వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాదికి పెను ముప్పు-వేగంగా విస్తరిస్తున్న N440K వైరస్‌- సీసీఎంబీ హెచ్చరికలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ బారి నుంచి ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటోంది. అయినా అక్కడక్కడా విదేశాల నుంచి దిగుమతి అయిన కొత్త కరోనా వైరస్‌ రకాలు దాడి చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు వీటిపై ఏ మేరకు పనిచేస్తాయో ఇంకా తేలడం లేదు. అంతలోనే సీసీఎంబీ తాజాగా నిర్వహించిన జన్యు పరిశోధనలో దక్షిణాదికి మరో ముప్పు పొంచి ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ రకాన్ని అడ్డుకునే విషయంలో ప్రభుత్వాలు అప్రమతం కాకపోతే పెనుముప్పు తప్పదని సీసీఎంబీ హెచ్చరికలు జారీ చేస్తోంది.

Recommended Video

Covid-19 Variant N440K Spreading More In Southern States || Oneindia Telugu

 భారత్‌లో కోటి మందికి పైగా కరోనా వ్యాక్సిన్‌- ఇంకా లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు భారత్‌లో కోటి మందికి పైగా కరోనా వ్యాక్సిన్‌- ఇంకా లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు

 కరోనా కొత్త వైరస్‌ల దాడి

కరోనా కొత్త వైరస్‌ల దాడి


కరోనా వైరస్‌గా పేర్కొంటున్న సార్స్‌ సీవోవీ2 వైరస్‌ ముప్పు తొలగిపోయినట్లు ప్రస్తుతం కేంద్రం భావిస్తున్నా ఇప్పటికే దీనిపై జరుగుతున్న జన్యు పరిశోధనలు, కొత్త వైరస్‌ రకాల వ్యాప్తి, ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన జాతీయ పరిశోధనా సంస్ధ సీసీఎంబీ నిర్వహించిన తాజా జన్యు పరిశోధనలో ఈ విషయాలు బయటపడ్డాయి. సార్స్‌ సీవోవీ2 వైరస్‌ కొత్త వైరస్‌ రకాలు దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా వ్యాపిస్తున్నట్లు సీసీఎంబీ గుర్తించింది.

దక్షిణాదిలో వేగంగా ఎన్‌ 440కే వైరస్ వ్యాప్తి

దక్షిణాదిలో వేగంగా ఎన్‌ 440కే వైరస్ వ్యాప్తి


సార్స్‌ సీవోవీ2 వైరస్‌ కొత్త రకం ఎన్‌ 440కే వైరస్‌ ప్రస్తుతం దక్షిణాదిలోని పలు రాష్టాల్లో వేగంగా విస్తరిస్తున్నట్లు సీసీఎంబీ తాజా పరిశోధనలో తేలింది. తాజాగా తెలంగాణ, కేరళ, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాల్లో బయటపడిన కేసుల నుంచి సేకరించిన శాంపిల్స్‌పై నిర్వహించిన పరిశోధన ఆధారంగా సీసీఎంబీ తాజా ఫలితాలు ప్రకటించింది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు ఈ వైరస్‌ కొత్త రకం ఎన్‌440కే ముప్పు తీవ్రంగా ఉందని గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వాలను, ఆరోగ్యశాఖలను అప్రమత్తం చేస్తోంది. ఈ కొత్త రకం వైరస్‌పై నిఘా పెట్టి, నిశితంగా పరిశీలించకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదని సీసీఎంబీ చెబుతోంది.

కేరళ, మహారాష్ట్రలో కల్లోలం వెనుక కారణమిదే

కేరళ, మహారాష్ట్రలో కల్లోలం వెనుక కారణమిదే

తాజాగా మహారాష్ట్రతో పాటు కేరళలో భారీ ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. అక్కడ నమోదవుతున్న కేసుల వెనుక ప్రధాన కారణం ఎన్‌440కే వైరస్‌ అని స్ధానిక పరిశోధకులు తేల్చినట్లు సీసీఎంబీ తెలిపింది. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో బయటపడిన కేసుల వెనుక ప్రధాన కారణం ఎన్‌440కే వైరస్సే అని సీసీఎంబీ పేర్కొంది. ఇప్పుడు మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో ఈ వైరస్‌ ప్రభావం కనిపిస్తోందని తెలిపింది. కేరళలోనూ దాదాపు ఇదే పరిస్ధితి ఉందని వెల్లడించింది. కొంతకాలం క్రితం ఏపీ, తెలంగాణలోనూ ఈ వైరస్ జాడ కనిపించిందని సీసీఎంబీ వెల్లడించింది.

5000 వైరస్‌ రకాలపై సీసీఎంబీ పరిశోధన

5000 వైరస్‌ రకాలపై సీసీఎంబీ పరిశోధన


భారత్‌లో కరోనా వైరస్ కాలంలో బయటపడిన 5 వేల వైరస్ రకాలపై సీసీఎంబీ నిశితంగా పరిశోధన నిర్వహించింది. ఆయా సందర్భాల్లో సేకరించిన 6400 జన్యువులపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు సమగ్ర పరిశోధన చేశారు. ఇందులో వేగంగా విస్తరిస్తున్న వైరస్‌గా ఎన్‌440కేను గుర్తించారు. అదీ మహారాష్ట్రతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఇవి వేగంగా విస్తరిస్తున్నట్లు గుర్తించారు. వీటిపై పరిశోధన తర్వాత వైరస్‌లకు వ్యాక్సిన్ల కంటే కోవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండటమే మేలని సీసీఎంబీ పరిశోధనా పత్రం తెలిపింది. తద్వారా వైరస్‌ ముప్పుకు జాగ్రత్తగా ఉండటమే పరిష్కారమని చెప్పకనే చెప్పింది.

English summary
An exhaustive genomic study of the SARS-CoV-2 virus by Hyderabad-based Centre for Cellular and Molecular Biology (CCMB) has indicated that the virus variant N440K is spreading a lot more in South India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X