బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

lockdown: కరోనా దెబ్బకు సిలికాన్ సిటీకి సినిమా, మళ్లీ లాక్ డౌన్ పై సీఎం పక్కా క్లారిటీ, ఒక్కమాటలో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు కర్ణాటక విలవిలలాడుతోంది. ఐటీ బీటీ సంస్థల దేశరాజధాని సిలికాన్ సిటీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 31, 777కు పెరిగిపోవడంతో ప్రజలు హడలిపోయారు. ఈనెల 14వ తేదీ నుంచి 22వ తేదీ బుధవారం ఉదయం వరకు బెంగళూరు సిటీలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది. మళ్లీ లాక్ డౌన్ పొడగిస్తారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప, బెంగళూరు సిటీకి చెందిన సీనియర్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించి లాక్ డౌన్ విస్తరించే విషయంలో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు.

Recommended Video

COVID-19 : Corona నుంచి కోలుకున్న వాళ్లకు Karnataka ప్రభుత్వం బంపర్ ఆఫర్..! || Oneindia Telugu

Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !

బెంగళూరుకు సినిమా చూపించిన కరోనా

బెంగళూరుకు సినిమా చూపించిన కరోనా

బెంగళూరు సిటీలో ఎవ్వరూ ఊహించని విదంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. బెంగళూరు సిటీలో కన్నడిగులతో పాటు ప్రవాసాంధ్రులు, తమిళ సోదరులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన లక్షలాధి మంది నివాసం ఉంటున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ దెబ్బకు కొన్ని లక్షల మంది సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇదే సమయంలో కరోనా వైరస్ బెంగళూరులో తాండవం చెయ్యడంతో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి.

ఆదివారం కరోనాకు హాలీడే కాదు

ఆదివారం కరోనాకు హాలీడే కాదు

బెంగళూరులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ఈనెల 14వ తేదీ నుంచి సిలికాన్ సిటీలో లాక్ డౌన్ అమలులో ఉంది. లాక్ డౌన్ అమలులో ఉన్నా ఆదివారం మాత్రమే బెంగళూరు సిటీలో 2, 156 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. లాక్ డౌన్ ఉన్నా, లేకపోయినా బెంగళూరు సిటీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్డడం లేదని అధికారులు గుర్తించారు.

ఏం చేద్దాం మీరే చెప్పండి: సీఎం మీటింగ్

ఏం చేద్దాం మీరే చెప్పండి: సీఎం మీటింగ్

బెంగళూరులో విధించిన లాక్ డౌన్ ఈనెల 22వ తేదీ బుధవారం ఉదయంతో ముగుస్తుంది. బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ పొడగిస్తారని కన్నడ మీడియాలో జోరుగానే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, బెంగళూరు సిటీకి చెందిన సీనియర్ మంత్రులు, బీబీఎంపీ మేయర్, బీబీఎంపీ కొత్త కమిషనర్ ఎన్. మంజునాథ్, ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ పొడగించాలా ? వద్దా ? మీరే చెప్పండి అని అందరి అభిప్రాయాలను సీఎం బీఎస్. యడియూరప్ప అడిగి తెలుసుకున్నారు.

COVID-19 మంత్రి అశోకుడి మాట

COVID-19 మంత్రి అశోకుడి మాట

బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ విధించాలని ఇప్పటికే బీబీఎంపీ మేయర్ గౌతమ్ కుమార్, బీబీఎంపీ కమిషనర్ అనీల్ కుమార్ (రెండు రోజుల ముందు బదిలీ అయ్యారు) ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇలాంటి సమయంలో బీబీఎంపీ కమిషనర్ అనీల్ కుమార్ ను బదిలీ చేశారు. బెంగళూరులో లాక్ డౌన్ పొడగించే విషయంపై బెంగళూరు సిటీకి చెందిన సీనియర్ మంత్రి, కర్ణాట COVID-19 నియంత్రణా కమిటీ ఇన్ చార్జ్ మంత్రి ఆర్. అశోక్ మీడియాతో మాట్లాడుతూ బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ విస్తరించం, ఈ విషయం ఇంతటితో మీరు వదిలేయండి అంటూ మీడియాకు సింపుల్ గా సమాధానం చెప్పారు. బీబీఎంపీ కొత్త కమిషనర్ ఎన్. మంజునాథ్ సైతం బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ పొడగించమని తేల్చి చెప్పారు.

 సీఎం అప్ప క్లారిటి

సీఎం అప్ప క్లారిటి

బెంగళూరు సిటీలో మళ్లీ లాక్ డౌన్ విధించే విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ విస్తరించే ఆలోచన తమకు లేదని, బుధవారం ఉదయంతో ( ఈనెల 22వ తేదీ)తో లాక్ డౌన్ గడువు ముగుస్తుందని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు.

డోంట్ వర్రీ ఫ్రెండ్స్

డోంట్ వర్రీ ఫ్రెండ్స్

లాక్ డౌన్ విస్తరించే విషయంలో బెంగళూరు ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, ధైర్యంగా మీ పనులు మీరు చేసుకోవడానికి సిద్దంగా ఉండాలని, ఈ ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద మళ్లీ లాక్ డౌన్ విస్థరిస్తారని ఆందోళన చెందుతున్న బెంగళూరు ప్రజలు సీఎం బీఎస్. యడియూరప్ప వివరణతో కొంచెం ఊపిరిపీల్చుకున్నారు. అయితే బుధవారం రాత్రిలోపు సీఎం బీఎస్. యడియూరప్ప ఏమైనా బాంబు పేల్చుతారా ? అని ప్రజలు మాత్రం టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.

English summary
Coronavirus: Ongoing week long lockdown in Bengaluru city will not be extended. There is no lockdown in city after July 22 said newly appointed BBMP commissioner N.Manjunatha Prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X