా చేస్తే కరోనా వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అయితే దేశంలో ప్రపంచ ప్రసిద్ది చెందిన ఆలయాల్లో భక్తులకు ప్రసాదం, తీర్థం ఇవ్వకూడదని ఆలయ కమిటీ నిర్వహకులు నిర్ణయించారు. అయితే ఏ లెక్కన పంజాబ్ ప్రభుత్వం ఆలయాల్లో భక్తులకు ప్రసాదం పంపిణి చెయ్యాలని ఆదేశాలు జారీ చేసిందో అర్థం కావడం లేదని ఆ రాష్ట్ర ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Coronavirus lockdown: Punjab Government allows serving of Langars and Prasad at Religious places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X