వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: ఫ్రెండ్ ను సూట్ కేస్ లో పెట్టి అపార్ట్ మెంట్ లోకి తీసుకెళ్లిన విద్యార్థి, ఎంజాయ్ కోసం ? !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మంగళూరు: కరోనా వైరస్ (COVID 19) కట్టడి చెయ్యడానికి భారతదేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, చివరికి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజలు వెళ్లకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో దేశంలోని పలు అపార్ట్ మెంట్స్ లో నివాసం ఉంటున్న వారు బయట వ్యక్తులను వారి అపార్ట్ మెంట్ లోకి రానివ్వడం లేదు.

మంగళూరులోని ఒక అపార్ట్ మెంట్ లో బయటి వ్యక్తులను లోపలికి రానివ్వకపోవడంతో ఓ కాలేజ్ విద్యార్థి తన ఫ్రెండ్ ను అపార్ట్ మెంట్ లోకి ఓ లగేట్ సూట్ కేస్ లో పెట్టి తీసుకెళ్లి ఎంజాయ్ చెయ్యాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కైనాడు. అతి పెద్ద సూట్ కేసులో ఫ్రెండ్ ను అపార్ట్ మెంట్ లోని తన ఫ్లాట్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నించిన యువకుడు, అతని ఫ్రెండ్ పోలీసులకు చిక్కిపోయారు.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

మంగళూరులో కరోనా భయం

మంగళూరులో కరోనా భయం

కర్ణాటకలోని మంగళూరు నగరంలో కరోనా వైరస్ ఎక్కడ వ్యాపిస్తుందో అనే భయంతో స్థానిక ప్రజలు మొదటి నుంచి ఆందోళన చెందుతున్నారు. విదేశాల నుంచి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న అనేక మంది కేరళకు వెళ్లారు. కేరళ నుంచి అనేక మంది మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అనేక ప్రాంతాలకు వెళ్లారు. ఇలా మంగళూరు మీదుగా అనేక ప్రాంతాలకు ప్రజలు వెళ్లి రావడంతో స్థానిక ప్రజలు మొదటి నుంచి కరోనా వైరస్ విషయంలో ఆందోళనగానే ఉన్నారు.

అపార్ట్ మెంట్ లో కాలేజ్ విద్యార్థి

అపార్ట్ మెంట్ లో కాలేజ్ విద్యార్థి

మంగళూరులోని కద్రి ప్రాంతంలో విలాసవంతమైన అపార్ట్ మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఓ అపార్ట్ మెంట్ లోని విలాసవంతమైన ఫ్లాట్ లో 17 ఏళ్ల కాలేజ్ విద్యార్థి నివాసం ఉంటున్నాడు. కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో ఆ విద్యార్థి అపార్ట్ మెంట్ లోనే నివాసం ఉంటున్నాడు.

అపార్ట్ మెంట్ సీల్ డౌన్

అపార్ట్ మెంట్ సీల్ డౌన్

కరోనా వైరస్ ఎక్కువ వ్యాపిస్తోందని లాక్ డౌన్ విధించారు. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు బయట వ్యక్తులను లోపలికి రానివ్వకుండా అపార్ట్ మెంట్ బయటి గేట్ కు తాళం వేసి సీల్ డౌన్ చేశారు. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు మాత్రమే బయటకు వెళ్లి రావాలని, బంధువులు, ఫ్రెండ్స్ ను ఎవ్వరైనా సరే అపార్ట్ మెంట్ లోకి పిలుచుకుని రాకూడదని అపార్ట్ మెంట్ కమిటీ సభ్యులు రూల్ పెట్టారు.

ఫ్రెండ్ కోసం ఆరాటం

ఫ్రెండ్ కోసం ఆరాటం

అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న బాలుడు తన ఫ్రెండ్ ను ఇక్కడికి పిలుచుకుని వస్తానని అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న కమిటీ సభ్యులకు చెప్పాడు. అయితే ఫ్రెండ్స్ ను అపార్ట్ మెంట్ లోపలికి పిలుచుకుని రాకూడదని, నువ్వు కొత్త వ్యక్తిని లోపలికి పిలుచుకుని వస్తే నీలాగా ఇక్కడ ఉన్న అందరూ వారివారి బంధువులు, స్నేహితులను పిలుచుకుని వస్తారని, తరువాత లేనిపోని సమస్యలు ఎదురౌతాయని కమిటీ సభ్యులు కాలేజ్ విద్యార్థికి చెప్పారు.

సూట్ కేస్ లో ఫ్రెండ్ ను పెట్టి లాక్ చేసి !

సూట్ కేస్ లో ఫ్రెండ్ ను పెట్టి లాక్ చేసి !

ఎలాగైనా స్నేహితుడిని తన ఫ్లాట్ లోకి పిలుచుకుని వెళ్లాలని నిర్ణయంచిన కాలేజ్ విద్యార్థి అతి తెలివి ఉపయోగించాడు. అపార్ట్ మెంట్ నుంచి బయటకు వెళ్లిన కాలేజ్ విద్యార్థి పెద్ద సూట్ కేస్ తీసుకుని అందులో ఫ్రెండ్ ను కుర్చోపెట్టి లాక్ చేసి అపార్ట్ మెంట్ లోకి తీసుకెళ్లాడు. అపార్ట్ మెంట్ మెయిన్ గేట్ తీసి సూట్ కేస్ లోపలికి లాక్కెలుతున్న సమయంలో అది అటూ ఇటూ కదిలింది. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారికి అనుమానం వచ్చి సూట్ కేస్ లో ఏముంది ? అని కాలేజ్ విద్యార్థిని ప్రశ్నించారు. సూట్ కేస్ ఓపెన్ చేసి చూపించి తరువాత నీ ఫ్లాట్ లోకి తీసుకెళ్లాలని అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు తేల్చి చెప్పారు.

అతి తెలివితో జైలుకు !

అతి తెలివితో జైలుకు !

సూట్ కేస్ ఓపెన్ చేసి చూడగా అందులో కాలేజ్ విద్యార్థి ఫ్రెండ్ ఉన్న విషయం బయట పడటంతో అక్కడ నివాసం ఉంటున్న వారు షాక్ కు గురై వెంటనే కద్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కాలేజ్ విద్యార్థి, అతని ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకున్నారు. కాలేజ్ విద్యార్థి, అతని ఫ్రెండ్ ఇద్దరూ మైనర్లు కావడంతో వారిని బాల నేరస్తుల న్యాయ మండలి ముందు హాజరుపరిచి విచారణ చేస్తున్నామని మంగళూరు సిటీ పోలీసు కమిషనర్ డాక్టర్ పీఎస్. హర్షా తెలిపారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి బయట తిరగడమే కాకుండా అపార్ట్ మెంట్ కమిటీ నియమాలు ఉల్లంఘించి ప్రవర్తించారని కాలేజ్ విద్యార్థి మీద అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు ఫిర్యాదు చేశారని కద్రి పోలీసులు అంటున్నారు.

English summary
Coronavirus Lockdown: In a curious incident at an apartment complex in the city on Sunday, a teenaged student was caught while trying to sneak in his friend to his apartment by stuffing him inside a suitcase In Mangaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X