Coronavirus: ఐసోలేషన్ బెడ్ మీద నుంచి సీఎం క్యాబినేట్ మీటింగ్, బట్టలు ఉతుకుతున్న సీఎం !
భోపాల్/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన విధులు మాత్రం అక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ అని తెలిసినా ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో సీఎం రాజీపడరని ఆయన సహచర మంత్రులు అంటున్నారు. ఆసుపత్రిలోకి ఐసోలేషన్ వార్డులోని బెడ్ మీద నుంచి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్ సహావేశం నిర్వహించి వివిద ఆంశాలపై చర్చించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసుపత్రిలో తన బట్టలు తాను ఉతుకుంటున్నానని సీఎం చెప్పారు.
Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !
సీఎంకు కరోనా పాజిటివ్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆయన ఈనెల 25వ తేదీన భోపాల్ లోని చిరాయు ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చిరాయు ఆసుపత్రిలోని ప్రత్యేక వైద్యులు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా వ్యాధి నయం కావడానికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

వారం ముందే డేట్ ఫిక్స్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈనెల 28వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాబినేట్ సమావేశం నిర్వహించాలని గత వారంలోనే డిసైడ్ అయ్యారు. మందుగా అనుకున్న డేట్ ప్రకారం ఈనెల 28వ తేదీన కచ్చితంగా క్యాబినేట్ సమావేశం జరుగుతుందని మంత్రులు, అధికారులు బావించారు. అయితే మూడు రోజుల ముందే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో అసలు క్యాబినేట్ సమావేశం జరుగుతుందా ? లేదా ? అని మంత్రులు అయోమయానికి గురైనారు.

షార్ప్ 11 గంటలకు
మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో భోపాల్ లోని చిరాయు ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సాటి మంత్రులతో మాట్లాడారు. క్యాబినేట్ సమావేశం నిర్వహించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వివిద కీలక అంశాలపై మంత్రులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

మీరు ధైర్యంగా ఉండండి: సీఎం
కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన తనకు కరోనా వారియర్స్ మెరుగైన చికిత్స అందిస్తున్నారని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, మీరు ధైర్యంగా ఉండాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీ కార్యకర్తలకు, ఆయన అభిమానులకు మనవి చేశారు. కరోనా వైరస్ వచ్చిన వారు ధైర్యంగా ఆ మహమ్మారితో పోరాడాలాని, తాను అదే పని చేస్తున్నానని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

బట్టలు ఉతుకుతున్న సీఎం
కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత ఆసుపత్రిలో తాను నా బట్టలు నేను ఉతుక్కుంటున్నానని, తన చేతికి పనిచిక్కినందుకు సంతోషంగా ఉందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌన్ ఏఎన్ఐ మీడియాతో అన్నారు. మొత్తం మీద చిరాయు ఆసుపత్రిలోని ఐసోలేషన్ బెడ్ మీద ఉన్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినేట్ మీటింగ్ నిర్వహించి చరిత్ర సృష్టించారు.