వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CM effect: మంత్రికి, ఆయన భార్యకు పాజిటివ్, ఆరోజే చెప్పిన సీఎం, మంత్రులు క్యూ, దేవుడా నువ్వే!

|
Google Oneindia TeluguNews

భోపాల్/ న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఇప్పటికే కరోనా పాజిటివ్ రావడంతో భోపాల్ లోని చిరాయు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్ లో మరో మంత్రికి, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో సాటి మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఇప్పుడు హడలిపోయి వైద్యపరీక్షల కోసం క్యూ కడుతున్నారు. సీఎంకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన మూడు రోజుల మందు మంత్రులు, ఐఏఎస్. ఐపీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించడంతో ఇప్పు అందరి గుండెల్లో కరోనా రైళ్లు పరిగెత్తుతున్నాయి.

I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!

సీఎంకు కరోనా పాజిటివ్

సీఎంకు కరోనా పాజిటివ్

గత శనివారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆయన మొదట హోమ్ క్వారంటైన్ కు వెళ్లారు. తరువాత పార్టీ పెద్దలు, సన్నిహితులు, వైద్యుల సలహాలు, సూచనల మేరకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ లోని చిరాయు ఆసుపత్రిలో చేరి అక్కడి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

సీఎం ఎస్ఎస్ చౌహాన్ సలహా

సీఎం ఎస్ఎస్ చౌహాన్ సలహా

తనకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యిందని, ఇన్ని రోజులు తనతో పాటు కలిసి పని చేసిన సాటి మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులు, అందరూ కరోనా వైరస్ పరీక్షలు చేసుకోవాలని, టైమ్ బాగాలేక పాజిటివ్ అని వెలుగు చూస్తే ధైర్యంగా ఆ మహమ్మారి వ్యాధితో పోరాటం చెయ్యాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సాటి మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మనవి చేశారు.

మంత్రి, ఆయన భార్యకు పాజిటివ్

మంత్రి, ఆయన భార్యకు పాజిటివ్


మధ్యప్రదేశ్ సీనియర్ మంత్రి తులసి సిలావత్ ఆయన కుటుంబ సభ్యులు కరోనా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. మంత్రి తులసి, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్దారించారు. వెంటనే మంత్రి తులసి సిలావత్, ఆయన భర్య ఆసుపత్రిలో చేరి వైద్యపరీక్షలు చేయించుకుంటున్నారు. మంత్రి తులసి సిలావత్, ఆయన భార్యకు మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆయన కుటుంబ సభ్యుల్లో మరెవ్వరికి కరోనా లక్షణాలు లేవని అధికారులు చెప్పారు.

మంత్రి తులసి క్లారిటి

మంత్రి తులసి క్లారిటి

తనకు, తన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని, మేము ధైర్యంగా ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నామని, మేము త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్న ప్రతిఒక్కరికి ఈ సందర్బంగా ధన్యవాదాలు చెబుతున్నానని మంత్రి తులసి సిలావత్ అన్నారు. సీఎంతో పాటు మరో మంత్రికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో మధ్యప్రదేశ్ లోని మిగిలిన మంత్రులు, అధికారులు కరోనా వైద్యపరీక్షలు చేయించుకుని వైద్య నివేదికల కోసం టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.

English summary
Coronavirus: Madhya Pradesh Minister Tulsi Silawat and his wife have tested positive for the novel COVID -19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X