వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: భారత్ లో 23 లక్షల మంది క్వారంటైన్ లో, నెంబర్ 1,2, ఆంధ్రా, తెలంగాణ ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ముంబై/ అహమ్మదాబాద్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు భారతదేశం విలవిలలాడుతోంది. కరోనా వైరస్ దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ ను నాలుగు సార్లు పొడగించారు. దేశంలోని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి చేరుకున్న వారు, విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు సొంత ప్రాంతాల్లో నివాసం ఉంటూ కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 23 లక్షల మంది క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారని స్వయంగా కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్న వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల నుంచి భారత్ వస్తున్న వారి సంఖ్య, ఒక రాష్ట్రాం నుంచి మరో రాష్ట్రానికి వెలుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ప్రయాణాలతో ఇంకా ఎంత మంది క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సి వస్తుందో ? అనే విషయం అంతు చిక్కడం లేదు.

Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?

 కరోనా లాక్ డౌన్ దెబ్బ

కరోనా లాక్ డౌన్ దెబ్బ

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు మార్చి 25వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ అమలు చేశారు. అప్పటి నుంచి దేశంలో లాక్ డౌన్ అమలులో ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్ డౌన్ నియమాలు అమలులో ఉన్నాయి. లాక్ డౌన్ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది.

 విదేశాలు, అంతరాష్ట్రాలు

విదేశాలు, అంతరాష్ట్రాలు

లాక్ డౌన్ 4.0 సడలింపుల్లో భాగంగా విదేశాల్లో ఉంటున్న భారతీయులతో పాటు పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బయలుదేరి వెలుతున్నారు. ఇప్పుడు అనేక ప్రాంతాల ప్రజలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెలుతున్నారు. ఇలా అంతరాష్ట్రాల ప్రజలు వారివారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

 దేశంలో 90 లక్షలు, విదేశాల నుంచి 30 వేల మంది

దేశంలో 90 లక్షలు, విదేశాల నుంచి 30 వేల మంది

వివిద రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, కూలీలు 91 లక్షల మంది వారివారి స్వస్థలాలకు చేరుకున్నారు. ప్రపంచంలోని 40 దేశాల నుంచి వందే భారత్ మిషన్ లో భాగంగా ఇప్పటి వరకు 30,000 వేల మంది భారత్ చేరుకున్నారు. విదేశాలతో పాటు దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మొత్తం 91, 3000 మంది ప్రయాణించారు.

 క్వారంటైన్ లో 23 లక్షల మంది

క్వారంటైన్ లో 23 లక్షల మంది

విదేశాల నుంచి వచ్చిన వారు, దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లిన వలస కూలీలు, కార్మికులు, ఉద్యోగుల్లో ఇప్పటి వరకు 22. 81 లక్షల మంది క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశాల నుంచి, వివిద ప్రాంతాల నుంచి ప్రయాణం చేసిన వారు కచ్చితంగా కనీసం 7 రోజులు క్వారంటైన్ లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం నియమాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఇప్పటి వరకు 22. 81 లక్షల మంది క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Recommended Video

AP Special Status Issue Reiterate Again After Long Time
 ఆంధ్రా, తెలంగాణ సేఫ్ !

ఆంధ్రా, తెలంగాణ సేఫ్ !

దేశంలో మొత్తం 22. 81 లక్షల మంది క్వారంటైన్ లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో అధిక సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదైన మహారాష్ట్రలో 6. 2 లక్షల మంది క్వారంటైన్ లో ఉన్నారు. గుజరాత్ లో 4. 42 లక్షల మంది క్వారంటైన్ లో ఉన్నారు. మొత్తం మీద కరోనా దెబ్బతో భారతదేశంలో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో దాదాపు 23 లక్షల మంది ఉన్నారు. మిగిలిన వారిని హోమ్ క్వారంటైన్ లో ఉండటానికి అధికారులు అవకాశం కల్పించారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సేఫ్ జోన్ లోనే ఉన్నాయి.

English summary
Coronavirus: Nearly 23 lakh people, who have moved within the country or arrived from international destinations during the ongoing nationwide lockdown due to the COVID-19 pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X