వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: భారత్ నెత్తిన పిడుగు.. భారీగా ఎన్నారైల ఇంటిబాట.. ఒక్క యూఏఈ నుంచే లక్షల్లో..

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ ఎత్తివేతకు సన్నాహాలు చేసుకుంటోన్న భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బయటి దేశాల్లో పనిచేస్తూ, అక్కణ్నుంచి పంపే డబ్బుతో దేశ ఎకనామీలో కీలకంగా వ్యవహరించే ప్రవాస భారతీయులు ఒకేసారి భారీగా స్వదేశం బాటపట్టారు. ఇప్పటికే దేశం నలుమూలల్లో పనిచేస్తోన్న వలస కూలీలు సొంత ఇళ్లకు వెళ్లిపోవడంతో లాక్ డౌన్ తర్వాత ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు వేలకొద్దీ ఎన్నారైలు ఇంటిబాటపట్టడం రాబోయే గడ్డుకాలానికి సూచనలా కనిపిస్తోంది.

వెబ్ సైట్ క్రాష్..

వెబ్ సైట్ క్రాష్..


యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సహా ఏడు గల్ఫ్ దేశాలనూ కరోనా వైరస్ చుట్టుముట్టడంతో అక్కడ కూడా వ్యవస్థలు తలకిందులయ్యాయి. లాక్ డౌన్ కారణంగా అక్కడి భారతీయ కులీలు, అనుకోకుండా చిక్కుకుపోయినవాళ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. వలస కూలీలను వెనక్కు తీసుకెళ్లండంటూ ఆయా దేశాలకు యూఏఈ ప్రభుత్వం సందేశాలు పంపింది. దీంతో మూడు వారాల గ్యాప్ తర్వాత బుధవారం రాత్రి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పున:ప్రారంభమైంది. ఆన్ లైన్ లో పేర్ల నమోదు కోసం ఎన్నారైలు ఒక్కసారే ఎగబడటంతో వైబ్ సైట్ క్రాష్ అయింది. దీంతో కొంతసేపు గందగోళ పరిస్థితి ఏర్పడింది.

తొలిరోజు 32వేలు..

తొలిరోజు 32వేలు..


బుధవారం రాత్రి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించగా, గురువారం సాయంత్రానికి, అంటే 24 గంటల లోపే, అనూహ్యంగా 32వేల రిజిస్ట్రేషన్లు వచ్చాయని అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. ‘‘ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో వెబ్ సైట్ లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోంది. సంఖ్య లక్షలు దాటే అవకాశముంది. డేటాను అనలైజ్ చేసి తిరుగుప్రయాణాల తేదీలను ఖారు చేస్తాం. ముందుగా అత్యవసర మెడికల్ కేసులు, గర్భిణులు, మహిళలు, చిన్నపిల్లలు బయలుదేరేందుకు అవకాశం కల్పిస్తామని కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా(దుబాయ్) విపుల్ మీడియాకు చెప్పారు. ప్రయాణాలు ప్రారంభమయ్యేనాటికి రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.

ఒక్క కేరళకే 3.5 లక్షల మంది..

ఒక్క కేరళకే 3.5 లక్షల మంది..

ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ ప్రభావం వలస, ప్రవాస జీవులపై ఎంత దుర్భరంగా ఉందో తెలియజెప్పడానికి కేరళ ఉదాహరణ సరిపోతుంది. 201 దేశాల్లో వివిధ రంగాల్లో పనులు చేసుకుంటోన్న మలయాళీలు.. లాక్ డౌన్ కారణంగా ఇంటిబాట పట్టారు. కేరళ ప్రభుత్వం నిర్వహిస్తోన్న నాన్ రెసిడెంట్ కేరళైట్స్ అఫైర్స్(నోక్రా) శాఖ లెక్కల ప్రకారం ఇప్పటికే 3లక్షల 53వేల 468 మంది మలయాళీలు సొంతఇళ్లకు వచ్చేందుకు పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్లలో అత్యధికంగా యూఏఈ నుంచే 1లక్ష 53వేల 660 మంది ఉండటం గమనార్హం. కాగా, నోక్రాలో పేర్లు నమోదు చేసుకున్న కేరళైట్స్ అందరూ తిరిగి కాన్సులేట్ జనరల్ వెబ్ సైట్(https://cgidubai.gov.in/covid_register/) లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దౌత్య అధికారులు సూచించారు.

500 విమానాలు.. 3 యుద్ధనౌకలు..

500 విమానాలు.. 3 యుద్ధనౌకలు..

గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు తిరిగొచ్చేందుకు నమోదైన రిజిస్ట్రేషన్లలో అధిక శాతం యూఏఈ నుంచే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. అక్కడివాళ్లను సేఫ్ గా ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నాహకాలు చేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన 500 విమానాలను, ఇండియన్ నేవీకి చెందిన మూడు యుద్ధ విమానాలను సిద్ధం చేసి ఉంచింది. రిజిస్ట్రేషన్ల డేటాను అనలైజ్ చేసిన వెంటనే ప్రయాణాలు ప్రారంభం అవుతాయి. ఇప్పటికి గల్ఫ్ రిటర్నీల సంఖ్యే భారీగా ఉందనుకుంటే, రేపు అమెరికా, యూరప్ దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయి భారత్ కు తిరిగొచ్చేవాళ్ల సంఖ్యను తల్చుకుంటే ఒళ్లు జలదరించకమానదు. కరోనా సృష్టించిన విలయతాండవం ఎంత ప్రమారకమైందో రాబోయే రోజుల్లో తెలుస్తుందని నిపుణులు అంటున్నారు.

English summary
More than 32,000 Indians in the UAE, who wish to return home amidst the coronavirus lockdown, have registered with the Indian missions in Abu Dhabi on day one of the opening of the online registration process, according to a media report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X