వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కరోనా దెబ్బ, నర్సు అవతారం ఎత్తిన ముంబై మేయర్, ప్రియాంక ఎంట్రీ, ఏమంటారు ?

|
Google Oneindia TeluguNews

ముంబై: భారతదేశాన్ని కరోనా వైరస్ ( COVID 19) మహమ్మారి పట్టిపీడిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ తాండవం చేస్తోంది. భారతదేశంలో ఇప్పటి రకు 29, 435 మందికి కరోనా వైరస్ సోకింది. దేశం మొత్తం మీద 934 మంది కరోనా వ్యాధితో మరణించారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 8, 068 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 342 మంది మరణించారు. దేశంలో ఎక్కువ కరోనా వైరస్ వ్యాధి పాజిటివ్ కేసులు, మరణాలు ఒక్క మహారాష్ట్రలోనే అధికం అయ్యాయి. ముంబైలో కరోనా వైరస్ వ్యాధి కేసులు అరికట్టడానికి ఆ నగరం మేయర్ ఇప్పుడు నర్సు అవతారం ఎత్తారు. వృత్తిరీత్యా ముంబై మేయర్ కిషోరీ ఫడ్నేకర్ నర్సు. ఇప్పుడు ముంబై ప్రజలకు సహాయం చెయ్యడానికి మేయర్ కిషోరీ ఫడ్నేకర్ మరోసారి నర్సు యూనీఫాం వేసుకున్నారు.

Corona Lockdown: లాక్ డౌన్ డిమాండ్, కనపడితే కరోనాను అమ్మేస్తారు, రెఢీనా ? నాసామిరంగ !Corona Lockdown: లాక్ డౌన్ డిమాండ్, కనపడితే కరోనాను అమ్మేస్తారు, రెఢీనా ? నాసామిరంగ !

 రాజకీయాల్లోకి రాకముందు !

రాజకీయాల్లోకి రాకముందు !

ముంబై మేయర్ కిషోరీ పడ్నేకర్ రాజకీయాల్లోకి రాకముందు నర్సుగా పని చేసేవారు. నర్సుగా మంచి పేరు తెచ్చుకున్న కిషోరీ పడ్నేకర్ తరువాత శివసేన పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరారు. తరువాత ముంబైలో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో శివసేన పార్టీ నుంచి పోటీ చేసిన కిషోరీ పడ్నేకర్ కార్పోరేటర్ అయ్యారు.

 వివాదాలకు పడ్నేకర్ !

వివాదాలకు పడ్నేకర్ !

వరుసగా కిషోరీ పడ్నేకర్ కార్పోరేటర్ గా విజయం సాధిస్తూనే వచ్చారు. గత ఏడాది ముంబై మేయర్ ఎన్నికల్లో శివసేన కార్పోరేటర్ కిషోరీ పడ్నేకర్ ఎలాంటి పోటీ లేకుండా మేయర్ గా ఎన్నిక అయ్యారు. ఎప్పుడు వివాదాల్లో చిక్కుకోకుండా కిషోరీ పడ్నేకర్ జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. వివాదాలకు దూరంగా ఉండే కిషోరీ పడ్నేకర్ కు అదే ఫ్లస్ పాయింట్ కావడంతో మేయర్ కుర్చీ వెతుక్కుంటూ వచ్చిందని శివసేన పార్టీ నాయకులు అంటున్నారు.

కరోనా విషయంలో సీఎం ఠాక్రే కలలు !

కరోనా విషయంలో సీఎం ఠాక్రే కలలు !

మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాధి తాండవం చేస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకి కరోనా వైరస్ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో పాటు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సైతం కరోనా వైరస్ కట్టడిలో పూర్తిగా విఫలం అయ్యారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు ముంబై మేయర్ కిషోరీ పడ్నేకర్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

 నర్సు అవతారంలో మేయర్

నర్సు అవతారంలో మేయర్

ప్రతిపక్షాలు రోజురోజుకు ఎక్కువగా విమర్శలు చెయ్యడం, ముంబైలో కరోనా కట్టడి కాకపోవడంతో మేయర్ కిషోరీ పడ్నేకర్ కలతచెందారని తెలిసింది. సాటి నర్సుల్లో ధైర్యం నింపి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించిన మేయర్ కిషోరీ పడ్నేకర్ నర్సు యూనీఫాం వేసుకుని ఇప్పుడు విధులకు హాజరౌతున్నారు.

 ప్రియాంక ఎంట్రీ

ప్రియాంక ఎంట్రీ

ముంబై మేయర్ కిషోరీ పడ్నేకర్ నర్సు యూనీఫాం వేసుకుని సిటీలోని నాయర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో తీసిన ఫోటోను శివసేన నాయకురాలు ప్రియాంక చుతుర్వేది ట్విట్టర్లో షేర్ చేశారు. గౌరవనీయులైన మేయర్ కిషోరీ పడ్నేకర్ సాటి నర్సుల్లో ధైర్యం నింపడానికి మరోసారి నర్సు అవతారం ఎత్తారని, ఆమెకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నామని ప్రియాంక చుతుర్వేది ట్విట్ చేశారు. ప్రతిరోజు మేయర్ కిషోరీ పడ్నేకర్ ఉదయం 8 గంటల నుంచి అర్దరాత్రి 2 గంటల వరకు పని చేస్తున్నారని, ఆమె గురించి ఇంత వరకు తేలిగ్గా మాట్లాడిన వారు ఇప్పుడు ఆమెను చూసి గుణపాఠాలు నేర్చుకోవాలని శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ట్విట్ చేశారు.

Recommended Video

Lockdown In AP will Be Eased in Green Zones Across The State

English summary
Coronavirus: Brihan Mumbai Mumncipal Corporation Mayor Kishor Pednekar has decided to return to her old calling nurse to contribute in the fight against Coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X