వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Corona Lockdown: నడిరోడ్డులో హారతి ఇచ్చి చేతిలో అరటి పండ్లు పెట్టినా బుధ్దిరాలేదు !

|
Google Oneindia TeluguNews

లక్నో/ కాన్పూర్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తున్న వారికి పోలీసులు ఏదో ఒక విధంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పలు చోట్ల పోలీసులు లాఠీలకు పని చెప్పారు. నడి రోడ్డులో గుంజీలు తీయించారు. వాహనాలు సీజ్ చేసి భారీ మొత్తంలో ఫైన్ వేస్తున్నారు. అయితే ప్రజలు వేళపాళ లేకుండా రోడ్ల మీద బైక్ లు, కార్లు వేసుకుని పోలో అని వచ్చేస్తున్నారు. చివరికి విసిగిపోయిన పోలీసులు అల్లరిమూకలకు హారతులు ఇస్తూ చేతిలో అరటిపండ్లు పెడుతున్నారు.

Recommended Video

Lockdown: Kanpur Police Perform 'Aarti' Of People who Are Roaming Out During Lockdown

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

కుక్కతోక వంకరా అనే సామెత !

కుక్కతోక వంకరా అనే సామెత !

కరోనా వైరస్ కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని, దయచేసి ప్రజలు ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి మీ ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని స్వయంగా ప్రధాని నరేంద్ర మోది పదేపదే ప్రజలకు మనవి చేస్తున్నారు. అయితే కుక్కతోక వంకర అనే సామెతకు సరిపోయే విధంగా కొందరు రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు.

తండ్రి చనిపోయినా సీఎం మాత్రం !

తండ్రి చనిపోయినా సీఎం మాత్రం !

ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకు 1, 412 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఉత్దరప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాధితో 21 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఉత్దరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ తండ్రి చనిపోయినా ఆయన మాత్రం అంత్యక్రియలకు హాజరుకాకుండా కరోనా వైరస్ కట్టడి చెయ్యడానికి పగలు, రాత్రి కష్టపడుతున్నారు.

విసిగిపోయిన పోలీసులు

విసిగిపోయిన పోలీసులు

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోని కిద్వాయి నగర్ లో లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తున్న కొందరు యువకులు ఉదయం నుంచి రాత్రి వరకు బైక్ ల్లో ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరుగుతున్నారు. పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కిద్వాయి నగర్ లోని కొందరు యువకులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో స్థానిక పోలీసులు వారికి చెప్పిచెప్పి విసిగిపోయారు.

కర్పూర హారతి, చేతిలో అరటి పండ్లు

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోని కిద్వాయి నగర్ లో యువకులు చెప్పిన మాట వినకపోవడంతో పోలీసులు లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తున్న వారిని వరుసగా నిలబెట్టి దేవుడికి హారతి ఇచ్చే పళ్లేంలో కర్ఫూరం వెలిగించి హారతులు ఇస్తున్నారు. అల్లరిమూకలకు హారతి ఇచ్చిన తరువాత గుడిలో ప్రసాదం ఇచ్చినట్లు అల్లరిమూకల చేతిలో అరటి పండ్లు పెడుతూ వారిలో కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకోసారి పళ్లెంలో హారతి ఇవ్వమని, అసలు సిలసైన హారతి ఇస్తామని కాన్పూర్ పోలీసులు యువకులను హెచ్చరిస్తున్నారు.

లక్షల వాహనాలు సీజ్ చేసినా !

లక్షల వాహనాలు సీజ్ చేసినా !

దేశం మొత్తం ఇలాగే పోలీసులు ఏదో ఒక విధంగా లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తున్న యువకులకు బుద్ది చెప్పి వారు ఇళ్ల నుంచి బయటకురాకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల వాహనాలు సీజ్ చేసినా ప్రజలు మాత్రం రోడ్ల మీదకు బైక్ లు, కార్లు వేసుకుని వచ్చేస్తున్నారని పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Coronavirus Lockdown: Police across the country have been punishing violators of the lockdown clamped to break the chain of coronavirus infections by making them do sit-ups and jumping jacks and asking them to carry placards with messages shaming them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X