వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Corona Lockdown: కోతులను చూసి నేర్చుకుందాం, కోతులకు మనకు అదే తేడా, కేంద్ర మంత్రి, వైరల్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ అరుణాచల్ ప్రదేశ్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచం మొత్తం అనేక ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశంతో పాటు అనేక దేశాలు లాక్ డౌన్ అమలు చేశాయి. సమదూరం పాటించాలని, కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే భారతదేశంలో లాక్ డౌన్ అమలులో ఉన్నా లెక్కచెయ్యకుండా రోడ్ల మీదకు పోలో అంటూ ప్రజలు వచ్చేస్తున్నారు.

ఈ సమయంలో కరోనా వస్తుందని, సమదూరం పాటించాలని ప్రభుత్వాలు చెప్పినా ఎవ్వరూ లెక్క చెయ్యడం లేదు. మీకు ఆహారం కావాలంటే నేను చెప్పినట్లు వినాలని ఓ వ్యక్తి చెప్పిన మాటలను కోతులు పాటించాయి. మనుషులు పాటించని నియమాలు కోతులు పాటిస్తున్నాయని, ఇకనైనా మనం బుధ్ది తెచ్చుకోవాలని స్వయంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఫోటోలు, వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చెయయడంతో వైరల్ అయ్యాయి.

lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!

హైవే రహదారిలో కోతుల గుంపు

హైవే రహదారిలో కోతుల గుంపు

అరుణాచల్ ప్రదేశ్- అసోం జాతీయ రహదారిలోని భాలుక్ పాంగ్ ప్రాంతంలో నిత్యం కోతులు విచ్చలవిడిగా సంచరిస్తుంటాయి. జాతీయ రహదారిలో ప్రయాణించే వారు ఇస్తున్న ఆహారం తింటున్న కోతులు కాలం గడుపుతున్నాయి. అటవి ప్రాంతంలో భాలుక్ పాంగ్ ప్రాంతం ఉంది.

ఆహారం కోసం వచ్చిన కోతులు

ఆహారం కోసం వచ్చిన కోతులు

కరోనా వైరస్ ను అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చేసిన సందర్బంగా అరుణాచల్ ప్రదేశ్- అసోం జాతీయ రహదారిలో వాహన సంచారం పూర్తిగా స్థంభించింది. నిత్యం జాతీయ రహదారుల్లో ప్రయాణించే వారు ఇస్తున్న ఆహారం తిని కాలం వెళ్లదీస్తున్న కోతులకు ప్రస్తుతం తిండి ఇచ్చే పుణ్యాత్ములు కరువయ్యారు. ఆహారం కోసం కోతులు హైవే రహదారిలో ఎదురు చూస్తున్నాయి.

ఆహారం కావాలంటే చెప్పినమాట వినాలి !

ఆహారం కావాలంటే చెప్పినమాట వినాలి !

అరుణాచల్ ప్రదేశ్- అసోం రహదారిలో ఉంటున్న కోతులకు ఓ వ్యక్తి కరుబూజ కాయలు, అరటి పండ్లు ఇస్తూ వాటి ఆకలి తీర్చుతున్నాడు. అయితే ఒక్కసారిగా ఆహారం చూసిన వెంటనే కోతులు గుంపులుగా వచ్చేశాయి. ఆ సమయంలో దూరం దూరంగా ఉంటేనే నేను కరుబూజ కాయలు, అరటి పండ్లు ఇస్తానని ఆ వ్యక్తి కోతులకు చెప్పాడు.

ఆహారం కోసం సమదూరం పాటించాయి

ఆహారం కోసం సమదూరం పాటించాయి

ఎక్కడ గుంపుగా వెళితే తమకు ఆహారం చిక్కదని గ్రహించిన కోతులు అరటి పండ్లు, కరబూజ కాయలు ఇస్తున్న వ్యక్తి చెప్పినట్లు సమదూరం పాటిస్తూ దూరం దూరంగా కుర్చున్నాయి. తరువాత ఆ వ్యక్తి ఇచ్చే అరటి పండ్లు, కరబూజ కాయలు తింటున్న సమయంలో అరుప్ కలిటా అనే వ్యక్తి ఫోటోలు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

మనుషులు, కోతులకు అదే తేడా: కేంద్ర మంత్రి

మనుషులు, కోతులకు అదే తేడా: కేంద్ర మంత్రి

కరోనా వైరస్ వ్యాధి రాకుండా ఉండాంటే లాక్ డౌన్ నియమాలు అనుసరించాలని, సమదూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతుంటే మనుషులు మాత్రం పట్టించుకోవడం లేదని, అనవసరంగా బయటకు వచ్చి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విచారం వ్యక్తం చేశారు. అయితే ఆహారం కావాలంటే చెప్పిన మాట వినాలని ఓ వ్యక్తి చెప్పిన మాటలకు కట్టుబడి ఆకలి తీర్చుకోవడానికి సమదూరం పాటిస్తూ కోతులు కుర్చున్నాయని, వాటికి ఉన్న బుధ్ది మనుషులకు ఎందుకు లేదని, ఎందుకు ప్రభుత్వాలు చెప్పిన మాట వినడం లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు.

Recommended Video

Coronavirus Update : India COVID-19 Cases Crossed 33,000 Mark
ఫోటోలు, వీడియోలు వైరల్

ఫోటోలు, వీడియోలు వైరల్

కోతులు ఆహారం కోసం సమదూరం పాటిస్తూ కుర్చున్న ఫోటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అవి వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు కొన్ని వేల మంది ఈ ఫోటోలను, వీడియోను చూసి షేర్ చేస్తూ లేక్ చేస్తున్నారు. కోతులను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

English summary
Coronavirus: Various authorities across the nation are repeatedly reminding people to stay indoors. They are also urging people to maintain proper social distancing in case they need to go out to buy essential items or for any other emergency. Sports Minister Kiren Rijiju took to Twitter to share such a reminder but using the picture of a group of monkeys – and the image has now left many inspired.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X