వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mehandi సందడి: పెళ్లి కూతురితో సహ ఫ్యామిలీ మొత్తం కరోనా పాజిటివ్, పెళ్లి కొడుకు పరుగో పరుగు, పాపం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ఉడిపి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా శుభకార్యాలయాలు, వివాహాలకు కేవలం 50 మంది లోపు మాత్రమే హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో పెళ్లి కుమార్తె మెహందీ కార్యక్రమానికి సుమారు 80 మందికిపైగా హాజరై నానా రచ్చ చేశారు. పెళ్లి కూడా జరిగిపోయింది. ఇదే సమయంలో పెళ్లి కుమార్తెతో సహ ఆమె ఫ్యామిలీలో ఏకంగా 7 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో పెళ్లి ఇంట దడపుట్టింది. పెళ్లి చేసుకున్నాను అనే ఆనందం పెళ్లి కుమారుడి ముఖంలో మాయం కావడంతో పరుగో పరుగు అన్నాడు.

Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది !Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది !

పవిత్ర పుణ్యక్షేత్రం

పవిత్ర పుణ్యక్షేత్రం

కర్ణాటకలోని ఉడిపిలో పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీక్రిష్ణుడి ఆలయం ఉంది. కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో ఉడిపి జిల్లాలో పెద్దగా కరోనా పాజిటివ్ కేసులు లేవు. అయితే లాక్ డౌన్ సడలింపుల తరువాత ఉడిపి జిల్లాలో ప్రతిరోజు 50 నుంచి 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు.

పెళ్లి కూతురి ఇంట్లో మెహందీ ఫంక్షన్

పెళ్లి కూతురి ఇంట్లో మెహందీ ఫంక్షన్

ఉడిపి జిల్లా కాపు తాలుకా మల్లారిలోని కొంబగుడ్డ ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతికి, శివమొగ్గ జిల్లా హోసనగరకు చెందిన యువకుడి పెళ్లి నిశ్చయం అయ్యింది. పెళ్లి కుమార్తె ఇంటిలో రెండు వారాల క్రితం గ్రాండ్ గా మెహందీ కార్యక్రమం నిర్వహించారు. పెళ్లి కుమార్తె తరపున చాలా మంది బంధువులు, కుటుంబ సభ్యులు మెహందీ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.

పెళ్లి కుమార్తె దెబ్బ

పెళ్లి కుమార్తె దెబ్బ

మెహందీ కార్యక్రమం పూర్తి అయిన తరువాత పెళ్లి కుమార్తెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు చాలా హుషారుగా ఉన్నారు. యువతి, యువకుడి పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో జరిగిపోయింది. పెళ్లి కుమార్తె అనారోగ్యానికి గురి కావడంతో వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జులై 6వ తేదీన పెళ్లి కుమార్తెకు కరోనా పాజిటివ్ అని వైద్యులు దృవీకరించారు.

పెళ్లి కుమార్తె ఫ్యామిలీలో 7 మందికి పాజిటివ్

పెళ్లి కుమార్తె ఫ్యామిలీలో 7 మందికి పాజిటివ్

పెళ్లి కుమార్తెకు కరోనా పాజిటివ్ రావడంతో మెహందీ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ వైద్యపరీక్షలు నిర్వహించారు. ముగ్గురు పిల్లలు ముగ్గురు మహిళలతో పాటు మొత్తం 7 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. పెళ్లి కుమార్తె, ఆమె కుటుంబంలోని 7 మందిని కోవిడ్ 19 ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Recommended Video

Bubonic Plague : అమెరికాలో ఉడుతకు Bubonic Plague పాజిటివ్‌! || Oneindia Telugu
కొంప ముంచిన మెహందీ సందడి

కొంప ముంచిన మెహందీ సందడి

పెళ్లి కుమార్తెకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో మెహందీ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన వారి గుండెళ్లో ఇప్పుడు కరోనా రైళ్లు పరిగెడుతున్నాయి. మెహందీ కార్యక్రమంలో సుమారు 80 మందికిపైగా పాల్గొన్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. పెళ్లి కుమార్తె మెహందీ కార్యక్రమంలో పాల్గొన్న వారిని అధికారులు గుర్తించి వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు.పెళ్లి కుమార్తెకు కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే పెళ్లి కుమారుడి ముఖంలో ఆనందం మాయం అయ్యి పరుగో పరుగు అంటున్నాడు.

English summary
Coronavirus: Newly married bride familys 7 members tests positive for COVID-19. Coronavirus is increasing day by day in Udupi district. Around fifty to sixty cases are being detected, which is a cause for concern for the people of the district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X