వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కరోనా పుట్టినిల్లు చైనా, మెట్టినిల్లు మహారాష్ట్ర, చైనాను ఓవర్ టేక్: మిషన్ బిగిన్ అగైన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ముంబై: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి పుట్టినిల్లు చైనా ప్రపంచాన్ని గడగడలాడించింది. కరోనా వైరస్ కు పురుడుపోసిన చైనా ఆ వ్యాధి నుంచి అక్కడి ప్రజలను రక్షించుకుంటోందని పైకి చెబుతోంది. అయితే భారతదేశంలోని ఓ రాష్ట్రం చైనాలో నమోదైన కేసులను దాటిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాను మన దేశంలోని మహారాష్ట్ర కరోనా కేసుల్లో ఓవర్ టేక్ చేసింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ రోజురోజుకు తాండవం చేస్తుండటంతో మరాఠీలతో పాటు దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో నమోదైన కేసులంకంటే మహారాష్ట్రలో ప్రస్తుతం సుమారు 2, 900కు పైగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో నమోదైన కరోనా కేసుల్లో 57 % ఒక్క ముంబై నగరంలోనే ఉన్నాయి. ఇదే సమయంలో మిషన్ బిగిన్ అగైన్ పేరుతో పెద్ద ఎత్తున లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన మహారాష్ట్రపై ప్రజలు మండిపడుతున్నారు.

Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్తLockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త

 దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎన్ని ?

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎన్ని ?

భారతదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. భారతదేశంలో సోమవారం ఉదయం వరకు 2, 66, 598 కరోనా కేసులు నమోదైనాయి. ఇంకా 9, 987 కేసుల పరీక్షలు జరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ తో 1, 29, 917 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ తో పోరాటం చేసి 1, 29, 215 మంది కొలుకుని ఇళ్లకు వెళ్లారు. కరోనా వైరస్ వ్యాధితో దేశంలో ఇప్పటి వరకు 7, 466 మంది చనిపోయారని అధికారులు అంటున్నారు.

 కరోనా పుట్టినిల్లు చైనా

కరోనా పుట్టినిల్లు చైనా

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనా మొదటి స్థానంలోంది. కరోనా వైరస్ పుట్టింది చైనాలోనే. చైనాలో పుట్టిన కరోనా వైరస్ నేడు ప్రపంచం అంతా వ్యాపించి అన్ని దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఈ దేశంలో కరోనా ఉంది, ఈ దేశంలో కరోనా లేదు అని చెప్పడానికి సాధ్యం కావడం లేదు. చైనా ప్రభుత్వం నిర్లక్షం వలనే నేడు కరోనా వైరస్ ప్రపంచం అంతా తాండం చేస్తోందని అమెరికా, భారత్, రష్యాతో పాటు అనేక ప్రముఖ దేశాలు విమర్శలు చేస్తున్నాయి.

 భారతదేశంలో కరోనా శివతాండవం

భారతదేశంలో కరోనా శివతాండవం

భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మార్చి 25వ తేదీ నుంచి దేశంలో ఐదుసార్లు లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలు చేసి కరోనా వైరస్ కేసులు తగ్గించడానికి ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రతిరోజు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రప్రభుత్వాలు షాక్ కు గురైనారు.

 కరోనా మెట్టినిల్లు మహారాష్ట్ర

కరోనా మెట్టినిల్లు మహారాష్ట్ర

కరోనా పుట్టినిల్లు చైనా అయితే ఆ వ్యాధి మెట్టినిల్లు మహారాష్ట్రగా నిలిచింది. చైనాలోని కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను మహారాష్ట్ర దాటిపోయింది. చైనాలో సోమవారం వరకు 83, 040 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే ఒక్క మహారాష్ట్ర రాష్ట్రంలో సోమవారం వారం వరకు 85, 975 నమోదైనాయి. ఒక్కరోజులో చైనా కరోనా కేసులతో మహారాష్ట్ర పోటీ పడింది.

 చైనా- మహారాష్ట్ర కరోనా వార్

చైనా- మహారాష్ట్ర కరోనా వార్

చెన్నైలో కరోనా వైరస్ వ్యాధితో అక్కడి ప్రభుత్వం లెక్కల ప్రకారం 4, 634 మంది మరణించారు. మహారాష్ట్రలో కరోనా వ్యాధితో ఇప్పటి వరకు 3, 060 మంది చనిపోయారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ ఆక్టివ్ కేసుల సంఖ్య 39, 314 ఉంటే చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కేవలం 65 ఉంది. చైనాతో మహారాష్ట్ర కరోనా కేసుల విషయంలో పోటీ పడుతోంది.

Recommended Video

Delhi CM Arvind Kejriwal Unwell, To Undergo Covid-19 Test
 మిషన్ బిగిన్ అగైన్ అవసరమా ?

మిషన్ బిగిన్ అగైన్ అవసరమా ?

సోమవారం ఒక్క రోజే మహారాష్ట్రలో 3, 007 మందికి కరోనా వైరస్ సోకింది. ఇదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి మిషన్ బిగిన్ అగైన్ పేరుతో లాక్ డౌన్ నియమాలను పెద్ద ఎత్తున సడలించడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదురౌతున్నాయి. దేశంలో కరోనా వైరస్ కు హాట్ స్పాట్ గా నిలిచిన మహారాష్ట్రలో కరోనా వైరస్ ను అరికట్టడానికి అక్కడి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పని చేస్తున్నా ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే ఉండటంతో ఆ రాష్ట్ర ప్రజలు హడలిపోతున్నారు.

English summary
Coronavirus: 2553 fresh cases of COVID19 & 109 deaths recorded in Maharashtra today, taking total number of cases to 88,528.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X