• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

coronavirus: కిలో బియ్యం రూ.3, గోధుమలు రూ.2, నిత్యావసర వస్తువుల కొరత లేదు: ప్రకాశ్ జవదేకర్

|

దేశంలో నిత్యావసర కొరత లేదని, ప్రజల్లో లేని భయాందోళన సృష్టించొద్దని కేంద్రం ప్రభుత్వం స్పష్టంచేసింది. మంగళవారం రాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా 3 వారాల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌‌డౌన్ తర్వాత పరిస్థితులపై కేంద్ర మంత్రివర్గం చర్చించింది. ప్రధానంగా నిత్యావసర వస్తువులపై డిస్కష్ చేసింది. క్యాబినెట్ మీట్ తర్వాత కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

భయపడొద్దు..

భయపడొద్దు..

లాక్‌డౌన్ విధించినందన ప్రజలు భయాందోళనకు గురవద్దని ప్రకాశ్ జవదేకర్ సూచించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వివరించారు. ప్రజలు మాత్రం ఇంట్లోనే ఉండి.. తరచూ సబ్బుతో చేతులు కడుక్కొవాలని సూచించారు. కరోనా వైరస్‌కు సంబంధించి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని కోరారు. 21 రోజుల లాక్‌డౌన్‌తో మీకు కుటుంబంతో కలిసి గడిపే వెసులుబాటు కలిగిందని జవదేకర్ గుర్తుచేశారు. కానీ భయాందోళనకు గురికావొద్దని.. నిత్యావసర వస్తువుల కొరత లేనే లేదని స్పష్టంచేశారు.

పేదలకు అండ

పేదలకు అండ

ఈ ఆపత్కాలంలో పేదలకు పక్షాన నిలుస్తామని జవదేకర్ పేర్కొన్నారు. బియ్యం కేజీ రూ.3 గోధుమలు కేజీ రూ.2కు అందజేస్తామమని పేర్కొన్నారు. దేశంలో రేషన్ కార్డు ఉన్న వారు 80 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో ధర తగ్గిస్తున్నామని.. అవసరమైతే ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. మూడు నెలల వరకు సరుకులపై రాయితీ కొనసాగుతుందని జవదేకర్ స్పష్టంచేశారు.

    Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
    హెల్ప్ లైన్ నంబర్...

    హెల్ప్ లైన్ నంబర్...

    కాంట్రాక్టు కార్మికలకు వేతనాలు సకాలంలో అందజేస్తారని తేల్చిచెప్పారు. దీంతోపాటు ప్రాంతీయ బ్యాంకులను రీ క్యాపిటలైజేషన్ ప్రకటించామని పేర్కొన్నారు. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మరో హెల్ప్ లైన్ నంబర్ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలో ఈ హెల్ప్ లైన్ నంబర్ ఉంటుందని తెలిపారు.

    English summary
    Union Minister Prakash Javadekar said people bpl across the country will be given wheat at Rs 2 and rice at Rs 3 per kilogram at concessional rates for the next three months.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
    X