• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్: మార్చి 31 వరకు స్కూళ్లు బంద్..

|

దేశాన్ని గజగజలాడిస్తోన్న కొవిడ్-19(కరోనా వైరస్)పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరును ఉధృతం చేశాయి. వైరస్‌కు ఇప్పటిదాకా విరుగుడు మందు కనిపెట్టకపోవడంతో దాని వ్యాప్తిని అరికట్టే దిశగా కదులుతున్నాయి. కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం, ఢిల్లీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. దేశరాజధానిలోని అన్ని ప్రైమరీ స్కూళ్లను తక్షణమే మూసేయాలంటూ ఆదేశాలిచ్చాయి.

శుక్రవారం నుంచి ఈనెల 31 దాకా ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడేడ్, మున్సిపల్, ఎన్డీఎంసీ ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి మనీశ్ సిసోడియా ఉత్తర్వులు జారీచేశారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, విద్యార్థులెవరూ బయట తిరగకుండా ఇళ్లకే పరిమితం కావాలని ఆయన సూచించారు. కొద్దిసేపటికే కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) కూడా ఢిల్లీ పరిధిలోని అన్ని కేంద్రీయ స్కూళ్లలో ప్రైమరీ సెక్షన్లకు ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించింది.

Coronavirus Outbreak: All Primary Schools in Delhi to Be Closed till End of March, Mughal Gardens too

ఢిల్లీలోని ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో దేశంలో వైరస్ బాధితుల సంఖ్య 30కి పెరిగినట్లయింది. తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతోన్న ఆ వ్యక్తి.. ఇటీవలే ఇరాన్ నుంచి తిరిగొచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ చుట్టుపక్కల కొత్త కేసులు వెలుగులోకి వస్తుండటం, విదేశీ ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండటంతో స్కూళ్ల మూసివేతకు ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

మరోవైపు కరోనా సెగ రాష్ట్రపతి భవన్ ను కూడా తాకింది. భవన్ లోని ప్రఖ్యాత మొఘల్ గార్డెన్ సందర్శనను అధికారులు రద్దు చేశారు. శనివారం నుంచి మొఘన్ గార్డెన్ సందర్శనకు ప్రజలను అనుమతించబోమంటూ భవన్ ఉత్తర్వులు జారీచేసింది. ఇటు ఇండియాతోపాటు అటు యూరప్ లోనూ కరోనా తాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బ్రసెల్స్ పర్యటన వాయిదా పడింది. యురోపియన్ యూనియన్(ఈయూ) ప్రధాన కార్యాలయం ఉన్న బ్రసెల్స్ లో ఈనెల చివర్లో ఇండో-ఈయూ సదస్సు కోసం మోదీ వెళ్లాల్సి ఉండగా, సంప్రదింపుల అనంతరం సదస్సు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు.

ఇండియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. గురువారం సౌతాఫ్రికాలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. దీంతో వైరస్ అన్ని ఖండాలకూ వ్యాపించినట్లయింది. ఇప్పటిదాకా కరోనా బారినపడి చనిపోయినవాళ్ల సంఖ్య 3,200కు పెరిగింది.

English summary
amid Coronavirus Outbreak All Primary Schools in Delhi to Be Closed till End of March said Manish Sisodia. Rashtrapati Bhavan Mughal Gardens will be shut from Saturday. ndia-EU summit postponed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more