వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus:రక్కసితో నెలన్నర చిన్నారి బలి, వైరస్‌తో మృత్యువాత.. శ్వాసకోస వ్యాధితో..

|
Google Oneindia TeluguNews

కరోనా రక్కసితో నెలన్నర చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున చిన్నారి మృతి కలచివేసింది. చిన్నారికి శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది రావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే తర్వాత కరోనా పాజిటివ్ రావడంతో వార్డులోకి తరలించి చికిత్స అందించారు. కానీ ఫలితం లేకపోయింది.

లేడీ హర్డింగే మెడికల్ కాలేజీ అనుబంధ శరణ్ చిన్నపిల్లల ఆస్పత్రికి కొద్దిరోజుల క్రితం నెలన్నర చిన్నారిని తీసుకొచ్చారు. శ్వాస సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడటంతో వైద్యులు చికిత్స అందజేశారు. అతనితోపాటు 10 నెలల చిన్నారిని కూడా తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. నెలన్నర చిన్నారికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రత్యేక వార్డుకు తరలించామని వైద్యులు తెలిపారు. ఆ చిన్నారి పరిస్థితి విషమించి.. శనివారం చనిపోయాడు.

coronavirus:One-And-A-Half Month Old Baby Dead At Delhi Hospital

వైరస్‌తో నెలన్నర బాలుడు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఢిల్లీలో వైరస్ బారినపడి చిన్నారి చనిపోయిన తొలి కేసు ఇదే కావడం విశేషం. ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2003కి చేరింది. ఆదివారం ఒక్కరోజే 110 కేసులు నమోదు కాగా.. ఇద్దరు చనిపోయారు. ఇప్పటివరకు 45 మంది చనిపోయారు. ఇందులో 60 ఏళ్లకు పైబడిన వారు 25 మంది.. 56 శాతంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 50 నుంచి 59 ఏళ్లలోపు పది, 50 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారు 10 శాతం అని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.

Recommended Video

Coronavirus : Swiggy Delivery Boy In Hyderabad Tests Positive For Covid-19

English summary
one-and-a-half-month-old baby has died of coronavirus infection at a hospital in Delhi, making him the country's youngest victim of the deadly disease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X