చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: భారత్ ను నిలువునా ముంచేసిన ‘పాంచ్’సిటీలు ఇవే, కరోనా కాటుతో విలవిల !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ ముంబై/ చెన్నై: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) కేసులు 3 లక్షలు దాటిపోయాయి. శుక్రవారం ఒక్కరోజు భారత్ లో 11 వేలకు పైగా కరోనా కేసులు నమోదైనాయి. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య చూస్తుంటే ప్రజలు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్, రష్యా తరువాత భారత్ నిలిచింది. దేశంలో మహారాష్ట్రలో మాత్రమే లక్ష కరోనా కేసులు నమోదైనాయి. దేశంలోని ఐదు మహానగరాలు ( పాంచ్ సిటీలు) కరోనా కేసుల విషయంలో భారత్ కొంపను నిలువునా ముంచేశాయి.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

మహారాష్ట్రలో ముంబై నెంబర్ వన్

మహారాష్ట్రలో ముంబై నెంబర్ వన్

దేశంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదైయ్యింది ఒక్క మహారాష్ట్రలోనే. మహారాష్ట్రలో 1, 01, 141 కరోనా కేసులు నమోదైనాయి. మహారాష్ట్రలో అర్దం కేసులు ఒక్క ముంబై నగరంలోనే నమోదైనాయి. అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం ముంబై నగరంలో మాత్రమే 55, 451 కరోనా కేసులు నమోదైనాయి. భారతదేశం పాలిట ముంబై కరోనా వైరస్ వ్యాపింపజేసిన మొదటి నగరంగా గుర్తింపు తెచ్చుకుందని అధికారులు అంటున్నారు.

పూణే- థానే ఏం తక్కువ లేదు

పూణే- థానే ఏం తక్కువ లేదు

మహారాష్ట్రలోని ముంబై నగరం మాత్రమే కాదు, ఆ రాష్ట్రంలోని పూణే- థానే నగరాలు కరోనా వైరస్ కేసుల్లో ముందు వరుసలోనే ఉన్నాయి. థానేలో 16, 443 కరోనా కేసులు, పూణేలో నేటి వరకు 11, 281 కరోనా కేసులు నమోదైనాయి. దేశంలో ఒక్క మహారాష్ట్రలోనే మూడు కరోనా హాట్ స్పాట్ నగరాలుగా ముంబై, పూణే-థానే నగరాలు నిలిచాయి.

దక్షిణ భారత్ లో చెన్నై సిటీ

దక్షిణ భారత్ లో చెన్నై సిటీ

దక్షిణ భారతదేశంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రంగా తమిళనాడు నెంబర్ వన్ గా నిలిచింది. తమిళనాడులో 40 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదైనాయి. ఇక చెన్నై సిటీలో మాత్రమే 28, 924 కరోనా కేసులు నమోదైనాయి. శుక్రవారం మాత్రమే చెన్నై సిటీలో 1, 477 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదైన మూడో నగరంగా చెన్నై సిటీ నిలిచింది.

అహమ్మదాబాద్ డెంజర్ జోన్

అహమ్మదాబాద్ డెంజర్ జోన్


ముంబై, చెన్నై తరువాత భారత్ ను ఎక్కువగా హడలెత్తించిన సిటీగా అహమ్మదాబాద్ నగరం నిలిచింది. గుజరాత్ లో ఇప్పటి వరకు అధికారుల లెక్కల ప్రకారం 22, 527 కరోనా కేసులు నమోదైనాయి. ఇక అహమ్మదాబాద్ లో మాత్రమే 15, 962 కరోనా కేసులు నమోదైనాయి. గుజరాత్ లో ఇప్పటి వరకు 1, 416 మంది కరోనా వైరస్ వ్యాధితో మరణించారు. గుజరాత్ లో మరణించిన వారిలో 1, 139 మంది అహమ్మదాబాద్ కు చెందిన వారే కావడం విశేషం.

దేశ రాజధాని ఢిల్లీ సరేసరి

దేశ రాజధాని ఢిల్లీ సరేసరి

దేశంలో కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం అయిన ఐదో నగరంగా దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది. చూడటానికి ఢిల్లీ చిన్నది అయినా కరోనా వైరస్ వ్యాపించడంలో ఏ మాత్రం తక్కువ లేదని నిరూపించింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ సభ్యుల దెబ్బతో ఢిల్లీలో కరోనా వైరస్ తాండవం చేసింది. ఢిల్లీలో ఇప్పటి వరకు 36, 824 కరోనా వైరస్ కేసులు నమోదైనాయి. ఢిల్లీలో ఇప్పటి వరకు 1, 214 మంది కరోనా వైరస్ కాటుతో మరణించారు.

English summary
Coronavirus: Mumbai, Pune, Ahmedabad, Chennai, Delhi are among the cities with high Covid-19 cases in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X