వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: లాక్ డౌన్ పెళ్లి, పాజిటివ్, శోభనం కథ కంచికి, క్వారంటైన్ లో కాలక్షేపం, ఫ్యామిలీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ తుమకూరు: కరోనా వైరస్ (COVID 19) పుణ్యమా అంటూ రంగరంగ వైభవంగా జరిగే పెళ్లిళ్లలకు బ్రేక్ పడింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా 50 మందిలోపు కేంద్ర ప్రభుత్వ నియమాలు పాటించి పెళ్లి జరుపుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని ఎన్నో కలలు కనిన నవ దంపతులకు క్వారంటైన్ స్వాగతం లభించింది. పెళ్లికి అదిరిపోయే వంటలు చేయించుకున్న పెళ్లి ఇంట కరోనా కలకలం రేపింది. వంట చేసిన వంట మనిషికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో బెడ్ రూంలో ఎంజాయ్ చెయ్యాల్సిన నవ దంపతుల శోభనం కథ కంచికిపోయి క్వారంటైన్ లో కాలక్షేపం చేస్తున్నారు. కరోనా దెబ్బకు నవదంపతులు ఇప్పుడు కుయ్యో మర్రో అంటూ క్వారంటైన్ లో ఉన్నారు. పెళ్లికి వెళ్లిన 56 మంది ప్రస్తుతం క్వారంటైన్ లో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !

లాక్ డౌన్ 5.0 సడలింపులు

లాక్ డౌన్ 5.0 సడలింపులు

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతితో కేవలం 50 మంది కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వివాహాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆలయాలు, వధూవరుల ఇళ్లల్లో సింపుల్ గా పెళ్లి తంతు ముగిస్తున్నారు.

 హ్యాపీగా పెళ్లి జరిగిపోయింది

హ్యాపీగా పెళ్లి జరిగిపోయింది

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని గుబ్బి సమీపంలోని హోరూరు గ్రామంలో నివాసం ఉంటున్న గిరీష్, తుమకూరు జిల్లాలోనే నివాసం ఉంటున్న మీనాక్షిల వివాహం నిశ్చయం అయ్యింది. లాక్ డౌన్ సందర్బంగా పెళ్లి కుమారుడు గిరీష్ ఇంట్లోనే పెళ్లి చెయ్యాలని పెద్దలు నిశ్చయించారు. ఈనెల 18వ తేదీన గిరీష్, మీనాక్షిల వివాహం సింపుల్ గా జరిగింది.

 పెళ్లి వంటలు అదిపోవాలి

పెళ్లి వంటలు అదిపోవాలి

గరీష్, మీనాక్షి పెళ్లి సందర్బంగా వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువు, ముఖ్యమైన స్నేహితులు హాజరైనారు. పెళ్లికి వచ్చిన వారికి అదిరిపోయే వంటలు చేయించడానికి ప్రత్యేకంగా వంట మనుషులు వెళ్లారు. గిరీష్, మీనాక్షి పెళ్లికి వెళ్లిన వారు భోజనాలు చేసిన తరువాత వంటలు సూపర్ గా ఉన్నాయి, అదిరిపోయాయి అంటూ కితాబు ఇచ్చారు.

చావు కబురు చల్లాగా వచ్చింది

చావు కబురు చల్లాగా వచ్చింది


గిరీష్, మీనాక్షి పెళ్లి రోజు వారి కుటుంబ సభ్యులకు వంట చెయ్యడానికి వెళ్లిన 50 ఏళ్ల వంట మనిషి అనారోగ్యానికి గురైనాడు. ఆ రోజు నుంచి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న వంట మనిషి తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో బెంగళూరులోని జయదేవ ఆసుపత్రిలో చేర్పించారు. వంట మనిషికి కరోనా పాజిటివ్ వచ్చిందని నవదంపతుల కుటుంబ సభ్యులకు చావు కబురు చల్లాగా అందింది.

శోభనం కథ కంచికి, క్వారంటైన్ లో కాలక్షేపం

శోభనం కథ కంచికి, క్వారంటైన్ లో కాలక్షేపం


విషయం తెలుసుకున్న అధికారులు పెళ్లి కొడుకు గిరీష్, పెళ్లి కుమార్తె మీనాక్షితో పాటు ఆ పెళ్లికి హాజరైన 56 మందిని వెతికి పట్టుకుని క్వారంటైన్ కు తరలించారు. పెళ్లి చేసుకుని హ్యాపీగా శోభనం చేసుకోవాలని కలలు కనిన నవ దంపతులు ఇప్పుడు క్వారంటైన్ లో మాకు ఎక్కడ కరోనా వస్తుందో ? అనే భయంతో హడలిపోతున్నారు. మొత్తం మీద అదిరిపోయే వంటలు చేయించుకున్న పెళ్లి ఇంటి వారు ప్రస్తుతం క్వారంటైన్ లో కాలక్షేపం చేస్తున్నారు.

English summary
Coronavirus: Newly married couple quarantined in Karnataka, after cooking chef tests positive for Coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X