వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: అక్కకు కరోనా పాజిటివ్, చెట్టెక్కిన చెల్లి పెళ్లి, ఎంకి పెళ్లి సబ్బు చావుకు వచ్చింది !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హావేరి: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తోంది. దేశంలో ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చినట్లు అక్క దెబ్బకు చెల్లి పెళ్లి చెట్టెక్కింది. అందరూ పెళ్లి పీటల మీద కుర్చున్న వధూవరులను ఆశీర్వదించడానికి సిద్దం అయిన సమయంలో పెళ్లి కూతురు అక్కకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. అంతే పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెతో పాటు వధూవరుల కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు. హ్యాపీగి పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేద్దాం అనుకున్న పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ప్రస్తుతం క్వారంటైన్ లో కాలం గడుపుతున్నారు.

Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !

 హావేరి హడల్

హావేరి హడల్

కర్ణాటకలో ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు హడలిపోతున్నారు. ఒక్కసారిగా కర్ణాటకలో రెండింతలు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవంతో బీఎస్. యడియూరప్ప ప్రభుత్వంతో పాటు ప్రజలు హడలిపోయారు. హావేరి జిల్లాలోని రాణేబెన్నూరులో 3, హీరేకరూరులో 6, సవణూరులో 3 కరోనా పాజిటివ్ కేసులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఒక్కరోజులో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

 పెళ్లిసందడి

పెళ్లిసందడి

హావేరి పట్టణంలోని నాగేంద్రనమట్టి ప్రాంతంలోని ఓ యువతితో హావేరి పట్టణానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయం అయ్యింది. కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో లాక్ డౌన్ 5.0 నియమాలను పాటించి పెళ్లి జరుపుకోవడానికి హావేరి జిల్లా అధికారులు వధూవరుల కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. అధికారుల అనుమతితో యువతి, యువకుడి ఇంట్లో పెళ్లిసందడి మొదలైయ్యింది.

 పెళ్లి కూతురు అక్కకు కరోనా

పెళ్లి కూతురు అక్కకు కరోనా

వధూవరులతో పాటు పెళ్లికి హాజరైన వారు వైద్యుల దగ్గర వైద్య పరీక్ష్లలు చేయించుకున్నారు. వైద్య నివేదికలు వచ్చిన తరువాత సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన అధికారులు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని వధూవరుల కుటుంబ సభ్యులకు చెప్పారు. పెళ్లి జరిగే అర్దగంట ముందు అధికారులు చెప్పిన డైలాగ్ తో వధూవరులు బిత్తరపోయారు. పెళ్లి కుమార్తె అక్కకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిందని అధికారులు చావు కబురు చల్లాగా చెప్పారు.

 క్వారంటైన్ లో కాలక్షేపం

క్వారంటైన్ లో కాలక్షేపం

పెళ్లి కుమార్తె అక్కకు కరోనా వైరస్ పాజిటివ్ అనే విషయం తెలుసుకున్న హావేరి జిల్లాధికారులు వెంటనే పెళ్లి జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడితో పాటు వారి కుటుంబ సభ్యులు 20 మందిని హావేరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని క్వారంటైన్ కు తరలించారు. అర్దగంటలో పెళ్లి చేసుకుని ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చెయ్యాల్సిన వధూవరులు ఇప్పుడు క్వారంటైన్ లో కాలక్షేపం చేస్తున్నారు.

 జరగరానిది ఏదైనా జరిగితే ?

జరగరానిది ఏదైనా జరిగితే ?

వైద్య శాఖ అధికారులు కొంచెం నిర్లక్షం చేసి ఉంటే పెళ్లి కుమార్తె అక్క దెబ్బకు నవవధూవురులతో పాటు పెళ్లికి హాజరైన అందరికీ కరోనా వైరస్ వ్యాపించి ఉండేదని, తరువాత ఏదైనా జరగరానిది జరిగితే అందరూ భాదపడాల్సి ఉండేదని అధికారులు అంటున్నారు. పెళ్లి జరుగుతున్న వేధికలో పారిశుద్ద కార్మికులు, వైద్య సిబ్బంది పూర్తిగా శానిటైజ్ చేసి ఆ ప్రాంతాన్ని సీల్ డౌన్ చేశారని అధికారులు తెలిపారు.

English summary
Coronavirus: marriages cancel due to coronavirus in Haveri in Karnataka.12 people have been infected with the coronavirus in Haveri district on Sunday. Now people in the district are worried by the coronavirus shock.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X