బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

lockdown: ప్రతి ఆదివారం కరోనా కర్ఫ్యూ, ఆ రోజే ఎందుకంటే ? ప్రభుత్వానికి ఓ లెక్కుంది, సీఎం క్లారిటీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ 4.0 సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతితో పలు సూచనలతో అనేక రాష్ట్రాల్లో పలు వ్యాపారాలు, కార్యకలాపాలు మొదలుపెట్టారు. కేఎస్ఆర్ టీసీ బస్సులు తిప్పడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం అనేక కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రభుత్వం చెప్పే వరకు ప్రతి ఆదివారం కర్ప్యూ అమలులో ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐటీ, బీటీ దేశ రాజధాని బెంగళూరు నగరంతో సహ కర్ణాటక మొత్తం ప్రతి ఆదివారం కర్ఫ్యూ అమలులో ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రోజే కర్ఫ్యూ ఎందుకు అంటే మాకో లెక్కుంది అంటున్నారు కర్ణాటక సీఎం.

lockdown: లాక్ డౌన్ లో గుడిలో ప్రేమ పెళ్లి, అదే లాక్ డౌన్ లో ఆత్మహత్య, నెల రోజుల్లో ఏం జరిగింది ?lockdown: లాక్ డౌన్ లో గుడిలో ప్రేమ పెళ్లి, అదే లాక్ డౌన్ లో ఆత్మహత్య, నెల రోజుల్లో ఏం జరిగింది ?

మీ పని మీరు చేసుకోండి, అయితే ?

మీ పని మీరు చేసుకోండి, అయితే ?

లాక్ డౌన్ సందర్బంగా గత రెండు నెలల నుంచి ఇళ్లకే పరిమితం అయిన చాలా మంది ప్రైవేట్ కంపెనీలు, ఫ్యాక్టరీల ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు తదితర పనులు చేసుకునే వారు దాదాపుగా విసిగిపోయారు. ప్రైవేట్ కంపెనీలు, ఫ్యాక్టరీల ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు చేసే వారు కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం వారివారి కార్యకలాపాలు సాగించడానికి కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రతి ఆదివారం మాత్రం వారి కార్యకలాపాలకు ప్రభుత్వం బ్రేక్ వేసింది.

ఆదివారం జనతా కర్ఫ్యూ

ఆదివారం జనతా కర్ఫ్యూ

వారం రోజుల పాటు ఎవరి పనులు వారు చేసుకోవడానికి తాము అనుమతి ఇస్తున్నామని, అయితే ప్రతి ఆదివారం మాత్రం ప్రజలు అందరూ వారివారి ఇళ్లకే పరిమితం కావాలని, ఆ రోజు జనతా కర్ఫ్యూ అమలు చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. వారంలో ఒక్కరోజు ప్రజలను ఇళ్లకే పరిమతం చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం బీఎస్. యడియూరప్ప వివరించారు.

లిక్కర్ షాప్ లు బంద్

లిక్కర్ షాప్ లు బంద్

ప్రతి ఆదివారం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని, అనవసరంగా రోడ్ల మీద సంచరించకూడదని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సూచించారు. ప్రతి ఆదివారం ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అత్యవసర వస్తువులు మినహాయించి అన్ని వ్యాపారలావాదేవీలు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశామని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు. ఆదివారం వైన్ షాప్ లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఆదివారం కర్ఫ్యూ ఎందుకంటే ?

ఆదివారం కర్ఫ్యూ ఎందుకంటే ?

సోమవారం నుంచి శనివారం వరకు ఎవరి పనులు వారు చేసుకుంటారు, ఆదివారం దాదాపుగా అందరికి సెలవు కావడంతో ఆ రోజు ప్రజలు గుంపులు గుంపులుగా ఒక్కచోట చేరడం, రోడ్ల మీద మీటింగ్ లు పెట్టడం చేస్తుంటారని ప్రభుత్వం అంటోంది. అంతే కాకుండా ఆదివారం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతాలకు సంచరించే వాళ్లు ఎక్కువగా ఉంటారని అందుకే ఆరోజు జనతా కర్ఫ్యూ విధించామని ప్రభుత్వం చెబుతోంది.

Recommended Video

Gold Price Reduced Today, 10 grams Gold Now 47,980
మటన్, చికెన్, మందు కోసం రచ్చ !

మటన్, చికెన్, మందు కోసం రచ్చ !

మాంసాహార ప్రియులు చికెన్, మటన్, చేపల కోసం మార్కెట్ ల దగ్గర ఒక్కచోట గుమికూడే అవకాశం ఉందని అందుకే ఆదివారం జనతా కర్ఫ్యూ పెట్టామని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. మటన్, చికెన్ ఉంటే మందుబాబులు వైన్ షాప్ ల దగ్గరకు క్యూ కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు. ఆదివారం రోజు ఆర్ టీసీ బస్సులు సేవలు పూర్తిగా నిలిపివేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Coronavirus lockdown: Why Government Of Karnataka Declared Sunday As Like A Curfew Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X