వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్: 'భారత్‌లో అందరికీ కోవిడ్‌ వ్యాక్సీన్‌ అవసరం లేదు' - ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఫైజర్ అమెరికాలో తన వ్యాక్సీన్ అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేసింది

ఇండియాలో అందరికీ కోవిడ్‌ టీకా ఇవ్వాల్సిన అవసరంలేదని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ అభిప్రాయపడినట్లు ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది.

వ్యాక్సీన్‌ ఇవ్వడం వెనక ఉద్దేశం వ్యాధి వ్యాప్తి చైన్‌ను తెంచడమేనని ఆయన పేర్కొన్నట్లు ఈ కథనం తెలిపింది. టీకా పని చేసే సామర్ధ్యం ఒక్కొక్కరిలో ఒక్కోరకంగా ఉంటోందని, ముందు వైరస్‌ వ్యాప్తిని అరికడితే అందరికీ టీకా ఇచ్చే అవసరం ఉండదని భార్గవ వ్యాఖ్యానించినట్లు పేర్కొంది.

సీరం సంస్థ నిర్వహిస్తున్న కోవిడ్‌ వ్యాక్సీన్‌ ట్రయల్స్‌లో కొందరు వలంటీర్లు అనారోగ్యానికి గురికావడంపై స్పందించిన భార్గవ, ఇది ట్రయల్స్‌కు ఏమాత్రం ఆటంకం కలిగించదని, ప్రతి ఒక్కరిపై అది చూపిస్తున్న ప్రభావాలను నిష్పాక్షికంగా అంచనా వేస్తున్నామని తెలిపారు.

మరోవైపు దేశంలో అందరికీ టీకా ఇస్తామని ప్రభుత్వం కూడా ఎప్పుడూ చెప్పలేదని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు. టీకా ప్రభావాలను పూర్తిగా అంచనా వేసి అది సురక్షితమని తేలితేనే డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ అనుమతిస్తారని పేర్కొన్నారు.

సాంబార్ డీర్ (ఫైల్ ఫొటో)

నీళ్లు తాగడానికి వస్తే గొడ్డళ్లతో నరికారు

ఎన్ని చట్టాలున్నా వన్యప్రాణులపై దారుణమైన దాడులు జరుగుతున్నయనడానికి నిదర్శనంగా నిలుస్తోంది మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘటన. చెరువులో నీళ్లు తాగడానికి వచ్చిన సాంబార్‌ జింకపై కొందరు యువకులు గొడ్డళ్లతో దాడి చేసి కాళ్లు నరికారని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలో ఓ గిరిజన తండాలో ఈ సంఘటన జరిగింది. చెరువులో నీళ్లు తాగడానికి వచ్చిన ఓ సాంబార్‌ డీర్‌ అక్కడున్న కొందరు యువకులు అరుపులకు భయపడి పొలాల్లోకి పరుగులు పెట్టింది. పొలంలో బురదగా ఉండటంతో దిగబడిపోయిన జింకపై ఆ యువకులు గొడ్డళ్లతో దాడి చేశారని సాక్షి కథనం పేర్కొంది.

యువకుల దాడికి దాని కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. భయంతో జింక పెద్దగా అరవడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. దీంతో దాడి చేసిన వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.

తీవ్ర గాయాలపాలైన జింకను అటవీశాఖ అధికారులు హన్మకొండలోని వన విజ్జాన కేంద్రానికి తరలించింది చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Not everyone in India needs a covid vaccine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X