చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనా వార్డులో లవర్స్, ఆసుపత్రిలో ఊగిపోతున్న పొదలు, మీ ఖర్మ మీరు చావండి !

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రేమ గుడ్డిది అని ఎవడ్రా చెప్పింది ? ప్రేమకు కళ్లు లక్షణంగా ఉన్నాయి. ప్రేమ ఎక్కడ పుడుతుందో చెప్పడం ఆ ఒక్క భగవంతుడికి మాత్రమే సాధ్యం అని మేధావులు ఎప్పుడో చెప్పారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (COVID 19) వ్యాధితో ప్రజలు హడలిపోతున్నారు. కరోనా వైరస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ జంట మాత్రం అధికారుల కళ్లు కప్పి ఆసుపత్రి ఆవరణంలో పొదల చెట్టలో జల్సాలు చెయ్యడం మొదలుపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రేమికులకు చెప్పిచెప్పి అలసిపోయిన అధికారులు, వైద్యులు ఇక మీ ఖర్మ మీరే అనుభవించండి, ఎక్కడైనా చావండి అంటూ వారిని వదిలేశారు.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

 కరోనాతో తమిళనాడు చిత్తడి

కరోనాతో తమిళనాడు చిత్తడి

భారతదేశంలో అత్యంత వేగంగా కరోనా వైరస్ కేసులు నమోదౌతున్న రాష్ట్రంగా తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తమిళనాడులో శుక్రవారం ఒక్కరోజు మాత్రమే 1, 982 కరోనా కేసులు నమోదైనాయని అధికారులు స్వయంగా చెప్పారు. తమిళనాడులో కరోనా వైరస్ కేసుల సంఖ్య 40, 698కి చేరింది. కరోనా వైరస్ వ్యాధితో తమిళనాడులో శుక్రవారం వరకు 367 మంది చనిపోయారు.

 చెన్నై పేరు చెబితో హడల్

చెన్నై పేరు చెబితో హడల్

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో శుక్రవారం వరకు కరోనా వైరస్ కేసులు 28, 924 నమోదైనాయి. శుక్రవారం మాత్రమే చెన్నై సిటీలో 1, 477 కరోనా కేసులు నమోదైనాయి. చెన్నైలో కరోనా వ్యాధితో పోరాటం చేసిన 1, 342 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు, చెన్నై సిటీలో కరోనా వైరస్ చికిత్స విఫలమై నేటి వరకు 18 మంది మరణించారు.

 ఆసుపత్రిలో ప్రేమజంట

ఆసుపత్రిలో ప్రేమజంట

చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ వ్యాధి వచ్చిన వారికి, ఆ వ్యాధి లక్షణాలు ఉన్న వారికి చికిత్స అందిస్తున్నారు. ఇలా ఓ యువతి, యువకుడు ప్రభుత్వ ఆసుపత్రిలోకి కరోనా వార్డులో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో ఉంటున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కరోనా వార్డులోనే ఇద్దరు కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు.

 ప్రేమ గుడ్డిది అని ఎవడ్రా చెప్పింది ?

ప్రేమ గుడ్డిది అని ఎవడ్రా చెప్పింది ?

కరోనా వైరస్ వార్డులో ఉంటున్న యువతి, యువకుడి వారివారి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ సోకిందనే భయం లేకుండా ఇద్దరు ప్రేమలో మునిగిపోయారు. ఆసుపత్రిలో దూరం దూరంగా ఉన్న బెడ్ లో ఉండకుండా ఇద్దరు కలిసి ఒకే బెడ్ మీద మీటింగ్ లు పెట్టడం మొదలుపెట్టారు. విషయం గుర్తించిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది మీరు ఇలా ఒకే చోట ఉండకూడదని, భౌతిక దూరం పాటించాలని ప్రేమ జంటకు చెబుతూ వచ్చారు.

 ఆసుపత్రి పొదల్లో సరసాలు

ఆసుపత్రి పొదల్లో సరసాలు

ఒకే బెడ్ మీద ఉన్న ప్రేమ జంటకు ఆసుపత్రి సిబ్బంది వార్నింగ్ ఇవ్వడంతో ప్రేమికులు కొత్తప్లాన్ వేశారు. ఆసుపత్రి ఆవరణంలోని చెట్ల పొదల్లోకి వెళ్లి అక్కడ సరసాలు మొదలుపెట్టారు. చికిత్స చెయ్యడానికి వెళ్లిన వైద్యులు చికిత్స పొందుతున్న యువతి, యువకుడు కనపడకపోవడంతో ఆందోళన చెందారు. ఆసుపత్రి ఆవరణంలో యువతి, యువకుడి కోసం అక్కడి సిబ్బంది గాలించారు.

 దెబ్బకు ఊగిపోతున్న పొదలు

దెబ్బకు ఊగిపోతున్న పొదలు

ప్రేమజంట ఆసుపత్రి ఆవరణంలోని పొదల్లో ఉన్న విషయం గుర్తించిన వైద్య సిబ్బంది వారిని కరోనా వార్డులోకి పిలుచుకుని వెళ్లి ఇక ముందు చెట్ల పొదల ఆపరిసర ప్రాంతాలకు వెళ్లకూడదని, బుద్దిగా చికిత్స పొంది కరోనా వ్యాధి నయం చేసుకోవాలని సూచించారు. అయితే పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రేమజంట పొదల్లోనే కాపురం పెట్టారు. కరోనా వైరస్ ను లెక్కచెయ్యకుండా ప్రేమజంట చేస్తున్న పనులు చూసి వారికి చెప్పిచెప్పి విసిగిపోయిన వైద్య సిబ్బంది మీ ఖర్మ మీరు అనుభవించడండి అంటూ వదిలేశారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు యువతి, యువకుడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో వారు కరోనా వార్డులో చికిత్స పొందుతున్నారని చెన్నై ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

English summary
Coronavirus: love couple romance in corona ward Chennai government hospital in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X